Team India: నుదుట బొట్టు.. బక్కపలచని దేహం.. భారత జట్టులో ఎవరితను?

టీ20 వరల్డ్ కప్ లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఆ క్షణం ఎన్నో మధురానుభూతులు మిగిల్చింది. భారత ఆటగాళ్లు భావోద్వేగానికి గురవడం.. కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ కళ్ళ లో కూడా నీళ్ళు చెమిరాయి. టీమ్ ఇండియా సంబరాలు చేసుకుంటుండగా.. ఆటగాళ్లతో పాటు.. హెడ్ కోచ్ ద్రావిడ్ తోపాటు భారత్ జట్టు విజయం వెనక దాగి ఉన్న సపోర్టింగ్ స్టాఫ్ అంతా కనిపించారు

Team India: నుదుట బొట్టు.. బక్కపలచని దేహం.. భారత జట్టులో ఎవరితను?
Raghavendra Dwivedi
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Basha Shek

Updated on: Jul 05, 2024 | 7:59 PM

టీ20 వరల్డ్ కప్ లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఆ క్షణం ఎన్నో మధురానుభూతులు మిగిల్చింది. భారత ఆటగాళ్లు భావోద్వేగానికి గురవడం.. కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ కళ్ళ లో కూడా నీళ్ళు చెమిరాయి. టీమ్ ఇండియా సంబరాలు చేసుకుంటుండగా.. ఆటగాళ్లతో పాటు.. హెడ్ కోచ్ ద్రావిడ్ తోపాటు భారత్ జట్టు విజయం వెనక దాగి ఉన్న సపోర్టింగ్ స్టాఫ్ అంతా కనిపించారు. వీళ్లంతా ఏనాడు పైకి కనపడరు. ఆట జరుగుతున్నప్పుడు కానీ.. ఆట ముగిశాక కానీ.. అసలు వాళ్ళు భారత జట్టుతో పాటు ఉన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. కానీ… ఒకరకంగా చెప్పాలంటే టీమ్ ఇండియా ఆటగాళ్ళ విజయం వెనక మాత్రమే కాదు.. ఒక్కో ప్లేయర్ వ్యక్తిగత ప్రదర్శన వెనక కూడా వీళ్ళ కష్టం చాలానే ఉంది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఆటగాళ్లతో పాటు.. ఓ బక్క పలచని వ్యక్తి, నుదుట బొట్టు పెట్టుకుని, అమాయకంగా నిలబడి ఉంటాడు. సాధారణ వ్యక్తిలా కనిపించే అతను ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఒకరకంగా అతను టీమ్ ఇండియా వెన్నెముక గా చెప్తారు. రోహిత్ శర్మ, కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్ళు కూడా ఈ వ్యక్తి గురించి గొప్పగా చెప్తుంటారు.

24 ఏళ్ల క్రితం.. 21 రూపాయలతో ఇంటి నుంచి పారిపోయిన ఓ బాలుడు ఇప్పుడు భారత్ విశ్వ విజేతగా నిలవడంలో కీలక వ్యక్తిలా మారాడు. కర్నాటక కు చెందిన ఆ అసామాన్య వ్యక్తే.. రాఘవేంద్ర ద్వివేది.

క్రికెటర్ కావాలని ఎన్నో కలలు కన్నాడు రాఘవేంద్ర ద్వివేది. బాలుడిగా ఉన్న సమయంలోనే విధి వెక్కిరించింది. చిన్నతనంలోనే చేయి విరిగింది. క్రికెటర్ అవ్వాలనుకున్న ద్వివేది కల చెదిరింది. అయినా సరే.. కుంగిపోలేదు. నిరాశ కు లోనవలేదు. ఎక్కడ కొల్పోయానో.. అక్కడే వెత్తుక్కోవాలనుకున్నాడు. కష్టపడ్డాడు.. అడ్డంకులను ఎదిరించాడు.. భారత జట్టులో కీలక వ్యక్తి స్థాయికి చేరుకున్నాడు.. నేడు వరల్డ్ కప్ సాధించి పెట్టాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా.. విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. రాఘవేంద్ర ద్వివేది గురించి చెప్పడంతో.. ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. “ఈ రోజు నా విజయంలో ఈ వ్యక్తి చాలా పెద్ద పాత్రను కలిగి ఉన్నాడు. కానీ అతని కృషి కొన్నిసార్లు ప్రపంచం గుర్తించదు ” అని ద్వివేది గురించి కోహ్లీ గొప్పగా చెప్పాడు.

ఇవి కూడా చదవండి

నిజానికి… రాఘవేంద్ర ద్వివేది తెర వెనుక పనిచేస్తాడు. అతను భారత క్రికెట్ జట్టుకు వెన్నెముక, నిరంతరంగా ఆటగాళ్లకు మద్దతు ఇస్తాడు. అతను టీమ్ ఇండియా త్రోడౌన్ స్పెషలిస్ట్. నార్త్ కర్నాటక జిల్లాలోని కుమటాకు చెందిన రాఘవేంద్ర… భారత క్రికెట్ జట్టుకు బ్యాక్ బోన్. గత 13 ఏళ్లుగా భారత జట్టు కోసం ఎవరైనా రక్తాన్ని చిందించారు అంటే.. అతను ఈ రాఘవేంద్రనే.

2011లో త్రోడౌన్ స్పెషలిస్ట్‌గా భారత జట్టులో చేరిన రఘు… గత పదేళ్ళలో ప్రాక్టీస్ సెషన్‌లలో కనీసం 1 మిలియన్ బంతులు విసిరి ఉండవచ్చు. 150 కి మీటర్ స్పీడ్ తో వచ్చే రాఘవేంద్ర డెలివరీలను ఎదుర్కోవాలంటే టాప్ బ్యాటర్లకు కూడా సాధ్యం అయ్యేది కాదు. తల పైనుంచి వెళ్తున్న బౌన్సర్ ను కూడా రోహిత్ శర్మ అప్రయత్నంగా సిక్సర్ కొట్టినా… ఫాస్ట్ అండ్ బౌన్సీ బాల్స్ కి వ్యతిరేకంగా విరాట్ కోహ్లి షాట్ ఆడినా… ఇంతటి అపారమైన బలం, నైపుణ్యం కోహ్లీ, రోహిత్ లో వచ్చాయంటే కారణం రాఘవేంద్ర.

“నెట్స్‌లో రఘు 150 కి.మీ. వేగంతో డెలివరీలను ఎదుర్కుని ప్రాక్టీస్ చేయడం వల్ల.. మ్యాచ్‌ల సమయంలో ఫాస్టెస్ట్ బౌలర్లు మీడియం పేసర్‌లుగా కనిపించేవాళ్ళు ” అని విరాట్ కోహ్లీ ఓ సందర్భంలో చెప్పాడు. ఇంతటి గొప్ప వ్యక్తి ఎవరో… ఇప్పటికే క్రికెట్ లోకానికి పెద్దగా తెలియదు.

” జీవితంలో అంతా ఐపోయింది… ఇక బతికి వృథా ” అనుకునే వాళ్ళందరినీ రాఘవేంద్ర ద్వివేది జీవితం గొప్ప ఆదర్శప్రాయం. రాఘవేంద్రకు క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం. కానీ… అతని తండ్రికి క్రికెట్ అంటే ఎలర్జీ. అతని క్రికెట్ వ్యామోహం చూసి ఒకరోజు అతని తండ్రి “నీకు చదువు, జీవితం ముఖ్యమా..? లేక క్రికెట్ అంతకన్నా ముఖ్యమా..? అని గట్టిగా మందలించాడు. దీంతో మొహమాటం లేకుండా రఘు వెంటనే… జేబులో ఉన్న 21 రూపాయలతో బ్యాగ్ భుజాన వేసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. నేరుగా హుబ్లీ వెళ్లాడు. అప్పుడు రఘు వయసు 21 ఏళ్లు. వారం రోజుల పాటు హుబ్లీ బస్టాండ్‌లో పడుకున్నాడు. పోలీసులు తరిమికొట్టడంతో పదిరోజుల పాటు సమీపంలోని దేవాలయంలో ఆశ్రయం పొందాడు. చివరికి… రఘు ను గమనించి ఆలయంలో నుంచి కూడా వెళ్ళిపొమ్మని చెప్పారు. దీంతో అక్కడే ఉండే శ్మశానవాటిక ను స్థావరంగా చేసుకున్నాడు. అక్కడే తిండి.. అక్కడే నిద్ర.

శ్మశానవాటికలో ఒక పాడుబడిన భవనాన్ని తన ఇంటిగా చేసుకున్నాడు. నాలుగున్నరేళ్లుగా రాఘవేంద్ర శ్మశాన వాటికలోనే ఉన్నాడు. ఈ సమయంలోనే.. అతని కుడి చేయి విరిగింది. క్రికెట్ ఆడాలనే అతని కల ముగిసినట్టే అనుకున్నాడు. దేనికోసం అయితే తల్లి, తండ్రి, ఇల్లు, ఊరు, అయిన వాళ్ళందరినీ వదులుకుని వచ్చాడో.. ఆ కల చెదిరింది. కానీ… ఎలాగైనా తాను అనుకున్నది సాధించాలి అనుకున్నాడు. క్రికెట్ ఆడకపోయినా సరే… తన జీవితం క్రికెట్ లో ఓ భాగమైపోవాలి అనుకున్నాడు. హుబ్లీలోని ఓ క్రికెట్ గ్రౌండ్ లో పనిలో చేరాడు. ఆటగాళ్లకు బాల్స్ విసరడం, ప్రాక్టీస్‌లో ప్లేయర్లకు సహాయకుడిగా ఉన్నాడు. అక్కడ పరిచయమైన ఓ స్నేహితుడు రఘును బెంగళూరుకు తీసుకెళ్లాడు. బెంగళూరులో కర్ణాటక ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ తనకు ఆశ్రయం ఇచ్చింది. ప్రాక్టీస్‌కు వచ్చిన కర్ణాటక క్రికెటర్లకు బౌలింగ్ చేయడం… బౌలింగ్ మెషీన్‌లో వారికి సహాయం చేయడం రఘు పని.

కర్ణాటక మాజీ వికెట్ కీపర్, ప్రస్తుత అండర్-19 సెలక్షన్ కమిటీ చీఫ్ తిలక్ నాయుడు రఘు పనిని గమనించాడు. రాఘవేంద్ర అంకితభావానికి ముగ్ధుడైన తిలక్ నాయుడు అతనికి మరో మాజీ కర్ణాటక క్రికెటర్ జవగల్ శ్రీనాథ్‌ని పరిచయం చేశాడు. ఇదే రాఘవేంద్ర జీవితంలో కీలక మలుపు.

రాఘవేంద్ర చిత్తశుద్ధిని గుర్తించిన శ్రీనాథ్ కర్ణాటక రంజీ జట్టులోకి రావాల్సిందిగా ఆహ్వానించాడు. క్రికెట్ సీజన్‌లో కర్ణాటక జట్టుతో కలిసి పనిచేసి, పని లేనప్పుడు చిన్నస్వామి స్టేడియం సమీపంలోని జాతీయ క్రికెట్ అకాడమీలో సేవలందించాడు. ఇలా 4 ఏళ్లుగా రాఘవేంద్ర ఎలాంటి జీతం లేకుండా పనిచేశాడు. డబ్బులు లేకపోవడంతో.. రోజుల తరబడి పస్తులుండి.. మంచి నీళ్ళనే ఆహారంగా చేసుకున్నాడు. NCAలో ఉన్నప్పుడు… రఘు BCCI లెవల్-1 కోచింగ్ కోర్సు పూర్తి చేశాడు. ప్రాక్టీస్‌కు వచ్చిన భారత జట్టు క్రికెటర్ల దృష్టిలో పడటమే కాదు.. వాళ్ళ ఫేవరెట్‌గా మారాడు. రాఘవేంద్ర ట్యాలెంట్ ను గుర్తించిన సచిన టెండూల్కర్ 2011లో టీమ్ ఇండియా సపోర్టింగ్ స్టాఫ్ లో స్థానం కల్పించాడు.

ఇలా… గత 13 ఏళ్లుగా టీమ్ ఇండియా తో కలిసి పనిచేశాడు. ఎన్నో విజయాల్లో తెర వెనుక ఉండి కీలక పాత్ర పోషించాడు. రాఘవేంద్ర ద్వివేది అనితర కృషికి ఫలితమే టీ20 వరల్డ్ కప్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
నల్ల జీలకర్రతో నమ్మలేని బెనిఫిట్స్..! అద్భుత ప్రయోజనాలు తెలిస్తే
నల్ల జీలకర్రతో నమ్మలేని బెనిఫిట్స్..! అద్భుత ప్రయోజనాలు తెలిస్తే
ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!