AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Umran Malik: భారత జట్టులోకి ఉమ్రాన్‌ మాలిక్‌ వస్తాడా.. ఐర్లాండ్‌తో జరిగే సిరిస్‌కు ఎంపికయ్యే అవకాశం..

జూన్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికా(South Africa)తో ఐదు, ఐర్లాండ్‌(Irland)తో రెండు టీ20లు ఆడనున్న నేపథ్యంలో ఫాస్ట్ బౌలింగ్ సంచలనం ఉమ్రాన్ మాలిక్‌(Umran Malik)కు జాతీయ జట్టులో అవకాశం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి...

Umran Malik: భారత జట్టులోకి ఉమ్రాన్‌ మాలిక్‌ వస్తాడా.. ఐర్లాండ్‌తో జరిగే సిరిస్‌కు ఎంపికయ్యే అవకాశం..
Umran Malik
Srinivas Chekkilla
|

Updated on: Apr 18, 2022 | 8:13 PM

Share

జూన్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికా(South Africa)తో ఐదు, ఐర్లాండ్‌(Irland)తో రెండు టీ20లు ఆడనున్న నేపథ్యంలో ఫాస్ట్ బౌలింగ్ సంచలనం ఉమ్రాన్ మాలిక్‌(Umran Malik)కు జాతీయ జట్టులో అవకాశం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారత్ జూన్ 9, 12, 14, 17, 20 తేదీల్లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. దీని తర్వాత జూన్ 26, జూన్ 28 తేదీల్లో ఐర్లాండ్‌లోని మలాహిడ్‌లో టీమ్ రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఐర్లాండ్ పర్యటనలో భారత ప్రధాన జట్టు ఇంగ్లాండ్‌లో ఉంటుంది. కాబట్టి ఈ పర్యటనలో కొత్త ఆటగాళ్లకు అవకాశం లభిస్తుంది. గతేడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఉమ్రాన్ భారత జట్టులో నెట్ బౌలర్‌గా ఎంపికయ్యారు. త్వరలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఫాస్ట్ బౌలర్ల గ్రూప్‌ను తయారు చేయాలని బీసీసీఐ(BCCI)ఆలోచనలో ఉంది.

ఈ పేస్‌ దళంలో ఉమ్రాన్‌కు ఇందులో చోటు దక్కే అవకాశం ఉంది. కీలక బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్ (ఫిట్ అయితే), మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ ఉన్నారు. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన ఉమ్రాన్, టి.నటరాజన్, అర్ష్‌దీప్ సింగ్‌లకు రానున్న రోజుల్లో జాతీయ జట్టులో అవకాశం దక్కవచ్చు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్, ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ జమ్మూకి చెందిన ఈ ఆటగాడిని మేధావిగా పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ క్రికెట్ లైవ్‌లో స్టెయిన్ మాట్లాడుతూ, ‘ఉమ్రాన్‌తో నా పని అతను వేగంగా పరిగెత్తేలా చూసుకోవడం, ఆటగాళ్లను భిన్నంగా ఆడేలా చేయడం.’ అని అన్నాడు.

చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఉమ్రాన్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అతను ప్రస్తుతం అతను అత్యంత వేగవంగా బౌలింగ్‌ చేయగల బౌలర్‌గా ఉన్నాడు. అతను క్రమం తప్పకుండా గంటకు 95 మైళ్ల (సుమారు 152 కిలోమీటర్లు) వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. అతను ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఈ బౌలర్‌తో భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా బాగా ఆకట్టుకున్నాడు. భారత జట్టులో ఉమ్రాన్‌ను చేర్చుకోవడానికి ఇదే సరైన సమయమని మాజీ ఓపెనర్, మహిళల జట్టు కోచ్ రామన్ అభిప్రాయపడ్డారు.

Read Also.. IPL 2022: 14 ఏళ్ల క్రితం ఐపీఎల్‌లో ఆడిన ఆ ఇద్దరు ఆటగాళ్లు.. ఇప్పుడు ఈ సీజన్‌లో కూడా ఆడుతున్నారు..