AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs SL: ఏడాది తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ.. మా వ్యూహంలో భాగమేనన్న చీఫ్ సెలక్టర్..

Indian Cricket Team: గత ఏడాది జూలైలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియాలో సంజూ శాంసన్ భాగమయ్యాడు. కానీ, ఆ తర్వాత అతను జట్టు నుంచి దూరమయ్యాడు.

Ind vs SL: ఏడాది తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ.. మా వ్యూహంలో భాగమేనన్న చీఫ్ సెలక్టర్..
Ind Vs Sl Sanju Samson
Venkata Chari
|

Updated on: Feb 20, 2022 | 8:45 AM

Share

భారత జట్టు(Indian Cricket Team) ప్రస్తుతం వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్‌ను ఆడుతోంది. ఇందులో భారత్ ఇప్పటికే 2-0 ఆధిక్యంలో నిలిచి, సిరీస్‌ను గెలిచింది. సిరీస్‌లో మూడో మ్యాచ్ ఆదివారం జరగనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 24 నుంచి శ్రీలంక(Sri Lanka Cricket Team)తో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌కు జట్టును శనివారం ప్రకటించారు. ఇందులో చాలా మార్పులు కనిపించాయి. ఈ సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌లకు విశ్రాంతి ఇచ్చారు. పంత్ స్థానంలో కేరళ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌(Sanju Samson)ని తీసుకున్నారు.

సంజూ శాంసన్ ఒకప్పుడు భారతదేశ భవిష్యత్తు అని పేరుగాంచాడు. కానీ, ఈ ఆటగాడు నిరంతరం జట్టులోకి వస్తూ, వెళ్తూ ఉన్నాడు. 2015లో భారత టీ20 జట్టుకు అరంగేట్రం చేసిన సంజూ.. ఆ తర్వాత చాలా కాలం పాటు జట్టు నుంచి దూరంగా ఉన్నాడు.

ఐదేళ్ల తర్వాత అవకాశం వచ్చింది.. సంజూ 19 జూలై 2015న జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేశాడు. కానీ, ఆ తర్వాత అతను జట్టు నుంచి దూరమయ్యాడు. ఇదిలా ఉంటే, సంజూ పేరు నిరంతరం చర్చనీయాంశమైంది. సెలెక్టర్లు అతనిని పట్టించుకోకపోవడంతో విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. 2019-20లో సంజూని జట్టులోకి తీసుకున్నప్పటికీ ప్లేయింగ్‌-11లో అతడికి స్థానం దక్కలేదు. 2020 జనవరి 10న పుణెలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అతనికి అవకాశం లభించింది. కానీ, ఈ మ్యాచులో మాత్రం మెప్పించలేకపోయాడు. దీని తర్వాత, అతను న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లలో కూడా టీమ్ ఇండియా తరపున ఆడాడు. కానీ, ఈ బ్యాట్స్‌మెన్ తన బ్యాట్‌ను ఝుళిపించలేకపోయాడు. తొందరపడి కొన్నిసార్లు తప్పుడు షాట్ ఆడడంతో పెవిలియన్ చేరాడు.

గతేడాది టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నప్పుడు, శ్రీలంక పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శిఖర్ ధావన్ కెప్టెన్సీలో జట్టును పంపింది. సంజూ ఈ టూర్‌లో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కానీ, ఒక్కదాంట్లోనూ తన సత్తా చాటలేకపోయాడు. ఈ పర్యటనలో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో సంజూ 46 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, దానిని అర్ధ సెంచరీగా మార్చలేకపోయాడు.

బ్యాకప్‌గా జట్టులోకి వచ్చాడు.. ప్రస్తుతం మరోసారి సంజుకు అవకాశం వచ్చింది. శ్రీలంకతో సిరీస్‌లో ఇషాన్ కిషన్ రూపంలో భారత్‌కు వికెట్ కీపర్ కూడా ఉన్నాడు. ఈ సిరీస్‌లో పంత్ లేడు. అందుకే పంత్ బ్యాకప్‌గా సంజుకు చోటు దక్కింది. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, “పంత్ లేని కారణంగా సంజూ శాంసన్ బ్యాకప్‌గా జట్టులోకి వచ్చాడు. సంజు మా వ్యూహంలో భాగం. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మేం ఆస్ట్రేలియా వికెట్లు ఎలా ఉన్నాయో, అక్కడ ఏ ఆటగాళ్లు ఉపయోగకరంగా ఉంటారని మేం చూస్తున్నాం. ఇదీ వ్యూహం. సంజుపై మా దృష్టి ఉంది. అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నారు.

సంజు శాంసన్ IPLలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతను IPLతో దేశీయ క్రికెట్‌లో నిలకడగా పరుగులు చేస్తున్నాడు. అయితే నిలకడ లేమి అతని బ్యాటింగ్‌లో కనిపిస్తోంది.

Also Read: Ipl 2022 Auction: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు కొత్త అసిస్టెంట్‌ కోచ్‌.. సైమన్‌ కటిచ్‌ స్థానంలో ఎవరు రానున్నారంటే..

Rohit Sharma: టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌గా హిట్‌ మ్యాన్‌.. బీసీసీఐ అధికారిక ప్రకటన.. వైస్‌ కెప్టెన్‌ ఎవరో తెలుసా?

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..