Indian Cricketer: మ్యాచ్ మధ్యలో హార్ట్‌ఎటాక్‌తో టీమిండియా ప్లేయర్ మృతి..
ఓ మ్యాచ్లో గుండెపోటుతో క్రికెటర్ మృతి చెందిన ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతి చెందిన క్రికెటర్ ఎవరు? అసలు మ్యాటరేంటి?
గరవాడే క్రికెట్ స్టేడియంలో లక్కీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, యంగ్ XI మధ్య జరిగిన మ్యాచ్‌లో 35 ఏళ్ల ఇమ్రాన్ లక్కీ బిల్డర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో లక్కీ బిల్డర్స్ తరఫున ఆడుతున్న ఇమ్రాన్ పటేల్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ ఆరో ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. అయితే ఆ తర్వాత ఇమ్రాన్‌కు ఒక్కసారిగా ఛాతీ నొప్పి వచ్చింది. దీంతో ఇమ్రాన్ 7వ ఓవర్ ప్రారంభానికి ముందే అంపైర్‌కు ఈ విషయాన్ని తెలిపాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మైదానంలో ఉన్న అంపైర్లు వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.
ఇమ్రాన్ మైదానం నుండి బయటకు వెళ్లాడు. కానీ అతను బౌండరీకి చేరుకున్న వెంటనే అకస్మాత్తుగా పడిపోయాడు. ఇది చూసిన ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు ఆందోళన చెంది ఇమ్రాన్‌ను వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకోగానే ఇమ్రాన్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. 35 ఏళ్ల ఇమ్రాన్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అతని మరణంతో ఆయన కుటుంబం పెద్దదిక్కును కొల్పోపోయింది. దీంతో భార్య, తల్లి సహా కుటుంబసభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇమ్రాన్ మృతితో స్థానిక ఆటగాళ్లు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు.
A young man, Imran Sikandar Patel, died of a #heartattack while playing cricket in the Chhatrapati Sambhaji Nagar district of Maharashtra.https://t.co/aCciWMuz8Y pic.twitter.com/pwybSRKSsa
— Dee (@DeeEternalOpt) November 28, 2024
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి