Team India: ఛాంపియన్‌గా భారత్… 4 ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన సూర్యసేన
India vs New Zealand Final Result: భారత జట్టు రెండోసారి వరుసగా పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలిచి ఎన్నో రికార్డునుల బ్రేక్ చేసింది. వాటిలో న్యూజిలాండ్ జట్టుపై విజయం మాత్రమే కాదు, సొంత గడ్డపై ప్రపంచకప్ గెలవడం కూడా ఉన్నాయి.

భారత జట్టు (India national cricket team) అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ (New Zealand national cricket team) ను ఫైనల్‌లో 96 పరుగుల తేడాతో ఓడించి ఐసీసీ ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయం ద్వారా భారత్ మూడోసారి టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) నాయకత్వంలోని జట్టు ఈ టోర్నమెంట్‌లో ఎన్నో చారిత్రాత్మక రికార్డులను సృష్టించింది.
వరుసగా రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టు..
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్‌ను కాపాడుకోలేదు. కానీ భారత్ 2024 తర్వాత మరోసారి 2026లో కూడా ట్రోఫీ గెలిచి వరుసగా రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.
ఆతిథ్య దేశంగా ట్రోఫీ గెలిచిన తొలి జట్టు..
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ హోస్ట్ దేశం కూడా టైటిల్ గెలవలేదు. కానీ భారత్ తన స్వదేశంలోనే ఈ టోర్నమెంట్ గెలిచి హోస్ట్‌గా టైటిల్ గెలిచిన తొలి దేశంగా నిలిచింది.
టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై తొలి విజయం..
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్‌కు న్యూజిలాండ్‌పై విజయం రాలేదు.
ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌లలో (2007, 2016, 2021) కూడా న్యూజిలాండ్ విజయం సాధించింది. అయితే 2026 ఫైనల్‌లో విజయం సాధించడం ద్వారా భారత్ ఆ చెడు రికార్డును కూడా చెరిపేసింది.
న్యూజిలాండ్ రికార్డుకు బ్రేక్..
న్యూజిలాండ్ గతంలో తన రెండు ఐసీసీ టైటిల్స్‌ను భారత్‌పై గెలిచింది.
2000 ICC Champions Trophy 2000
2021 ICC World Test Championship 2021 Final
కానీ, ఈసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ న్యూజిలాండ్‌ను ఓడించి ఆ ట్రెండ్‌ను నిలిపేసింది. ఇక న్యూజిలాండ్ రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓటమి చవిచూసింది.
