IPL 2022: 12 మ్యాచ్‌లు.. 336 పరుగులు.. కానీ, అదే బలహీనత.. అదే తప్పు.. ఆ భారత ఆటగాడెవరంటే?

సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ కేవలం 8 బంతులు ఆడి 6 పరుగులు చేసి ఔటయ్యాడు. అతను ఔట్ అయిన తీరు శ్రేయాస్ బ్యాటింగ్‌పై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది.

IPL 2022: 12 మ్యాచ్‌లు.. 336 పరుగులు.. కానీ, అదే బలహీనత.. అదే తప్పు.. ఆ భారత ఆటగాడెవరంటే?
Ipl 2022 Mi Vs Kkr Shreyas Iyer

Updated on: May 10, 2022 | 3:53 PM

మే 9 సోమవారం సాయంత్రం కోల్‌కతా నైట్ రైడర్స్‌(Kolkata Knight Riders)కు ఎంతో అనుకూలమైంది. అత్యంత అస్థిరమైన ఈ సీజన్‌లో కనీసం తదుపరి మ్యాచ్ వరకు ప్లేఆఫ్‌లకు చేరుకోవాలనే వారి ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని KKR డూ ఆర్ డై మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)పై భారీ విజయాన్ని సాధించింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌(Shreyas Iyer)కి ఇది ఊరటనిచ్చే విజయం. కానీ వ్యక్తిగతంగా అది అతనికి ప్రత్యేకమైన రోజు మాత్రం కాదు. ఎందుకంటే అతను బ్యాట్‌తో బాగా సహకరించలేకపోయాడు. ఇది మాత్రమే కాదు, అతను అవుట్ అయిన విధానం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఈ సీజన్‌లో అతను నిరంతరం ఇలా ఔటవుతున్నాడు.

Also Read: IPL 2022: 4 ఓవర్లలో 5 వికెట్లు, ఒక మెయిడీన్, 10 పరుగులు.. మ్యాచ్‌ ఓడినా.. 5 రికార్డుల్లో తిరుగేలేని ‘ముంబై స్పీడ్‌స్టర్’..

నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు తరపున వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే, నితీష్ రాణా అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. సాధారణంగా మూడో స్థానంలో వచ్చే కెప్టెన్ శ్రేయాస్.. ఈసారి నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. ఈ సీజన్‌లో జట్టులానే మంచి ప్రదర్శన కనబరుస్తూ, కొన్నిసార్లు పేలవంగా రాణిస్తున్న శ్రేయాస్.. ఈ మ్యాచ్‌లోనూ బలమైన ఇన్నింగ్స్ ఆడతాడని భావించారు. అయితే అతను కేవలం 8 బంతులు ఆడి 6 పరుగులు చేసి, లెగ్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్‌కు బలి అయ్యాడు.

ఆ బౌలర్లపై ఆరోసారి బలి..

ఇవి కూడా చదవండి

శ్రేయాస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌లో కాకపోయినా.. ఇలా పెవిలియన్ చేరడం టీమ్‌ఇండియా కూడా కాస్త ఆందోళన కలిగించే అంశంగా మారింది. మణికట్టు స్పిన్నర్లకు అంటే సాధారణంగా లెగ్ స్పిన్నర్లకు లేదా చైనామెన్‌కు వ్యతిరేకంగా శ్రేయాస్ బ్యాటింగ్ చేయడంలో ఈ బలహీనత మరింత కొనసాగుతోంది. అశ్విన్‌పై ఇలా అవుట్‌ అవ్వడంతో, శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 2022లో ఆరోసారి మణికట్టు స్పిన్నర్లకు తన వికెట్‌ను సమర్పించుకున్నాడు.

ఇప్పటి వరకు ఆడిన మొత్తం 12 మ్యాచ్‌ల్లో శ్రేయాస్ 11 సార్లు ఔట్ కాగా అందులో 6 సార్లు మణికట్టు స్పిన్నర్లకు బలి అయ్యాడు. కుల్దీప్ యాదవ్ అతనిని రెండుసార్లు బలిపశువుగా చేశాడు. యుజ్వేంద్ర చాహల్, వనిందు హసరంగా, రాహుల్ చాహర్ కూడా ఒక్కోసారి ఔట్ చేశారు.

టీ20 ప్రపంచకప్‌కు పెరుగుతోన్న ఆందోళన..

శ్రేయాస్ అయ్యర్ సాధారణంగా స్పిన్నర్లకు వ్యతిరేకంగా చాలా మంది భారత బ్యాట్స్‌మెన్‌ల కంటే మెరుగ్గా రాణిస్తుంటాడు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలకు వ్యతిరేకంగా, అతను ముఖ్యంగా మణికట్టు స్పిన్నర్‌లకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు కనిపిస్తాడు. ఇది మాత్రమే కాదు, ఫాస్ట్ బౌలర్లపై షార్ట్ పిచ్ బంతుల్లో అతని బలహీనత కూడా మళ్లీ మళ్లీ బయటపడుతుంది. ఇటువంటి పరిస్థితిలో, ఆస్ట్రేలియాలో జరిగే T20 ప్రపంచ కప్‌కు టిక్కెట్‌ దక్కాలంటే శ్రేయాస్ ఈ రెండు లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.

మరిన్ని ఐపీఎల్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Dinesh Karthik: ఐపీఎల్‌ 2022లో సత్తా చాటుతున్న దినేష్ కార్తీక్‌.. టీమిండియాలో చోటు దక్కేనా..

IPL 2022: 4 ఓవర్లలో 5 వికెట్లు, ఒక మెయిడీన్, 10 పరుగులు.. మ్యాచ్‌ ఓడినా.. 5 రికార్డుల్లో తిరుగేలేని ‘ముంబై స్పీడ్‌స్టర్’..