GT vs SRH Highlights : ఉత్కంఠ పోరులో గుజరాత్‌ విజయం.. మెరిసిన సాహా, తెవటియా, రషీద్‌..

| Edited By: Srinivas Chekkilla

Updated on: Apr 27, 2022 | 11:28 PM

IPL 2022: చివరి బంతి వరకు జరిగిన పోరాటంలో హైదరాబాద్‌పై గుజరాత్‌ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది.

GT vs SRH Highlights : ఉత్కంఠ పోరులో గుజరాత్‌ విజయం.. మెరిసిన సాహా, తెవటియా, రషీద్‌..
Gt Vs Srh

చివరి బంతి వరకు జరిగిన పోరాటంలో హైదరాబాద్‌పై గుజరాత్‌ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పయి 199 పరుగులు  చేసి విజయం సాధించింది.

Key Events

మాలిక్‌, లాకీ మధ్య పోటీ..

సన్‌రైజర్స్‌లో ఉమ్రాన్ మాలిక్, గుజరాత్‌కు లాకీ ఫెర్గూసన్ ఉన్నారు. వేగంగా బంతులు విసురుతూ ప్రత్యర్థుల పని పడుతోన్న వీరు ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తారో చూడాలి.

ప్రతీకారేచ్చతో గుజరాత్‌

ఈటోర్నీలో గుజరాత్‌ కేవలం ఒక మ్యాచ్‌ లో మాత్రమే ఓటమిపాలైంది. అది కూడా సన్‌రైజర్స్‌ చేతిలో. దీంతో ప్రతీకారం తీర్చుకోవాలని హార్ధిక్‌ సేన భావిస్తోంది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 27 Apr 2022 11:23 PM (IST)

    ఉత్కంఠ పోరులో గుజరాత్ గెలుపు

    ఉత్కంఠ పోరులో గుజరాత్ గెలుపు

  • 27 Apr 2022 11:00 PM (IST)

    ఐదో వికెట్‌ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్‌

    గుజరాత్‌ టైటాన్స్ ఐదో వికెట్ కోల్పోయింది.

  • 27 Apr 2022 10:57 PM (IST)

    నాలుగో వికెట్‌ కోల్పోయిన గుజరాత్

    గుజరాత్‌ టైటాన్స్ నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో మిల్లర్‌ బౌల్డ్‌ అయ్యాడు.

  • 27 Apr 2022 10:41 PM (IST)

    వృద్ధిమాన్‌ సాహా ఔట్

    గుజరాత్‌ కీపర్ వృద్ధిమాన్‌ సాహా బౌల్డ్‌ అయ్యాడు.

  • 27 Apr 2022 10:20 PM (IST)

    హార్దిక్‌ పాండ్యా ఔట్‌

    గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఔటయ్యాడు.

  • 27 Apr 2022 10:11 PM (IST)

    తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్

    గుజరాత్‌ టైటాన్స్ తొలి వికెట్‌ కోల్పోయింది. ఉమ్రాన్‌ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌ ఔటయ్యాడు.

  • 27 Apr 2022 09:58 PM (IST)

    50 రన్స్‌ పూర్తి చేసుకున్న గుజరాత్..

    గుజరాత్ బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. వృద్ధిమాన్‌ సాహా (38), శుభ్‌మన్‌ (15) వేగంగా ఫోర్లు, సిక్స్‌ లు కొడుతున్నారు. దీంతో 5.4 ఓవర్లు ముగిసే సరికి 58 పరుగులు చేసింది.

  • 27 Apr 2022 09:47 PM (IST)

    ధాటిగా ఆడుతోన్న గుజరాత్‌..

    196 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ ధాటిగా ఆడుతోంది. వృద్ధిమాన్‌ సాహా (21), శుభ్‌మన్‌ (5) వేగంగా పరుగులు సాధిస్తున్నారు. దీంతో ఓ ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 31 పరుగులు చేసింది.

  • 27 Apr 2022 09:23 PM (IST)

    శశాంక్‌ మెరుపులు.. హైదరాబాద్‌ భారీ స్కోరు..

    ఫెర్గూసన్ వేసిన చివరి ఓవర్ లో శశాంక్‌ సింగ్ (6 బంతుల్లో 25 ఒక ఫోర్‌, 3 సిక్స్‌లు) రెచ్చిపోయాడు. అతనితో పాటు మార్కో జాన్సన్‌ మరొక సిక్స్‌ బాదడంతో ఆ జట్టు మొత్తం 25 పరుగులు పిండుకుంది. దీంతో గుజరాత్‌ ముందు 196 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

  • 27 Apr 2022 09:10 PM (IST)

    మరో వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌..

    గుజరాత్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తోంది. దీంతో హైదరాబాద్‌ వరుసగా వికెట్లు కోల్పోతుంది. వాషింగ్టన్‌ సుందర్ (3) రనౌట్‌గా వెనుదిరగడంతో ఆ జట్టు ఆరో వికెట్‌ కోల్పోయింది.

  • 27 Apr 2022 09:07 PM (IST)

    ఐదో వికెట్‌ డౌన్..

    ధాటిగా ఆడుతున్న మర్‌క్రమ్‌ (56) పెవిలియన్‌ చేరాడు. దయాల్‌ బౌలింగ్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన అతను బౌండరీ లైన్‌ వద్ద మిల్లర్‌ చేతిక చిక్కాడు. దీంతో హైదరాబాద్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం ఆజట్టు స్కోరు 18 ఓవర్లకు 161/5.

  • 27 Apr 2022 09:01 PM (IST)

    మర్‌క్రమ్‌ అర్ధసెంచరీ..

    మర్‌క్రమ్‌ మరోసారి సత్తాచాటాడు. 35 బంతుల్లోనే 51 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి. అతనికి తోడుగా సుందర్‌ (1) క్రీజులో ఉన్నాడు.

  • 27 Apr 2022 08:59 PM (IST)

    షమీ మూడో వికెట్‌.. పెవిలియన్‌ చేరిన పూరన్‌..

    భారీస్కోరు అందిస్తాడనుకున్న నికోలస్‌ పూరన్‌ (3) మళ్లీ నిరాశపర్చాడు. షమీ బౌలింగ్‌లో భారీ షాట్‌ కు ప్రయత్నించి బౌండరీ లైన్‌ వద్ద శుభ్‌మన్‌కు చిక్కాడు. ప్రస్తుతం ఆజట్టు స్కోరు 16.3 ఓవర్లలో 147/4.

  • 27 Apr 2022 08:51 PM (IST)

    హైదరాబాద్‌ మూడో వికెట్‌ డౌన్‌.. అభిషేక్‌ ఔట్‌..

    సన్‌రైజర్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. అర్ధసెంచరీ చేసిన అభిషేక్‌ శర్మ (65) అల్జారీ జోసెఫ్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. మరోవైపు మర్‌క్రమ్‌ (41)అర్ధ సెంచరీ వైపు సాగుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ స్కోరు 15.1 ఓవర్లలో 140/3.

  • 27 Apr 2022 08:34 PM (IST)

    అభిషేక్‌ శర్మ అర్ధ సెంచరీ..

    అభిషేక్‌ శర్మ అర్ధసెంచరీ (33 బంతుల్లో 51) పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌ లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 12 ఓవర్లు ముగిసే సరికి 112/2.

  • 27 Apr 2022 08:32 PM (IST)

    వంద దాటిన సన్‌రైజర్స్‌ స్కోరు..

    హైదరాబాద్‌ స్కోరు వంద పరుగులు దాటింది. అభిషేక్‌ శర్మ (44) అర్ధసెంచరీకి చేరువవుతుండగా మర్‌క్రమ్‌ (25) ధాటిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 11.2 ఓవర్లకు 103/2.

  • 27 Apr 2022 08:25 PM (IST)

    ఆచితూచి ఆడుతోన్న సన్‌రైజర్స్‌..

    సన్‌రైజర్స్‌ ఆచితూచి ఆడుతోంది. అభిషేక్‌ శర్మ (36) ధాటిగా ఆడుతుండగా.. మర్‌క్రమ్‌ (14) సంయమనంతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్‌ స్కోరు 84/2.

  • 27 Apr 2022 08:06 PM (IST)

    ముగిసిన పవర్‌ ప్లే..

    పవర్‌ ప్లే ముగిసే సరికి హైదరాబాద్‌ 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (21), మర్‌క్రమ్‌ (0) క్రీజులో ఉన్నారు.

  • 27 Apr 2022 08:00 PM (IST)

    షమీ రెండో ఝలక్‌..

    హైదరాబాద్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో రాహుల్‌ త్రిపాఠి (16) ఎల్బీగా వెనుదిరిగాడు. అభిషేక్‌ శర్మ (12) నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 5 ఓవర్లకు 44/2.

  • 27 Apr 2022 07:46 PM (IST)

    హైదరాబాద్‌ మొదటి వికెట్‌ డౌన్‌.. కేన్‌ మామ ఔట్‌..

    హైదరాబాద్‌కు మహ్మద్‌ షమీ షాక్‌ ఇచ్చాడు. ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (5) బౌల్డ్‌ చేశాడు. దీంతో 26 పరుగుల వద్ద సన్‌రైజర్స్‌ మొదటి వికెట్‌ కోల్పోయింది.

  • 27 Apr 2022 07:37 PM (IST)

    బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్‌..

    అభిషేక్‌ శర్మ, కేన్‌ విలియమ్సన్‌ బ్యాటింగ్‌కు దిగారు. గుజరాత్‌ తరఫున షమీ మొదటి బంతి అందుకున్నాడు. మొదటి ఓవర్లోనే హైదరాబాద్‌కు 11 పరుగులు వచ్చాయి.

  • 27 Apr 2022 07:11 PM (IST)

    వాషింగ్టన్‌ సుందర్‌ రీ ఎంట్రీ..

    గాయం కారణంగా జట్టుకు దూరమైన వాషింగ్టన్‌ సుందర్‌ మళ్లీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో సుచిత్‌ పెవిలియన్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.

  • 27 Apr 2022 07:04 PM (IST)

    టాస్‌ గెలిచిన గుజరాత్..

    గుజరాత్ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా టాస్‌ గెలిచి హైదరాబాద్‌ ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కాగా ఈ టోర్నీలో రెండోసారి బ్యాటింగ్ గెలిచిన జట్లే విజయం సాధిస్తున్నాయి. అయితే నిన్నటి మ్యాచ్ (RR vs RCB) లో మాత్రం మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థానే గెలిచింది. మరి నేటి మ్యాచ్ లో ఏం జరుగుతుందో..

Published On - Apr 27,2022 6:58 PM

Follow us
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
ఛీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్‌లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను ఇష్టపడ్డా.. ఆ తర్వాత..’
బ్రెయిన్‌ సర్జరీ తర్వాత ఇండొనేసియాలో పర్యటిస్తున్న సద్గురు
బ్రెయిన్‌ సర్జరీ తర్వాత ఇండొనేసియాలో పర్యటిస్తున్న సద్గురు
ప్రచారంలో దూసుకెళ్తున్న కేంద్రమంత్రి ధర్మంద్ర ప్రధాన్..
ప్రచారంలో దూసుకెళ్తున్న కేంద్రమంత్రి ధర్మంద్ర ప్రధాన్..
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!