
బెంగళూరులో ఈ రోజు మరణించిన భారత మాజీ పేసర్ డేవిడ్ జాన్సన్ గౌరవార్థం గురువారం బార్బడోస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ట20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు నల్లటి బ్యాండ్‌లను ధరించి, నివాళులు అర్పించారు.
సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో అరంగేట్రం చేసిన టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్, ఫాస్ట్ బౌలర్ డేవిడ్ జాన్సన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. మీడియా నివేదికల ప్రకారం, డేవిడ్ జాన్సన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను తన అపార్ట్మెంట్‌లోని నాల్గవ అంతస్తు నుంచి కిందికి దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు.
డేవిడ్ జాన్సన్ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. డేవిడ్ జాన్సన్ 1971 లో జన్మించాడు. అతని వయస్సు 52 సంవత్సరాలు. అతను బెంగళూరులో నివసిస్తున్నాడు. అతను 1996లో న్యూ ఢిల్లీలో జరిగిన వన్-ఆఫ్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాతో టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆ గేమ్‌లో అతను మైఖేల్ స్లేటర్‌ను అవుట్ చేశాడు.
Team India will wear black armbands today in memory of former Indian fast bowler David Johnson, who passed away on Thursday. pic.twitter.com/dhFiwjnWSs
— BCCI (@BCCI) June 20, 2024
ఈ రైట్ ఆర్మ్ బౌలర్ దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఉన్నాడు. అయితే, ఆ సిరీస్‌లో మొదటి టెస్ట్ మాత్రమే ఆడాడు. హెర్షెల్ గిబ్స్, బ్రియాన్ మెక్‌మిలన్ వికెట్లు పడగట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్క డ క్లిక్ చేయండి..