IPL 2022: ఈ 4 కోట్ల ఆల్‌రౌండర్‌పై ధోని ఎన్నో ఆశలు.. టీమిండియాలో చోటు లభిస్తుందా..?

|

Feb 15, 2022 | 12:32 PM

IPL 2022: ఐపీఎల్ 2022ని గెలవడానికి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరోసారి బలమైన జట్టును తయారు చేసింది. ఇందులో హిట్టింగ్, బౌలింగ్‌కు పేరుగాంచిన

IPL 2022: ఈ 4 కోట్ల ఆల్‌రౌండర్‌పై ధోని ఎన్నో ఆశలు.. టీమిండియాలో చోటు లభిస్తుందా..?
Shivam Dube
Follow us on

IPL 2022: ఐపీఎల్ 2022ని గెలవడానికి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరోసారి బలమైన జట్టును తయారు చేసింది. ఇందులో హిట్టింగ్, బౌలింగ్‌కు పేరుగాంచిన ముంబైకి చెందిన ఒక గొప్ప ఆల్ రౌండర్ ఉన్నాడు. అతను ఎవరో కాదు 4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన శివమ్ దూబే. ఈ కొత్త ఆల్ రౌండర్‌పై ఎంఎస్ ధోని చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా దూబే మాట్లాడుతూ.. ధోనీ (ఎంఎస్ ధోని) కెప్టెన్సీలో ఆడేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నానని, మంచి ప్రదర్శనతో టీమిండియాకి తిరిగి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

శివమ్ దూబే మాట్లాడుతూ.. ‘నా కొడుకు నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టాడు. నా హీరో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ఆడాలనేది నా కల. ఇప్పుడు అది నిజమైంది. అతని కెప్టెన్సీలో ఎవరు ఆడినా బాగా రాణించడాన్ని నేను గమనించాను. మంచి ప్రదర్శన చేసి భారత జట్టులోకి పునరాగమనం చేయాలనుకుంటున్నాను’ అని చెప్పాడు. IPL 2022 వేలానికి ముందు శివమ్ దూబే తండ్రి అయ్యాడు. ఫిబ్రవరి 13 న చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఆల్ రౌండర్‌ను సొంతం చేసుకుంది. దీనిపై శివమ్ దూబే మాట్లాడుతూ ‘నా కొడుకు ఫిబ్రవరి 9న జన్మించాడు. మరుసటి రోజు నేను ముంబై రంజీ జట్టుతో కలిసి వెళ్లాను. నేను నా కొడుకుతో సమయం గడపలేకపోయాను’ అన్నాడు.

ఐపీఎల్ కంటే ముందు శివమ్ దూబే రంజీ ట్రోఫీలో రాణించాలనుకున్నాడు. దూబే డిసెంబర్ 2021లో బెంగాల్‌తో తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. చాలా కాలంగా అతను మ్యాచ్ ఆడలేదు కాబట్టి అతను బాగా రాణించాలనే ఉత్సాహంతో ఉన్నాడు. IPLలో శివమ్ దూబే 24 మ్యాచ్‌లలో 22.16 సగటుతో 399 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 120.54గా ఉంది. గత సీజన్‌లో దూబే 28.75 సగటుతో 230 పరుగులు చేశాడు. అయితే బౌలింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. 4 వికెట్లు మాత్రమే సాధించాడు. ఎకానమీ రేటు కూడా ఓవర్‌కు 8 పరుగుల కంటే ఎక్కువగా ఉంది.

LIC IPO: ఎల్ఐసీ IPOలో పెట్టుబడి పెడుతున్నారా.. కచ్చితంగా ఈ 10 విషయాలపై ఓ లుక్కేయండి..?

Viral Video: గేదె పిల్లపై అటాక్ చేసిన రెండు భారీ సింహాలు.. మరి తల్లి గేదె ఊరుకుంటుందా..?

IPL 2022: సురేశ్ రైనాని చెన్నై ఎందుకు వదిలేసింది.. కారణం వెల్లడించిన సీఈవో..?