India vs West Indies 1st ODI: టాస్ గెలిచిన వెస్టిండీస్.. టీమిండియా బ్యాటింగ్.. ప్లేయింగ్ XI ఎలా ఉందంటే?
పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో ఈరోజు తొలి మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా వెస్టిండీస్ టీం టాస్ గెలిచి, తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ చేయనుంది.
ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత విజయం సాధించిన టీమిండియా.. తాజాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో తలపడనుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో ఈరోజు తొలి మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా వెస్టిండీస్ టీం టాస్ గెలిచి, తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ చేయనుంది.
ఇరుజట్ల మధ్య ఇప్పటి వరకు 136 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 67 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 63 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అదే సమయంలో 2 మ్యాచ్‌లు టై అయ్యాయి. 4 మ్యాచ్‌ల్లో ఫలితం లేదు.
ఇరు జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్(కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్(కీపర్), బ్రాండన్ కింగ్, షమర్ బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్(కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్