IPL 2022: జట్ స్పీడ్‌తో క్రీజులోకి వస్తూ.. అంతే వేగంతో పెవిలియన్ చేరుతోన్న దిగ్గజాలు.. అసలు కారణం ఆ బలహీనతలేనా?

భారీ హిట్టర్లుగా పేరుగాంచిన వీరు.. చాలా మ్యాచ్‌ల్లో తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడం కలవరపెడుతోంది. ఎన్నో మ్యాచ్‌లను ఒంటరిగా ఛేదించిన ఈ ఇద్దరూ.. ప్రస్తుతం ఫాంలేమితో బాధపడుతున్నారు.

IPL 2022: జట్ స్పీడ్‌తో క్రీజులోకి వస్తూ.. అంతే వేగంతో పెవిలియన్ చేరుతోన్న దిగ్గజాలు.. అసలు కారణం ఆ బలహీనతలేనా?
Rohit Kohli Ipl 2022
Venkata Chari

|

Apr 28, 2022 | 8:30 AM

రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli)లకు ఈ ఏడాది ఐపీఎల్ 2022 (IPL 2022) ఏమాత్రం కలిసిరాలేదు. భారీ హిట్టర్లుగా పేరుగాంచిన వీరు.. చాలా మ్యాచ్‌ల్లో తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడం కలవరపెడుతోంది. ఎన్నో మ్యాచ్‌లను ఒంటరిగా ఛేదించిన ఈ ఇద్దరూ.. ప్రస్తుతం ఫాంలేమితో బాధపడుతున్నారు. ఐపీఎల్ టోర్నీలో రోహిత్ 5,764 పరుగులు చేయగా, విరాట్ 6,411 పరుగులు చేశాడు. కానీ, ఈసారి వీరి బ్యాట్స్ అస్సలు మాట్లాడటం లేదు. ఫాస్ట్ బౌలర్ల ముందు ఇద్దరు దిగ్గజాల ప్రదర్శన మరీ పేలవంగా తయారైంది. 8 ఇన్నింగ్స్‌ల్లో ఇద్దరు ఆటగాళ్లు ఎలా వికెట్లు కోల్పోయారో ఇప్పుడు చూద్దాం..

8 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ ఎలా ఔట్ అయ్యాడంటే?

పేస్ బౌలర్ల ముందు రోహిత్ నిస్సహాయంగా కనిపించాడు. ముంబైని 5 సార్లు ఛాంపియన్‌గా మార్చిన రోహిత్ శర్మను పేసర్లు 8కి 7 సార్లు అవుట్ చేశారు. షార్ట్ బాల్ ముందు అతను అసౌకర్యంగా కనిపించాడు. ఈ సీజన్‌లో ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 14 సార్లు 0 పరుగులకే ఔట్ అయిన రికార్డును కూడా రోహిత్ తన పేరున లిఖించుకున్నాడు. ఒకప్పుడు హిట్‌మ్యాన్ ఎక్కువ పరుగులు చేసే షార్ట్ బాల్ అతని అతిపెద్ద బలహీనతగా మారింది.

1) ఢిల్లీ క్యాపిటల్స్‌పై కుల్దీప్ యాదవ్ వేసిన లెంగ్త్ బాల్‌పై రోహిత్ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి బ్యాట్ మధ్యలో తగలకపోవడంతో బౌండరీ క్లియర్ కాలేదు. కరేబీయన్ ఫీల్డర్ రోవ్‌మన్ పావెల్ డీప్ మిడ్ వికెట్ వద్ద సింపుల్ క్యాచ్ పట్టాడు.

2) రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ షార్ట్ అండ్ వైడ్ బౌలింగ్‌లో.. రోహిత్ భారీ షాట్ ఆడాడు. కానీ బంతి నేరుగా ఫీల్డర్ రియాన్ పరాగ్ చేతిలోకి వెళ్లింది. నిజానికి ఇది ట్రాప్. RR కెప్టెన్ వేసిన ప్లాన్‌లో రోహిత్ చిక్కుకున్నాడు. అదే షాట్ కోసం ఫీల్డర్‌ని ప్రత్యేకంగా ఉంచారు. చివరి క్షణంలో రోహిత్ తన షాట్‌ను చెక్ చేయలేకపోయాడు.

3) కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన ఉమేష్ వేసిన షార్ట్ డెలివరీలో రోహిత్ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. సామ్ బిల్లింగ్స్ ఫైన్ లెగ్‌కి పరుగెత్తి క్యాచ్ తీసుకున్నాడు. ఐపీఎల్‌లో ఐదోసారి రోహిత్ ఉమేష్ బంతికి ఔటయ్యాడు. ఉమేష్ యాదవ్‌తో ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 143 పరుగులు మాత్రమే చేశాడు.

4) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన హర్షల్ పటేల్ రోహిత్‌కి స్లో ఆఫ్ కట్టర్ బౌలింగ్ చేశాడు. రోహిత్ లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి బ్యాట్ అంచుకు తగిలి నేరుగా బౌలర్ చేతుల్లోకి వెళ్లింది.

5) ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన రబడా షార్ట్ బాల్‌ను హిట్‌మ్యాన్‌కి వేశాడు. రోహిత్‌కి చేయి తెరవడానికి చోటు కూడా దొరకలేదు. అప్పటికీ రోహిత్ శర్మ బంతిని లాగేందుకు ప్రయత్నించాడు. ఫలితంగా టాప్ ఎడ్జ్ హిట్ వైభవ్ అరోరా షార్ట్ ఫైన్ లెగ్ వద్ద సింపుల్ క్యాచ్ పట్టాడు.

6) 141.3 KMPH లెంగ్త్ బాల్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన అవేష్ హిట్‌మ్యాన్ రోహిత్‌కు సంధించాడు. థర్డ్ మ్యాన్ వైపు ఆడేందుకు ప్రయత్నించాడు. బౌలర్ అస్సలు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. డికాక్ వికెట్ వెనుక రొటీన్ క్యాచ్ పట్టాడు.

7) చెన్నై సూపర్ కింగ్స్‌పై బౌండరీ వైపు వర్ధమాన ఫాస్ట్ బౌలర్ ముఖేష్ చౌదరి ఇన్‌స్వింగర్‌ను కొట్టడానికి రోహిత్ ప్రయత్నించాడు. ఖాతా తెరవకుండానే మిడ్ ఆన్‌లో పట్టుకున్నారు. ఈ ఇన్నింగ్స్ తర్వాత, అతను IPL చరిత్రలో 0 పరుగులకే అత్యదిక సార్లు అవుట్ అయిన ఆటగాడిగా నిలిచాడు.

8) లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన కృనాల్ పాండ్యా డీప్ మిడ్ వికెట్ వద్ద ఫుల్ లెంగ్త్ బాల్‌ను రోహిత్ ఆడాలనుకున్నాడు. కానీ అది టాప్ ఎడ్జ్‌కి తగిలి షార్ట్ థర్డ్ మ్యాన్ వద్ద సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కృష్ణప్ప గౌతమ్ చేతిలో పడింది.

8 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ 7 సార్లు ఎలా ఔటయ్యాడంటే?

విరాట్‌ను ఐపీఎల్‌లో కింగ్‌గా పిలుస్తారు. కానీ, ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి లేదు. మైదానంలోకి విరాట్ ఎంత స్పీడ్‌తో వస్తున్నాడో, అదే స్పీడ్‌తో వెనక్కి వెళ్లున్నాడు. లీగ్‌లో టాప్ స్కోరర్ అయిన కోహ్లి 8 మ్యాచ్‌ల్లో రెండుసార్లు గోల్డెన్ డక్‌తో ఔట్ అయ్యాడు. గుడ్ లెంగ్త్ బంతిని కూడా అర్థం చేసుకోలేక పెవిలియన్ చేరుతున్నాడు. తొలి మ్యాచ్‌లో ఒక్కసారి మాత్రమే నాటౌట్‌గా నిలిచాడు.

1) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన సీజన్‌లో తొలి మ్యాచ్‌లో కోహ్లీ భారీ షాట్లు ఆడాడు. పంజాబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో జట్టు ఓడిపోయినప్పటికీ అతను నాటౌట్‌గా నిలిచాడు.

2) కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఉమేష్ వేసిన గుడ్ లెంగ్త్ బాల్‌పై విరాట్ షార్ట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బ్యాట్ వెలుపలి అంచు తగిలి బంతి వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ చేతుల్లోకి వెళ్లింది.

3) రాజస్థాన్ రాయల్స్‌పై యుజ్వేంద్ర చాహల్ వేసిన లెంగ్త్ బాల్ ప్యాడ్‌లను తాకింది. డేవిడ్ విల్లీ దానిని స్క్వేర్ లెగ్‌కి విదిలించాడు. మరో ఎండ్‌లో ఉన్న యుజ్వేంద్ర చాహల్‌కి శాంసన్ బంతిని అందించగా, చాహల్ కోహ్లీని రనౌట్ చేశాడు.

4) ముంబై ఇండియన్స్ పార్ట్ టైమ్ బౌలర్ డెవల్డ్ బ్రెవిస్ వేసిని ఓ బంతి ఫ్రంట్ లెగ్‌కు తగిలింది. ఎల్‌బీడబ్ల్యూ అప్పీల్ చేశాడు. అంపైర్ ఔట్ ఇచ్చాడు. కోహ్లి ఆత్మవిశ్వాసంతో రివ్యూ తీసుకున్నాడు. బ్యాట్ అంచున, ప్యాడ్‌కు దగ్గరగా బంతి కనిపించింది. విరాట్ ఔట్‌గా రిజల్ట్ వచ్చింది. అతను 2 పరుగుల తేడాతో అర్ధ సెంచరీని కోల్పోయాడు. ఈ సీజన్‌లో అతని బ్యాట్‌ నుంచి ఒక్క ఫిఫ్టీ స్కోరు కూడా రాలేదు.

5) చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ముఖేష్ చౌదరి వేసిన లెంగ్త్ బాల్‌ను బ్యాట్ మధ్యలో కొట్టడానికి ప్రయత్నించాడు. శివమ్ దూబే డీప్ స్క్వేర్ లెగ్ వద్ద రన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు.

6) లలిత్ యాదవ్ బంతిని పాయింట్ నుంచి స్టంప్ వరకు కొట్టగా, కోహ్లి ఈ సీజన్‌లో రెండోసారి రనౌట్ అయ్యాడు.

7) లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన దుష్మంత చమీరా నుంచి షార్ట్ లెంగ్త్ డెలివరీలో షార్ట్ ఆడాడు. బ్యాక్‌వర్డ్ పాయింట్ వద్ద దీపక్ హుడా క్యాచ్ పట్టాడు. కోహ్లీ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు.

8) కోహ్లి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన మార్కో యెన్సన్‌పై ఓపెన్ హ్యాండ్‌తో షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, లైన్‌ను మిస్ చేశాడు. రెండో స్లిప్‌లో విలియమ్సన్‌కి క్యాచ్ ఇచ్చాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. మొదటి 14 సీజన్లలో విరాట్ మూడుసార్లు గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఈసారి వరుసగా రెండు మ్యాచ్‌ల్లో తొలి బంతికే ఔటయ్యాడు.

దీంతో పేలవ ఫాంతో పోరాడుతోన్న ఈ ఇద్దరు దిగ్గజాలు.. ఎప్పుడు దారిలోకి వస్తారోనని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాగే ఆడితే, త్వరలో రాబోయే ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్‌లో భారత విజయావకాశాలకు భంగపాటు తప్పదని మాజీలు అంటున్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: DC Vs KKR IPL 2022 Match Prediction: ఢిల్లీని ఢీకొట్టేందుకు సిద్ధమైన కోల్‌కతా.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

GT vs SRH IPL 2022 Match Result: హైదరాబాద్‌ కొంపముంచిన మాజీ ప్లేయర్.. ఉత్కంఠ మ్యాచ్‌లో గుజరాత్‌దే విజయం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu