IPL Broadcast Rights: హీటెక్కిన ప్రసార హక్కుల పోటీ.. తగ్గేదేలే అంటోన్న ఆ 4 సంస్థలు..!

మీడియా సోర్స్ ప్రకారం, 2023 నుంచి 2027 వరకు 5 సంవత్సరాల పాటు ఈ లీగ్ ప్రసార హక్కులకు బదులుగా భారత బోర్డు రూ. 40 వేల కోట్ల వరకు పొందవచ్చు. 2018 నుంచి 2022 వరకు BCCI ఈ హక్కులను స్టార్ ఇండియాకు..

IPL Broadcast Rights: హీటెక్కిన ప్రసార హక్కుల పోటీ.. తగ్గేదేలే అంటోన్న ఆ 4 సంస్థలు..!
Ipl 2022
Venkata Chari

|

Feb 23, 2022 | 4:56 PM

ఫ్యూచర్ గ్రూప్‌లో పెట్టుబడులు, కొనుగోలు విషయంలో అమెజాన్(Amazon), రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య చాలా పోటీ ఉంది. ఈ విషయం కోర్టులో ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీలు ఐపీఎల్ ప్రసార హక్కుల(IPL Broadcast Rights)ను తీసుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఐపీఎల్(IPL) ప్రసార హక్కులపై అమెజాన్, రిలయన్స్ ముఖాముఖిగా తలపడే అవకాశం ఉంది. ప్రసార హక్కులను ఎవరు పొందాలనే దానిపై మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో నిర్ణయం తీసుకోవచ్చు.

మీడియా సోర్స్ ప్రకారం, 2023 నుంచి 2027 వరకు 5 సంవత్సరాల పాటు ఈ లీగ్ ప్రసార హక్కులకు బదులుగా భారత బోర్డు రూ. 40 వేల కోట్ల వరకు పొందవచ్చు. 2018 నుంచి 2022 వరకు BCCI ఈ హక్కులను స్టార్ ఇండియాకు రూ. 16,347.50 కోట్ల రూపాయలకు విక్రయించింది. స్టార్ ఇండియా మాతృ సంస్థ వాల్ట్ డిస్నీ అని తెలిసిందే. ఇది అమెరికా కంపెనీ. మీడియా నివేదికల ప్రకారం, అమెజాన్, రిలయన్స్ 5 సంవత్సరాల IPL ప్రసారాల కోసం సోనీ గ్రూప్, వాల్ట్ డిస్నీతో పోటీ పడనున్నాయి.

హీటెక్కిన పోటీ.. ప్రస్తుతం IPL హక్కులను పొందడానికి రిలయన్స్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీల పోటీలో చేరడం ద్వారా పోటీ పెరుగుతుంది. రెండు కంపెనీలు కూడా తమ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లతో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ మార్కెట్ కోసం పోటీ పడుతున్నాయి. ఒకవైపు అమెజాన్ ప్రైమ్ వీడియో, మరోవైపు రిలయన్స్ జియోటీవీతో దూసుకపోతున్నాయి. రిలయన్స్ తన బ్రాడ్‌కాస్టింగ్ జాయింట్ వెంచర్ వయాకామ్ 18 కోసం పెట్టుబడిదారులతో కూడా చర్చలు జరుపుతోంది.

లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించిన Amazon.. Amazon ఇటీవల ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లో క్రికెట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించింది. కంపెనీకి ఇంకా టీవీ ప్లాట్‌ఫారమ్ లేనప్పటికీ, డిజిటల్ సేవలను మొదలుపెట్టింది. ఈ సందర్భంలో, ఇది టీవీ భాగస్వామిని తీసుకురావాలి లేదా డిజిటల్ కోసం మాత్రమే పోటీ పడే ఛాన్స్ ఉంది.

వీరి పోటీతో కురవనున్న కాసుల వర్షం.. IPL హక్కుల కొత్త సీజన్ విక్రయంతో బీసీసీఐపై కాసుల వర్షం కురవనుంది. నాలుగు సంస్థలు పోటీపడనుండడంతో బీసీసీఐకి దాదాపు రూ. 40,000 నుంచి రూ. 45,000 కోట్ల ఆదాయం ఖజానాలో చేరనుంది.

మీడియా హక్కుల గురించి వాల్ట్ డిస్నీ కో ఇండియా, స్టార్ ఇండియా ప్రెసిడెంట్ కె మాధవన్ మాట్లాడుతూ, “స్పోర్ట్స్ వ్యాపారం మాకు పెట్టుబడి మోడ్. మేం భారీగా పెట్టుబడి పెట్టడానికి వెనుకాడం. IPLతో సహా అన్ని హక్కులను పునరుద్ధరించడం పట్ల మేం సంతోషిస్తున్నాం’ అని తెలిపారు.

గతేడాది ఐపీఎల్ ను 350 మిలియన్ల వ్యూస్.. గతేడాది IPL స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లు, డిస్నీ + హాట్‌స్టార్‌లో ప్రసారం చేశారు. గత సీజన్‌లో, లీగ్ మ్యాచ్‌ల వీక్షకుల సంఖ్య 350 మిలియన్లకు చేరుకుంది.

భారతదేశంతో పాటు 7 దేశాల్లో IPL ప్రసారాలు.. భారతదేశంతో పాటు, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మాల్దీవులు వంటి భారత ఉపఖండంలోని దేశాలలో IPL ప్రసార హక్కులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో ఉన్నాయి. హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ 7 భాషలలో ఈ ప్రసారాలు జరుగుతున్నాయి.

Also Read: Indian Cricket Team: టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు? రేసులో ముగ్గురు ఉన్నారన్న రోహిత్ శర్మ

ICC T20I Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్-వెంకటేష్ అయ్యర్ భారీ జంప్.. ఎన్నో స్థానంలో నిలిచారంటే?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu