AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC Vs KKR IPL 2022 Match Prediction: ఢిల్లీని ఢీకొట్టేందుకు సిద్ధమైన కోల్‌కతా.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Delhi Capitals vs Kolkata Knight Ride Match Preview: గత మ్యాచ్‌లో నోబాల్ వివాదంతో ఇంటా, బయటా విమర్శలు ఎదుర్కొంది రిషభ్‌ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals). ఈ వివాదాన్ని మర్చిపోయి మళ్లీ విజయాల బాట పట్టాలని ఆ జట్టు భావిస్తోంది.

DC Vs KKR IPL 2022 Match Prediction: ఢిల్లీని ఢీకొట్టేందుకు సిద్ధమైన కోల్‌కతా.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..
Dc Vs Kkr
Basha Shek
|

Updated on: Apr 27, 2022 | 9:01 PM

Share

Delhi Capitals vs Kolkata Knight Ride Match Preview: గత మ్యాచ్‌లో నోబాల్ వివాదంతో ఇంటా, బయటా విమర్శలు ఎదుర్కొంది రిషభ్‌ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals). ఈ వివాదాన్ని మర్చిపోయి మళ్లీ విజయాల బాట పట్టాలని ఆ జట్టు భావిస్తోంది. ఈక్రమంలో గురువారం (ఏప్రిల్28)న రిషభ్‌ సేన కోల్‌కతా నైట్ రైడర్స్ ( KKR)తో తలపడనుంది. గత మ్యాచ్‌లో ఐసోలేషన్‌లో ఉన్న హెడ్‌కోచ్‌ రికీ పాంటింగ్‌ తిరిగి రానుండడం ఢిల్లీకి అనుకూలించవచ్చు. దీంతో టోర్నీ సెకండ్‌ ఫేజ్‌లో అయినా స్థిరంగా రాణించాలని టీం మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ కేవలం మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్‌ రేసులో ఉండాలంటే ఇప్పటినుంచి జరిగే ప్రతి మ్యాచ్‌ రిషభ్‌ సేనకు చాలా కీలకం. మరోవైపు టోర్నీ ప్రారంభంలో అదరగొట్టిన KKR ఆ తర్వాత వరుసగా పరాజయాలు ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన శ్రేయస్‌ జట్టు గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలు కావడం గమనార్హం. దీంతో ప్లే ఆఫ్‌ దశకు వెళ్లాలంటే ఆ జట్టు అద్భుతంగా రాణించాల్సి ఉంది. దీంతో ఈ మ్యాచ్‌ (DC Vs KKR) ఇరు జట్లకు ఎంతో కీలకం కానుంది.

బలంగానే ఉన్నా..

డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిషభ్‌ పంత్, రోవ్‌మన్ పావెల్‌ తో ఢిల్లీ బ్యాటింగ్ పటిష్ఠంగా ఉంది. అయితే వీరు నిలకడగా రాణించాల్సి ఉంది. వార్నర్ మరోసారి భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. పృథ్వీషా శుభారంభం అందిస్తున్నా వాటిని భారీస్కోర్లుగా మల్చలేకపోతున్నాడు. ఇక గత మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చి విఫలమైన సర్ఫరాజ్ ఖాన్‌కు మరోసారి అవకాశం వస్తుందో లేదో చూడాలి. కెప్టెన్ పంత్‌ ఇప్పటి వరకు తన పూర్తి స్థాయి ఆటతీరును ప్రదర్శించలేదు. అతనితో పాటు ముగ్గురు ఆల్‌రౌండర్లు లలిత్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ మరింత నిలకడగా రాణించాల్సి ఉంది. ఇతక గత మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన పావెల్‌ తన జోరును అలాగే కొనసాగించాల్సి ఉంది. ఇక రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా రాణించినప్పటికీ జోస్ బట్లర్‌ను మాత్రం కట్టడి చేయలేకపోయారు. ఆరంభంలో ఖలీల్ అహ్మద్ వికెట్లు తీస్తుండగా, ముస్తాఫిజుర్ రెహమాన్ అతనికి మంచి సహకారం అందిస్తున్నాడు. కుల్దీప్ యాదవ్ తన స్పిన్‌ మ్యాజిక్‌తో వికెట్లు తీస్తుండడం సానుకూలాంశం.

నిలకడ లేమితో సతమతం..

ఇక KKR విషయానికి వస్తే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో సహా మిగతా బ్యాటర్లందరూ నిలకడగా రాణించాల్సి ఉంది. గత మ్యాచ్‌లో శ్రేయస్‌ విఫలమయ్యాడు. ఓపెనింగ్ జోడీ సామ్ బిల్లింగ్స్, సునీల్ నరైన్ కూడా తక్కువ స్లోర్లకే వెనుదిరిగారు. వీరిద్దరికి మళ్లీ ఇన్నింగ్స్‌ ఓపెనింగ్‌ బాధ్యతలు అప్పగిస్తే..మరింత దూకుడుగా ఆడాల్సి ఉంది. అయితే ఢిల్లీ స్పిన్నర్లను ఎదుర్కోవడం శ్రేయస్, నితీష్ రాణా, రింకూ సింగ్, వెంకటేష్ అయ్యర్‌లకు అంత సులువేమీ కాదు. వెంకటేష్‌ను మిడిలార్డర్‌కు మార్చడం వల్ల పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే.. ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీలు బాగానే రాణిస్తున్నారు. అయితే స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్‌లో లేకపోవడం కేకేఆర్‌కు ప్రతికూలంగా మారింది.

గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే..

కాగా గత మ్యాచ్‌ల రికార్డులను ఒకసారి పరిశీలిస్తే కోల్‌కతాదే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు మొత్తం 31 మ్యాచ్‌లు తలపడగా.. కోల్‌కతా 16 సార్లు.. ఢిల్లీ 14 మ్యాచ్‌లు గెలిచింది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక ఈ సీజన్‌లో వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. ఏప్రిల్ 10న జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది రిషభ్‌ సేన.

ఇరు జట్ల ప్లేయింగ్ – XI ఎలా ఉండొచ్చంటే..

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ :

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్ (వికెట్‌ కీపర్‌), సునీల్ నరైన్, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి.

ఢిల్లీ క్యాపిటల్స్:

రిషబ్ పంత్(కెప్టెన్/ వికెట్ కీపర్ )పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, , రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్

టీవీ9లో నిరంతరం అప్‌డేట్స్‌..

కాగా ఢిల్లీ, కేకేఆర్‌ మధ్య జరిగే మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో వివిధ భాషలలో చూడవచ్చు. అదేవిధంగా డిస్నీ+హాట్‌స్టార్‌లో సబ్‌స్ర్కిప్షన్‌తో వీక్షించొచ్చు. వీటితో పాటు https://tv9telugu.com/ ద్వారా ఎప్పటికప్పుడు మ్యాచ్‌ అప్‌డేట్స్‌ను తెలుసుకోవచ్చు.

మరిన్ని క్రీడావార్తల  కోసం క్లిక్ చేయండి..

Also Read: 

ముంగిసను గడగడలాడించిన నాగుపాము.. చివరిలో ఊహించని ట్విస్ట్‌

Vladimir Putin: వ్లాదిమిర్ పుతిన్ అనారోగ్యంతో ఉన్నారా? రష్యా అధ్యక్షుడి ఆరోగ్యంపై ఊహాగానాల్లో నిజమెంత?

Vladimir Putin: వ్లాదిమిర్ పుతిన్ అనారోగ్యంతో ఉన్నారా? రష్యా అధ్యక్షుడి ఆరోగ్యంపై ఊహాగానాల్లో నిజమెంత?