IPL 2023 Auction: ఐపీఎల్ మినీ వేలానికి డేట్ ఫిక్స్.. 3 ఏళ్ల తర్వాత పాత ఫార్మాట్..
IPL 2023 వేలం డిసెంబర్ 16న బెంగళూరులో జరగనుంది. ఈ ఏడాది జట్ల పర్స్‌లో ఐదు కోట్ల రూపాయలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) తదుపరి సీజన్ వేలం డిసెంబర్ 16న బెంగళూరులో జరగనుంది. అయితే, ఈ సారి ఐపీఎల్ పాత ఫార్మాట్ ప్రకారం జరగనుందని బీసీసీఐ తెలిపింది. అంటూ మూడేళ్ల తర్వాత ఈ ఫార్మాట్ జరగనుంది. 16వ సీజన్ మార్చి చివరి వారంలో ప్రారంభం కానుంది. 2019 నుంచి రెండు సీజన్‌లు భారతదేశం వెలుపల జరిగాయి. భారతదేశంలో 2021 సీజన్ ప్రారంభమైంది. అయితే మధ్యలో కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు రావడంతో సీజన్‌ను యూఏఈకి మార్చాల్సి వచ్చింది.
2022 సీజన్ పూర్తిగా భారతదేశంలోనే జరిగింది. అయితే సీజన్‌లోని లీగ్ దశ మ్యాచ్‌లు కేవలం మూడు నగరాల్లో మాత్రమే నిర్వహించనున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ప్లేఆఫ్‌లు జరిగాయి.
IPL 2022 కోసం జరిగిన మెగా వేలంలో, జట్లకు రూ. 90 కోట్ల పర్స్ లభించింది. అయితే ఈ ఏడాది వేలం కోసం దానిని రూ. 95 కోట్లకు పెంచవచ్చని తెలుస్తోంది. గతేడాది మెగా వేలం జరిగింది. అయితే ఈ సీజన్‌కు మినీ వేలం ఉంటుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ప్రెసిడెంట్ పదవి నుంచి వైదొలగే ముందు, సౌరవ్ గంగూలీ స్టేట్ అసోసియేషన్‌కు పంపిన లేఖలో ఈసారి లీగ్‌ను హోమ్, ఎవే ఫార్మాట్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.