IND Vs WI Playing 11: టాస్ గెలిచిన వెస్టిండీస్.. రోహిత్ సేన తొలుత బ్యాటింగ్.. ప్లేయింగ్ XIలో అతడికి చోటు..

మూడో మ్యాచ్‌లో గాయపడిన రోహిత్ శర్మ కెప్టెన్ రోహిత్ శర్మ, నాలుగో మ్యాచ్‌కు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు జరిగాయి. వాతావరణం, పిచ్ మార్పుల కారణంగా ఈ మ్యాచ్ ఇరు జట్లకు సవాల్‌గా మారనుంది.

IND Vs WI Playing 11: టాస్ గెలిచిన వెస్టిండీస్.. రోహిత్ సేన తొలుత బ్యాటింగ్.. ప్లేయింగ్ XIలో అతడికి చోటు..
Ind Vs Wi Playing 11
Follow us
Venkata Chari

|

Updated on: Aug 06, 2022 | 8:52 PM

India Vs West Indies: ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ అండ్ బ్రోవార్డ్ కౌంటీ స్టేడియంలో శనివారం భారత్, వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ప్రతికూల వాతావరణం కారణంగా టాస్ ఆలస్యంగా వేశారు. టాస్ గెలిచిన వెస్టిండీస్ టీం తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్‌ సిరీస్‌ గెలుచుకుంటుంది. వెస్టిండీస్‌లోని సెయింట్ కిట్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి సిరీస్‌ను ప్రారంభించింది. రెండో మ్యాచ్‌లో ఆతిథ్య విండీస్ విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది. మూడో మ్యాచ్‌లో భారత్ గెలిచి, 2-1 ఆధిక్యంలో నిలిచింది.

మూడో మ్యాచ్‌లో గాయపడిన రోహిత్ శర్మ కెప్టెన్ రోహిత్ శర్మ, నాలుగో మ్యాచ్‌కు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు జరిగాయి. వాతావరణం, పిచ్ మార్పుల కారణంగా ఈ మ్యాచ్ ఇరు జట్లకు సవాల్‌గా మారనుంది.

ఇవి కూడా చదవండి

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), సంజూ శాంసన్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్(కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, డెవాన్ థామస్(కీపర్), జాసన్ హోల్డర్, డొమినిక్ డ్రేక్స్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్