RR vs KKR Score: శతకొట్టిన బట్లర్.. కోలకతా ముందు భారీ విజయ లక్ష్యం..
Rajasthan Royals vs Kolkata Knight Riders Score: ఐపీఎల్ 2022 (IPL 2022)లో భాగంగా ముంబై వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు దుమ్ములేపింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టుకు.. ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు...
Rajasthan Royals vs Kolkata Knight Riders Score: ఐపీఎల్ 2022 (IPL 2022)లో భాగంగా ముంబై వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు దుమ్ములేపింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టుకు.. ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. జోస్ బట్లర్(103) అద్భుత సెంచరీతో అదరగొట్టగా.. మరో ఓపెనర్ పడిక్కల్(24)తో ఆకట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 97 పరుగులు జోడించారు.
తొలి బంతి నుంచి దూకుడుగా ఆడిన బట్లర్.. ఈ సీజన్‌లో రెండో సెంచరీని నమోదు చేసుకున్నాడు. 61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. ఇక చివర్లో హిట్‌మెయిర్(26) మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఇక కోల్‌కతా బౌలింగ్ విషయానికొస్తే సునీల్ నరైన్ ఒక్కడే రెండు వికెట్లు తీసుకున్నాడు. శివమ్ మావి, కుమిన్స్, రస్సెల్ ఒక్కో వికెట్‌ను పడగొట్టారు.
IPL 2022: ఆ 8 కోట్ల ప్లేయర్‌కు తలనొప్పిగా మారిన హార్దిక్ పాండ్యా.. కొట్లాట తప్పేలా లేదుగా!
AP News: మంత్రి ఉష శ్రీచరణ్ కు వింత అనుభవం.. పూజలు చేస్తుండగా ఒడిలో కూర్చున్న వానరం