IPL 2022: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. గాయంతో సీజన్‌ మొత్తానికి దూరమైన ఆ స్టార్‌ ఆటగాడు..

|

May 09, 2022 | 9:12 PM

Mumbai Indians: పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) ఇప్పటికే ప్లే ఆఫ్‌ అవకాశాలు పూర్తిగా కోల్పోయింది. అయితే మిగిలిన మ్యాచ్ ల్లోనైనా గెలిచి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని రోహిత్ జట్టు భావిస్తోంది.

IPL 2022: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. గాయంతో సీజన్‌ మొత్తానికి దూరమైన ఆ స్టార్‌ ఆటగాడు..
Mumbai Indians
Follow us on

Mumbai Indians: ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్‌ ఈ సీజన్‌లో మాత్రం తన మ్యాజిక్‌ను రిపీట్‌ చేయలేకపోయింది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ఆ జట్టు విజయాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు10 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ సేన రెండింటిలో మాత్రమే విజయాలు సాధించి ఎనిమిదింటిలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) ఇప్పటికే ప్లే ఆఫ్‌ అవకాశాలు పూర్తిగా కోల్పోయింది. అయితే మిగిలిన మ్యాచ్ ల్లోనైనా గెలిచి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని రోహిత్ జట్టు భావిస్తోంది. తద్వారా పరువు దక్కించుకుని టోర్నీ నుంచి నిష్ర్కమించాలని ఆశిస్తున్న తరుణంలో ఆ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. నిలకడగా ఆడుతున్న స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav )గాయం కారణంగా ఐపీఎల్‌-2022 సీజన్‌ మొత్తానికే దూరమయ్యాడు. సోమవారం కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ.

ముందు జాగ్రత్తగానే..

ఇవి కూడా చదవండి

‘మే 6న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యాదవ్‌ ఎడమ చేయి కండరానికి గాయమైంది. దీంతో ఈ సీజన్‌లో మిగతా మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. బీసీసీఐ వైద్య బృందం అతడిని కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించింది’ అని ముంబై ఫ్రాంచైజీ తమ అధికారిక ట్విట్టర్‌లో పేర్కొంది. కాగా ఇక ఈ ఏడాది సీజన్‌లో ఆరంభ మ్యాచ్‌లకు కూడా గాయం కారణంగా దూరమయ్యాడు సూర్యకుమార్‌. ఆ తరువాత కోలుకుని ఆద్భుతంగా రాణించాడు. టోర్నీలో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్‌ 303 పరుగులు సాధించాడు. ముంబై జట్టులో అంతో ఇంతో నిలకడగా రాణిస్తోన్న సూర్యకుమార్‌ ఇప్పుడు సీజన్‌ మొత్తానికి దూరం కావడం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగానే భావించవచ్చు.


మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Viral Video: పెళ్లి మంటపాన్ని ముంచెత్తిన వర్షం.. అయినా వెనకడుగు వేయని వధూవరులు.. ఎలా ఏకమయ్యారో మీరే చూడండి..

Black Raisins: నల్ల ఎండు ద్రాక్షతో అద్భుత ప్రయోజనాలు.. రక్త హీనత, గుండె సమస్యలకు చక్కటి పరిష్కారం..

High Blood Pressure Diet: అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఈ సూపర్‌ ఫుడ్స్‌ తీసుకోవాల్సిందే..