
క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (ICC WTC Final)కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) ముగిసిన వెంటనే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నారు. ICC WTC ఫైనల్ జూన్ 7 నుంచి 11 వరకు జరుగుతుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం ఈ చారిత్రాత్మక పోరుకు సాక్ష్యం కానుంది. ఈ ముఖ్యమైన మ్యాచ్‌కు కూకబురా బంతిని వాడాలని పాంటింగ్ సూచించాడు. అయితే, కూకబురా బంతికి బదులుగా డ్యూక్స్ బంతినే ఉపయోగించాలని బీసీసీఐ కోరింది.
అంతకుముందు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ డ్యూక్ కంటే కూకబుర్రా బంతి మెరుగ్గా ఉందని పేర్కొన్నాడు. ‘ఆస్ట్రేలియా ఫాస్ట్ బ్యాటింగ్, భారత్ టాప్ ఆర్డర్ ఈ మ్యాచ్‌లో ప్రధాన హైలైట్. భారత స్పిన్నర్లు, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ల మధ్య పోరు ఉత్కంఠ రేపనుంది. ఓవల్ మైదానంలో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఓవల్ పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలం. స్పిన్నర్‌లకు కొంత మేరకు అనుకూలంగా ఉంటుంది. డ్యూక్ అంత ప్రభావవంతంగా లేదు. కాబట్టి కూకబుర్రా బంతిని వాడండి’’ అంటూ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
కూకబురా బాల్‌లో టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఆడబోమంటూ పాంటింగ్ చేసిన ప్రకటనపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. డ్యూక్స్ బంతితోనే బరిలోకి దిగుతామని ప్రకటించింది. “మేం డ్యూక్స్ బాల్‌తోనే ఆడతాం. మా ఆటగాళ్లు ఇప్పటికే డ్యూక్స్‌తో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఐపీఎల్‌లో ఫైనల్స్‌కు సిద్ధం కావడానికి పేసర్లకు డ్యూక్స్ బంతిని కూడా అందించాం. బంతి మార్పు గురించి మేం ఏమీ వినలేదు. దీని గురించి పాంటింగ్ ఎక్కడ మాట్లాడాడో మాకు తెలియదు” అంటూ బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో అన్నారు.
కూకబురా ఒక ఆస్ట్రేలియన్ స్పోర్టింగ్ గూడ్స్ కంపెనీ. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌తో సహా చాలా జట్లు తమ తమ దేశాల్లో టెస్ట్ క్రికెట్ ఆడేందుకు కూకాబురా కంపెనీ బంతిని ఉపయోగిస్తున్నాయి. ఈ బంతి లోపలి రెండు పొరలు చేతితో కుట్టినవి. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో డ్యూక్స్ బంతిని ఉపయోగించారు. దీని రంగు చెర్రీ ఎరుపు. కూకబుర్రా బాల్‌తో పోలిస్తే SG బాల్‌ను కుట్టడానికి ఉపయోగించే దారం మందంగా ఉంటుంది. SG బాల్‌లో కుట్లు మధ్య దూరం తక్కువగా ఉంటుంది.
డ్యూక్స్ బాల్‌పై ఉన్న భారీ వార్నిష్ బంతి సుమారు 60 ఓవర్ల పాటు తన స్వింగ్‌ను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. 60 ఓవర్ల తర్వాత, బంతికి రివర్స్ స్వింగ్ వస్తుంది. ఇంగ్లండ్‌లో మేఘావృతమైన పరిస్థితుల్లో పేసర్లు దీనిని తమ ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు.
కూకబుర్రా బాల్ సీమ్ వైపు పట్టు బాగా ఉంటుంది. బౌలర్లు తమ ప్రయోజనం కోసం దానిని సురక్షితంగా పట్టుకోవడానికి వీలు కల్పిస్తుంది. బంతి మెరుపును కోల్పోయిన తర్వాత కూడా కూకబుర్రా ఎత్తుగా బౌన్స్ చేయగలదు. కాబట్టి ఫాస్ట్, మీడియం పేస్ బౌలర్లు బౌన్స్ ద్వారా బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయవచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..