Asad Rauf: అంపైరింగ్‌తో ఆకాశమంత కీర్తి.. ఆ మాయని మచ్చతో బట్టలు, బూట్ల దుకాణాలు నడుపుకోవాల్సి వచ్చింది

|

Sep 15, 2022 | 4:37 PM

Asad Rauf Death: ఐసీసీ మాజీ అంపైర్, పాకిస్తాన్‌ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అసద్ రవూఫ్ (66) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించినట్లు సోదరుడు తాహిర్ రవూఫ్ తెలియజేశారు. లాహోర్‌లోని తన దుకాణాన్ని మూసివేసి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అసద్‌కు ఛాతీలో నొప్పి వచ్చిందని,

Asad Rauf: అంపైరింగ్‌తో ఆకాశమంత కీర్తి.. ఆ మాయని మచ్చతో బట్టలు, బూట్ల దుకాణాలు నడుపుకోవాల్సి వచ్చింది
Asad Rauf
Follow us on

Asad Rauf Death: ఐసీసీ మాజీ అంపైర్, పాకిస్తాన్‌ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అసద్ రవూఫ్ (66) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించినట్లు సోదరుడు తాహిర్ రవూఫ్ తెలియజేశారు. లాహోర్‌లోని తన దుకాణాన్ని మూసివేసి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అసద్‌కు ఛాతీలో నొప్పి వచ్చిందని, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే తుదిశ్వాస విడిచారని తాహిర్‌ తెలిపారు. పాకిస్తాన్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌గానూ, ఆతర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైర్‌గానూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అసద్‌ మరణానికి ముందు వరకు ఓ సెకండ్‌ హ్యాండ్‌ బట్టల దుకాణంతో పాటు ఓ చెప్పుల దుకాణం నిర్వహించేవారు. ఇంతకీ తనకు ఆ దుస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు

అసద్‌ రవూఫ్ అంపైరింగ్ ప్రయాణం 1998లోనే మొదలైంది. అయితే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అడుగుపెట్టింది మాత్రం 2000లో. ఆ ఏడాది పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌కు మొదటిసారిగా అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. నాలుగేళ్ల తర్వాత అంటే 2004లో ICC అంతర్జాతీయ ప్యానెల్‌లో సభ్యుడిగా చేరాడు. కాగా రవూఫ్‌కు మొత్తం170 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అంపైరింగ్ అనుభవం ఉంది. వీటిలో 49 టెస్టులు, 23 టీ20లు, 98 వన్డేలు ఉన్నాయి. ఇవి కాకుండా15 టెస్ట్ మ్యాచ్‌లలో టీవీ అంపైర్ పాత్రను కూడా పోషించాడు. ఇలా అసద్ రవూఫ్ అంపైరింగ్ కెరీర్ (2000-2013) 13 ఏళ్ల వరకు దిగ్విజయంగా కొనసాగింది.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ తో యూటర్న్..

అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో 2013లో ఐపీఎల్‌తో రవూద్‌ జీవితం యూటర్న్‌ తీసుకుంది. అతనిపై స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో ముంబై పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్ నిందితుడిగా మారాడు. ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న రవూఫ్ ఐపీఎల్ మధ్యలో భారత్‌ను విడిచివెళ్లాల్సి వచ్చింది. ఆతర్వాత ఛాంపియన్స్‌ ట్రోఫీ అంపైరింగ్‌ బాధ్యతల నుంచి కూడా ఐసీసీ అతనిని తొలగించింది. ఇక 2016లో అవినీతి ఆరోపణలపై బీసీసీఐ అసద్‌పై ఐదేళ్ల నిషేధం విధించింది. కాగా అసద్ తన చివరి రోజుల్లో లాహోర్‌లోని లాండా బాజాలో షూ-క్లాత్సింగ్ షాప్ నడుపుతున్నాడు. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు కూడా వైరలయ్యాయి. అసద్ రవూఫ్ అంపైరింగ్ కంటే ముందు పాకిస్థాన్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా ఆడాడు.1977 నుండి 1991 వరకు మొత్తం 71 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో దేశవాలీ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..