Indian Cricket Team: టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు? రేసులో ముగ్గురు ఉన్నారన్న రోహిత్ శర్మ
ఫిబ్రవరి 24 నుంచి టీమిండియా-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అంతకుముందు, టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం విలేకరుల సమావేశంలో విలేకరులతో మాట్లాడాడు.
Rohit Sharma: ఫిబ్రవరి 24 నుంచి టీమిండియా-శ్రీలంక(India vs Sri Lanka) మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అంతకుముందు, టీమ్ ఇండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం విలేకరుల సమావేశంలో విలేకరులతో మాట్లాడాడు. అయితే, ఇందులో టీమిండియాకు కాబోయే సారథి విషయంలో ప్రశ్నలు లేవనెత్తగా, రోహిత్ చక్కగా బదులిచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ రాబోయే రోజుల్లో టీమిండియాకు నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉంటారని తేల్చి చెప్పాడు. భారత కెప్టెన్ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం..
మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా నిలవడం అంటే.. టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. శ్రీలంక సిరీస్ తర్వాత తొలిసారి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత, హిట్‌మ్యాన్ మాట్లాడుతూ – మూడు ఫార్మాట్‌లలో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవం. ఇది గొప్ప అనుభూతి. ప్రస్తుతం మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. టెస్టుకు సారథ్యం వహించే అవకాశం నాకు లభించినందుకు సంతోషంగా ఉంది.
టీమిండియా భవిష్యత్తు సారథిగా వీరే.. బుమ్రా, రాహుల్, పంత్ టీమిండియాకు భవిష్యత్తులో సారథిగా మారే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే బుమ్రా శ్రీలంక టీ20, టెస్ట్ సిరీస్‌లకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈమేరకు రోహిత్ మాట్లాడుతూ – అతడు బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్ అన్నది ముఖ్యం కాదు. క్రికెట్ అనేది మనస్సుతో ఆడాల్సిన గేమ్. బుమ్రాకు గొప్ప మనస్సు ఉంది. అతను నాకు బాగా తెలుసు. అతని క్రికెట్ ఎలాంటిదో నాకు తెలుసంటూ చెప్పుకొచ్చాడు. రోహిత్ మాట్లాడుతూ- బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ గురించి మాట్లాడితే, ఈ వ్యక్తులు భవిష్యత్తులో భారత క్రికెట్‌కు ముఖ్యమైన పాత్ర పోషించవలసి ఉంటుంది. ఈ ముగ్గురు ఆటగాళ్లు రాబోయే కాలంలో జట్టు నాయకత్వానికి ప్రధాన పోటీదారులుగా ఉంటారనడంతో సందేహం లేదు.
భారత జట్టు మిడిల్ ఆర్డర్ గురించి రోహిత్ శర్మను ప్రశ్నించినపుడు, టీమిండియా మిడిల్ ఆర్డర్ ఎలా ఉంటుందనేది వివరించాడు. ‘నేను ప్రస్తుతం దాని గురించి ఆలోచించడం లేదు. టీ20 ప్రపంచకప్‌కు ముందు మేం చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం మా దృష్టి ప్రస్తుత సిరీస్‌పైనే ఉంది’ అని తేల్చి చెప్పాడు.
సూర్య గాయంపై ఆందోళన.. సూర్యకుమార్ యాదవ్ హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ కారణంగా శ్రీలంక సిరీస్‌కు దూరమయ్యాడు. అతను ఈ సిరీస్ నుంచి తప్పుకోవడం జట్టుకు పెద్ద దెబ్బ. నేను సూర్యను చూసి బాధపడ్డాను. కానీ, మనం వీటిని నియంత్రించలేం. అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కానీ, చాలా మంది ఆటగాళ్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
రోహిత్ ఇంకా మాట్లాడుతూ- యువకుల ప్రదర్శనను చూడటం చాలా ఆనందంగా ఉంది. కానీ, మా సీనియర్ ఆటగాళ్లు గాయపడాలని నేను ఎప్పుడూ కోరుకోను. నేను ఆ దశను దాటాను. తిరిగి రావడం అంత సులభం కాదని నేను చెప్పగలను. అయితే ఈ సమయంలో మరింత మంది యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు మాకు అవకాశం ఉందని అన్నాడు.
యువ ఆటగాళ్లకు హిట్‌మ్యాన్ సలహా.. చాలా మంది యువ ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఆటగాళ్లలో అండర్-19 విజేత కెప్టెన్ యష్ ధుల్ పేరు కూడా ఉంది. అతను ఢిల్లీ తరపున ఆడుతున్నప్పుడు తమిళనాడుపై ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేశాడు.
రోహిత్ మాట్లాడుతూ- అతను పరుగులు చేయడం కొనసాగించాలని, త్వరలో అతనికి అవకాశం వస్తుందని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆటగాళ్లలో చాలా మంది నాకు తెలుసు. శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, గిల్ వంటి ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో బాగా ఆడటంతో వారికి అవకాశం లభించింది. అదేవిధంగా, మిగిలిన వారు కూడా జట్టులో చోటు పొందుతారు. వారు పరుగులు సాధిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను.
IND vs SL: టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. శ్రీలంక సిరీస్‌కు దూరం కానున్న స్టార్ బ్యాట్స్‌మెన్..!