AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతికా రావల్ అజేయ శతకం.. శ్రీ చరణి విజృంభణ.. దుమ్మురేపిన భారత్ మహిళ జట్టు..

వడోదరలో జింబాబ్వే మహిళలతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. శ్రీ చరణి 4 వికెట్లతో రాణించగా, ఓపెనర్ ప్రతికా రావల్ 96 బంతుల్లో అజేయంగా 100 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 64 పరుగులతో మెరవడంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ప్రతికా రావల్ అజేయ శతకం.. శ్రీ చరణి విజృంభణ.. దుమ్మురేపిన భారత్ మహిళ జట్టు..
India Vs Zimbabwe 1st Odi
Shaik Madar Saheb
|

Updated on: Oct 24, 2026 | 9:01 AM

Share

వడోదర వేదికగా జింబాబ్వే మహిళా క్రికెట్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో దుమ్మురేపింది. బౌలర్లు సమిష్టిగా రాణించగా, ఓపెనర్ ప్రతికా రావల్ అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ 9 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

మొదట కట్టడి చేసిన బౌలర్లు:

టాస్ గెట్స్ బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు, జింబాబ్వే బ్యాటర్లను కట్టడి చేయడంలో పూర్తిగా సఫలమైంది.

శ్రీ చరణి అద్భుత బౌలింగ్:

లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి అద్భుతంగా రాణించి కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. ఆమె కెరీర్‌లోనే ఇది అత్యుత్తమ వన్డే ప్రదర్శన.

ఈ క్రమంలోనే.. క్రాంతి గౌడ్ మూడు వికెట్లు తీసి జింబాబ్వే కోలుకోకుండా దెబ్బతీసింది. జింబాబ్వే జట్టులో 17 ఏళ్ల బిజా (62 పరుగులు) మినహా మిగతా వారెవరూ పెద్దగా రాణించకపోవడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 197 పరుగులకే ఆలైట్ అయింది.

ప్రతికా రావల్ అజేయ సెంచరీ

198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. స్మృతి మంధాన (32 పరుగులు)తో కలిసి ప్రతికా రావల్ తొలి వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొపింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షఫాలీ వర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించిన ప్రతికా రావల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అజేయంగా 100 పరుగులు (15 ఫోర్లతో) సాధించింది. దీంతో భారత జట్టు కేవలం 27.1 ఓవర్లలోనే కేవలం 1 వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ ఏకపక్ష విజయంతో భారత్ సిరీస్‌ను అద్భుత ఆరంభంతో ప్రారంభించింది.

Follow Us