AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Sri Lanka: 4 ఏళ్లు.. వరుసగా 11 సిరీస్ విజయాలు.. ఫుల్ స్వింగ్‌లో టీమిండియా.. రాజ్‌కోట్‌లో బ్రేక్ పడేనా?

శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఈరోజు చివరి, నిర్ణయాత్మక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటల నుంచి రాజ్‌కోట్‌లో జరగనుంది.

India vs Sri Lanka: 4 ఏళ్లు.. వరుసగా 11 సిరీస్ విజయాలు.. ఫుల్ స్వింగ్‌లో టీమిండియా.. రాజ్‌కోట్‌లో బ్రేక్ పడేనా?
Ind Vs Sl
Venkata Chari
|

Updated on: Jan 07, 2023 | 5:01 PM

Share

India vs Sri Lanka T20 Series: భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌లో మూడో, నిర్ణయాత్మక మ్యాచ్ రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 7:00 గంటల నుంచి జరగనుంది. ఈ మ్యాచ్ ఫలితం సిరీస్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా తొలిసారి శ్రీలంక చేతిలో స్వదేశంలో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది. 4 సంవత్సరాల క్రితం 2019లో స్వదేశంలో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌ను కోల్పోయింది. ఆస్ట్రేలియా చేతిలో 2-0 తేడాతో ఓడింది. అప్పటి నుంచి భారత్ స్వదేశంలో వరుసగా 11 సిరీస్‌లను గెలుచుకుంది.

ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే శ్రీలంకతో వరుసగా 5వ టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. హార్దిక్ సారథ్యంలోని భారత జట్టు ఓడిపోతే తొలిసారి సిరీస్‌ను చేజార్చుకుంది. భారత్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు ఐదు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాయి. భారత్ 4 గెలిచింది. ఒక సిరీస్‌‌లో ఇరు జట్లు సమానంగా నిలిచాయి.

గత 6 ఏళ్లుగా రాజ్‌కోట్‌లో టీమిండియా ఓడలే..

టీమిండియా రెండో మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, రాజ్‌కోట్ మైదానం రికార్డు భారత్‌కు అనుకూలంగా ఉంది. గత 6 ఏళ్లుగా ఈ గడ్డపై భారత జట్టు ఓడిపోలేదు. ఇక్కడ మొత్తం 4 మ్యాచ్‌లు ఆడిన భారత్.. ఇందులో ముడు మ్యాచ్‌ల్లో గెలుపొందగా, ఒక దాంట్లో ఓడిపోయింది. 2017లో న్యూజిలాండ్‌తో భారత్‌ 40 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఇవి కూడా చదవండి

ఈ మైదానంలో భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇరు జట్లు ఇక్కడ వన్డే మ్యాచ్‌లు ఆడాయి.

ఇరు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

భారత్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, శివమ్ మావి, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్.

శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), కుసల్ మెండిస్ (కీపర్), పాతుమ్ నిస్సంక, చరిత్ అస్లంక, భానుక రాజపక్స/సదీర సమరవిక్రమ, ధనంజయ్ డి సిల్వా, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, కసున్ రజిత, దిల్షన్ మదుశంక, మహిష్ తీక్షణ.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!