Jos Buttler: జోస్ బట్లర్‌పై డబ్బుల వర్షం.. అవార్డుల ద్వారా చాలా సంపాదించాడు..!

Jos Buttler: IPL-2022లో ఇంగ్లండ్‌కు చెందిన జోస్ బట్లర్ బ్యాట్‌తో చాలా సందడి చేశాడు. రాజస్థాన్ రాయల్స్ అతడిని కొనుగోలు చేసింది. ఈసారి అతడి బ్యాట్ చాలా రికార్డులను బద్దలు కొట్టింది.

Jos Buttler: జోస్ బట్లర్‌పై డబ్బుల వర్షం.. అవార్డుల ద్వారా చాలా సంపాదించాడు..!
Jos Buttler
Follow us

|

Updated on: May 31, 2022 | 6:28 AM

Jos Buttler: IPL-2022లో ఇంగ్లండ్‌కు చెందిన జోస్ బట్లర్ బ్యాట్‌తో చాలా సందడి చేశాడు. రాజస్థాన్ రాయల్స్ అతడిని కొనుగోలు చేసింది. ఈసారి అతడి బ్యాట్ చాలా రికార్డులను బద్దలు కొట్టింది. జోస్ బట్లర్ ఈ సీజన్‌లో నాలుగు సెంచరీలు చేసి 17 మ్యాచ్‌ల్లో 863 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దీంతో పాటు ఒక సీజన్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీని సమం చేశాడు. రాజస్థాన్‌ ఫైనల్‌ వెళ్లడానికి అతిపెద్ద కారణం బట్లర్‌. కానీ జట్టును గెలిపించలేకపోయాడు. అయితే ఈ సీజన్‌లో బట్లర్‌ పరుగుల వర్షం కురిపించాడు దీంతో అతడిపై డబ్బుల వర్షం కురిసింది.

ఈ ఐపీఎల్‌లో బట్లర్ మొత్తం 37 అవార్డులు గెలుచుకున్నాడు. ఒక సీజన్‌లో అత్యధిక అవార్డులు గెలుచుకున్న ఆటగాడు ఇతడే. లీగ్ దశను పటిష్టంగా ప్రారంభించినా మధ్యలో కొంచెం డల్‌ అయ్యాడు. మళ్లీ ప్లేఆఫ్స్‌లో ఫామ్‌లోకి వచ్చి జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఈ సీజన్‌లో బట్లర్ మూడుసార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఇందుకు లీగ్ దశలో ఒక్కొక్క దానికి లక్ష రూపాయల చొప్పున అందుకున్నాడు. క్వాలిఫయర్స్‌లో ఈ అవార్డుకు ఐదు లక్షల రూపాయలు అందుకున్నాడు. ఈ విధంగా బట్లర్ ఈ అవార్డుల ద్వారా ఎనిమిది లక్షల రూపాయలు సంపాదించాడు.

పవర్ ప్లేయర్ అవార్డు

ఇవి కూడా చదవండి

లీగ్ దశలో నాలుగు సార్లు పవర్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. క్వాలిఫయర్-2లోనూ ఈ అవార్డును గెలుచుకున్నాడు. అంటే ఓవరాల్ గా ఐదుసార్లు ఈ అవార్డును గెలుచుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఒక్కో అవార్డుకు లక్ష రూపాయలు అంటే ఇక్కడ నుంచి ఐదు లక్షలు సంపాదించాడు. దీంతో పాటు అతను పవర్ ప్లేయర్ సీజన్‌కు ఎంపికయ్యాడు. దాని మొత్తం 10 లక్షలు కాబట్టి 15 లక్షలు గెలుచుకున్నాడు.

గేమ్ ఛేంజర్ అవార్డు

దీంతో పాటు లీగ్ దశలో నాలుగుసార్లు గేమ్ ఛేంజర్ అవార్డు అందుకున్నాడు. ప్లేఆఫ్స్‌లో రెండుసార్లు ఈ అవార్డును గెలుచుకోవడంలో విజయం సాధించాడు. అంటే మొత్తం ఆరుసార్లు ఈ అవార్డును గెలుచుకుని ఆరు లక్షల రూపాయలు సంపాదించాడు. దీంతో పాటు సీజన్ గేమ్ ఛేంజర్‌గా ఎంపికయ్యాడు. దీని ద్వారా 10 లక్షలు సంపాదించాడు. అంటే మొత్తం 16 లక్షల రూపాయలు గడించాడు. రెండుసార్లు సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ అవార్డులకి రెండు లక్షల రూపాయలు సంపాదించాడు.

అత్యధిక ఫోర్లు. సిక్సర్లు

ఒక మ్యాచ్‌లో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా బట్లర్ ఏడుసార్లు అవార్డు అందుకున్నాడు. ఈ అవార్డులో అతని వాటా లక్షల్లో వచ్చింది. దీంతో పాటు ఈ సీజన్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన అవార్డును అందుకున్నాడు. దీనికి రూ.10 లక్షలు వచ్చాయి. అంటే కేవలం ఫోర్లు కొట్టి 17 లక్షలు సంపాదించాడు. మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ఐదుసార్లు అవార్డు అందుకున్నాడు. దీంతో అతని వాటా ఐదు లక్షలకు చేరింది. అతను ఒక సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన అవార్డును గెలుచుకోవడంలో విజయం సాధించాడు. దీనికి రూ.10 లక్షలు అందుకున్నాడు. అంటే బట్లర్ ఈ సీజన్‌లో సిక్స్‌లు కొట్టడం ద్వారా 15 లక్షలు గెలిచాడు.

అత్యంత విలువైన ఆటగాడు

మూడుసార్లు అత్యంత విలువైన ఆటగాడిగా ఎంపికయ్యాడు. ప్రతిసారీ లక్ష రూపాయలు అంటే మొత్తం మూడు లక్షలు. అతను ఈ సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా ఎంపికయ్యాడు. దీని కారణంగా అతనికి 10 లక్షలు అంటే మొత్తం 13 లక్షలు వచ్చాయి. ఆరెంజ్ క్యాప్ కూడా సాధించాడు. దీనికి 10 లక్షలు అందుకున్నాడు. ఈ విధంగా ఈ సీజన్‌లో మొత్తం అదనపు సంపాదన 96 లక్షలు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు