ఏ ప్లేస్‌లో ఆడేందుకైనా సిద్ధం- పంత్

ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో  పేలవ ప్రదర్శన చేసి విమర్శలు మూటగట్టుకున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్‌ పంత్‌ ఐపీఎల్‌-12లో వీరవిహారం చేశాడు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య ఐపీఎల్ మూడో మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి 27 బంతుల్లో 78 (7×4, 7×6) పరుగులు చేశాడు. దీంతో సొంత మైదానం వాంఖడే స్టేడియంలోని ముంబై అభిమానులుకు షాక్ ఇచ్చాడు పంత్. మొదటగా […]

ఏ ప్లేస్‌లో ఆడేందుకైనా సిద్ధం- పంత్
Follow us

|

Updated on: Mar 25, 2019 | 1:00 PM

ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో  పేలవ ప్రదర్శన చేసి విమర్శలు మూటగట్టుకున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్‌ పంత్‌ ఐపీఎల్‌-12లో వీరవిహారం చేశాడు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య ఐపీఎల్ మూడో మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి 27 బంతుల్లో 78 (7×4, 7×6) పరుగులు చేశాడు. దీంతో సొంత మైదానం వాంఖడే స్టేడియంలోని ముంబై అభిమానులుకు షాక్ ఇచ్చాడు పంత్. మొదటగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. పంత్‌ చెలరేగడంతో 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై 37 పరుగుల తేడాతో ఓడిపోయింది.

మ్యాచ్ అనంతరం రిషభ్‌ పంత్‌ మాట్లాడుతూ…జట్టు అవసరాలను బట్టి ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధం. ఇది ఒక గొప్ప ప్రయాణం. నా క్రికెట్ కెరీర్ లో ప్రతీరోజూ కొత్త మెళకువలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా. పరుగులు చేసినపుడు జట్టు విజయం సాధిస్తే.. అది ఓ గొప్ప అనుభూతి. పరిస్థితులను బట్టి బ్యాటింగ్‌ శైలిని మార్చుకుంటా.  జట్టులో ఎవరూ భారీ ఇన్నింగ్స్‌ ఆడలేదని.. ఒకవేళ టాప్‌ ఆర్డర్‌లో ఎవరైనా 70-80 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేదని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా.. టీ20ల్లో ఏదైనా కొత్తగా చెయ్యాలి. ప్రత్యర్థి బౌలర్లు అవకాశం తీసుకునేలోపే.. మనమే అవకాశం తీసుకోవాలని పంత్‌ తెలిపారు.