T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌లో ఈ ప్లేయర్ చాలా కీలకం.. సత్తా నిరూపించుకుంటే జట్టులో స్థానం పక్కా: రోహిత్
Sanju Samson: సంజూ శాంసన్ టీమిండియాకు తిరిగి వచ్చాడు. అతను శ్రీలంకతో మూడు మ్యాచ్ 20 సిరీస్‌కు ఎంపికయ్యాడు.
అద్భుతమైన డ్రైవ్‌లు, కట్ షాట్లు, పుల్ షాట్లకు మారుపేరుగా నిలిచిన సంజూ శాంసన్.. ప్రతిభకు కొదువలేదనే పేరుగాంచాడు. కానీ, టీమిండియాలో అవకాశం వచ్చిన ప్రతీసారి నిరాశపరుస్తూ.. జట్టుకు దూరమవుతున్నాడు. సంజు శాంసన్(Sanju Samson) బ్యాటింగ్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే. కానీ, టీమ్ ఇండియా అతనికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా.. తన ప్రతిభను నిరూపించుకోలేకపోలేకపోతున్నాడు. అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) సంజూ శాంసన్‌పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కేరళకు చెందిన ఈ బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియాలో నిర్వహించనున్న టీ20 ప్రపంచ కప్‌లో ఆడాలని ఉన్నట్లు తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు. శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు(India vs Sri Lanka, 1st T20I), రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో సంజూ శాంసన్‌ను ప్రశంసించాడు. రోహిత్ శర్మ సంజును అసమాన ప్రతిభగా అభివర్ణించాడు. సంజూ శాంసన్ టీమిండియాకు తిరిగి వచ్చాడనే విషయం తెలిసిందే.
ఈ మేరకు రోహిత్ శర్మ మాట్లాడుతూ, ‘సంజు శాంసన్‌లో అసమాన ప్రతిభ ఉంది. అతని బ్యాటింగ్ చూసినప్పుడల్లా మీరు ఆనందిస్తారు. సంజు శాంసన్‌లో నైపుణ్యాలు ఉన్నాయి. అతనిలో ప్రతిభకు కొదువలేదు. అతన్ని మ్యాచ్‌లోకి తీసుకురావడం చాలా అవసరం. భారతదేశంలో ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. అయితే వాటిని మైదానంలో చూపించడం చాలా ముఖ్యమైన విషయం.
టీ20 ప్రపంచకప్‌లో సంజూ ఆడతాడా? ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ లాంటి బ్యాట్స్‌మెన్ విధ్వంసం సృష్టించగలడని రోహిత్ శర్మ స్పష్టంగా చెప్పాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ, ‘సంజు శాంసన్ బ్యాక్‌ఫుట్ గేమ్ అద్భుతం. అతనిలో అన్ని రకాల షాట్లు ఆడగల సామర్థ్యం ఉంది. సంజూ శాంసన్ ఆడే షాట్లు మిగతా బ్యాట్స్ మెన్స్ ఆడటం చాలా కష్టం. అలాంటి బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియా వాతావరణానికి చక్కగా సరిపోతాడు. అతను తన ప్రతిభను ఉపయోగించుకుంటాడని ఆశిస్తున్నాను. సంజూ శాంసన్‌కు మ్యాచ్‌లు గెలిచే సత్తా ఉందని, అతనిపై జట్టు చాలా ఆశలు పెట్టుకుందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
టీ20ఐలో నిరాశపరిచిన సంజూ.. టీ20 ఇంటర్నేషనల్స్‌లో సంజూ శాంసన్ ప్రదర్శన చాలా నిరాశపరిచింది. భారత్ తరపున 10 టీ20 మ్యాచ్‌లు ఆడిన శాంసన్.. కేవలం 117 పరుగులు మాత్రమే చేశాడు. అతని బ్యాటింగ్ సగటు కేవలం 11.70గా నిలిచింది. శాంసన్ దూకుడు వైఖరి కారణంగా ఇలాంటి ఫలితాలు వచ్చాయని నిపుణులు పేర్కొంటున్నారు. అతను చాలా సార్లు బ్యాడ్ షాట్లు ఆడుతూ ఔట్ అవుతున్నాడు. సంజు చివరి టీ20 సిరీస్ కూడా శ్రీలంకపై ఆడాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో సంజూ శాంసన్ 34 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సంజూ శాంసన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం లభిస్తే భారీ ఇన్నింగ్స్ ఆడతాడని భావిస్తున్నారు.
Also Read: IPL Broadcast Rights: హీటెక్కిన ప్రసార హక్కుల పోటీ.. తగ్గేదేలే అంటోన్న ఆ 4 సంస్థలు..!
Indian Cricket Team: టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు? రేసులో ముగ్గురు ఉన్నారన్న రోహిత్ శర్మ