AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Sri Lanka 1st T20: అభిమాన ప్లేయర్ కోసం రోడ్డెక్కిన ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

Bhanuka Rajapaksa: భారత శ్రీలంక పర్యటన ఫిబ్రవరి 24న తొలి టీ20తో ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తర్వాత ఇరు జట్లు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనున్నాయి.

India vs Sri Lanka 1st T20: అభిమాన ప్లేయర్ కోసం రోడ్డెక్కిన ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
Ind Vs Sl
Venkata Chari
|

Updated on: Feb 23, 2022 | 6:32 PM

Share

India vs Sri lanka 1st T20: శ్రీలంక క్రికెట్ జట్టు ప్రస్తుతం భారత పర్యటన(IND vs SL)లో ఉంది. ఫిబ్రవరి 24న తొలి టీ20తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తర్వాత ఇరు జట్లు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనున్నాయి. ఇందుకోసం శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) జట్టును ప్రకటించింది. ఈ జట్టులో భానుక రాజపక్సే ఎంపిక కాకపోవడంతో శ్రీలంక అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈమేరకు శ్రీలంక బోర్డుకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. శ్రీలంక క్రికెట్ బోర్డు భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 19 మంది సభ్యుల జట్టులో ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ భానుక రాజపక్సే(Bhanuka Rajapaksa)ను ఎంపిక చేయలేదు. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులకు నచ్చకపోవడంతో రోడ్డుపైకి వచ్చారు. తమ అభిమాన బ్యాట్స్‌మెన్ కోసం శ్రీలంక క్రికెట్ హెడ్ క్వార్టర్స్ ముందు అభిమానులు నిరసనలు చేస్తున్నారు.

భానుక రాజపక్సే అంతర్జాతీయ కెరీర్.. 2021 టీ20 ప్రపంచ కప్‌లో తన అద్భుతమైన ప్రదర్శన తర్వాత భానుక రాజపక్సే వెలుగులోకి వచ్చాడు. అతను నవంబర్ 2021లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. శ్రీలంక తరపున ఇప్పటి వరకు ఐదు వన్డేలు, 18 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 89 పరుగులు, టీ20ల్లో 320 పరుగులు చేశాడు.

జనవరిలో పదవీ విరమణ.. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ భానుక రాజపక్సే ఈ ఏడాది జనవరి 5న అంతర్జాతీయ క్రికెట్‌కు అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఈ 30 ఏళ్ల ఆటగాడు కొన్ని రోజుల తర్వాత తన నిర్ణయం నుంచి యూ-టర్న్ తీసుకున్నాడు. తన రిటైర్మెంట్‌ను ఉపసంహరించుకున్నాడు. కానీ, ప్రస్తుత సిరీస్‌లో మాత్రం బోర్డు అతనిని ఎంపిక చేయలేదు. దీంతో ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి మరీ ఆందోళనలు చేపడుతున్నారు.

Also Read: IPL 2022: మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు.. ముంబై-పుణెల్లోనే హోరాహోరీ పోరు.. ఐపీఎల్ 2022 తొలి మ్యాచ్‌ ఎప్పుడంటే?

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌లో ఈ ప్లేయర్ చాలా కీలకం.. సత్తా నిరూపించుకుంటే జట్టులో స్థానం పక్కా: రోహిత్