India vs South Africa T20 Highlights: 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా..
IND Vs SA T20 Match Highlights: ఢిల్లీ, కటక్‌లో జరిగిన టీ20ల్లో దక్షిణాఫ్రికా టీం బలమైన ఆటతో సత్తా చాటి, సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

IND vs SA 3rd T20I: విశాఖపట్నం వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికాకు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రితురాజ్ గైక్వాడ్ భారత్ తరపున అత్యధిక పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి 35 బంతుల్లో 57 పరుగులు వచ్చాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు డ్వేన్ ప్రిటోరియస్ ఖాతాలో చేరాయి. తన పేరిట 2 వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా బ్యాట్ కూడా సత్తా చాటింది. అతను 21 బంతుల్లో 31 పరుగులు చేశాడు.
ఇరు జట్లు..
భారత్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్/కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): టెంబా బావుమా(కెప్టెన్), రీజా హెండ్రిక్స్, డ్వైన్ ప్రిటోరియస్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కగిసో రబడా, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, అన్రిచ్ నోర్ట్జే
Key Events
ఈ మ్యాచ్‌లో భారత్, దక్షిణాఫ్రికా టంలు రెండూ తమ ప్లేయింగ్-11లో ఎటువంటి మార్పులు చేయలేదు.
తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన సౌతాఫ్రికా.. సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి మరో మ్యాచ్ దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది.
LIVE Cricket Score & Updates
-
IND vs SA 3rd ODI: 48 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం..
IND vs SA 3rd ODI: విశాఖపట్నం వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. డూ ఆర్ డై లాంటి మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లు రాణించడంతో.. 48 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై భారత్ జయకేతనం ఎగురవేసింది.
-
ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా..
క్లాసెన్ 29 పరుగులు చేసి ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. చాహల్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 14.5 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా టీం ఆరు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.
-
-
ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా..
డేవిడ్ మిల్లర్ 3 పరుగులు చేసి ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో రుతురాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 11 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా టీం ఐదు వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది.
-
నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా..
ప్రెటోరియస్ 20 పరుగులు చేసి నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. చాహల్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 9 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా టీం నాలుగు వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది.
-
మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా..
డస్సెన్ 1 పరుగు చేసి పెవిలియన్ చేరాడు. చాహల్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 7 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా టీం మూడు వికెట్లు నష్టపోయి 40 పరుగులు చేసింది.
-
-
రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా..
హెండ్రిక్స్ (23) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. హర్షల్ పటేట్ బౌలింగ్‌లో చాహల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా టీం రెండు వికెట్లు నష్టపోయి 38 పరుగులు చేసింది.
-
తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా..
డేంజరెస్ మ్యాన్ బవుమా (8) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేట్ బౌలింగ్‌లో అవేష్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 4 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా టీం వికెట్ నష్టపోయి 23 పరుగులు చేసింది.
-
3 ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్..
3 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా టీం వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. హెన్‌డ్రిక్స్ 12, బవుమా 3 పరుగులతో క్రీజులో నిలిచారు.
-
సౌతాఫ్రికా టార్గెట్ 180
టీమిండియా 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికాకు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రితురాజ్ గైక్వాడ్ భారత్ తరపున అత్యధిక పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి 35 బంతుల్లో 57 పరుగులు వచ్చాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు డ్వేన్ ప్రిటోరియస్ ఖాతాలో చేరాయి. తన పేరిట 2 వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా బ్యాట్ కూడా సత్తా చాటింది. అతను 21 బంతుల్లో 31 పరుగులు చేశాడు.
-
IND vs SA Live Score: ఐదో వికెట్ డౌన్..
దినేష్ కార్తీక్ (6) రూపంలో టీమిండియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం 18.3 ఓవర్లకు భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.
-
IND vs SA Live Score: 18 ఓవర్లకు భారత్ స్కోర్..
18 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు నష్టపోయి 156 పరుగులు చేసింది. కార్తీక్ 5, పాండ్యా 14 పరుగులతో బ్యాటింగ్ చేస్తు్న్నారు.
-
IND vs SA Live Score: నాలుగో వికెట్ డౌన్..
రిషబ్ పంత్ (6) రూపంలో టీమిండియా నాలుగో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం 15.5 ఓవర్లకు భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది.
-
IND vs SA Live Score: మూడో వికెట్ డౌన్..
ఇషాన్ కిషన్ (54, 35 బంతులు, 5 ఫోర్లు, 2 సిక్సులు) రూపంలో టీమిండియా మూడో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం 14 ఓవర్లకు భారత్ మూడు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది.
-
IND vs SA Live Score: రెండో వికెట్ డౌన్..
శ్రేయాస్ అయ్యర్ (14) రూపంలో టీమిండియా రెండో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం 13 ఓవర్లకు టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది.
-
IND vs SA Live Score: ఇషాన్ హాఫ్ సెంచరీ..
టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. ప్రస్తుతం 12 ఓవర్లకు టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 120 పరుగులు చేసింది.
-
IND vs SA Live Score: తొలి వికెట్ డౌన్..
టీమిండియా ఓపెనర్ రుతురాజ్ 57(35) పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. దీంతో 9.6 ఓవర్లకు టీమిండియా వికెట్ నష్టపోయి 97 పరుగులు పూర్తి చేసింది.
-
IND vs SA Live Score: రుతురాజ్ హాఫ్ సెంచరీ
టీమిండియా ఓపెనర్ రుతురాజ్ కేవలం 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్త చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. 9 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 89 పరుగులు పూర్తి చేసింది.
-
IND vs SA Live Score: 6 ఓవర్లకు భారత్ స్కోర్..
6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్ట పోకుండా 57 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇషాన్ 13, రుతురాజ్ గైక్వాడ్ 44 పరుగులతో బ్యాటింగ్ చేస్తు్న్నారు.
-
IND vs SA Live Score: భారత జట్టు..
భారత్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్/కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్
-
IND vs SA Live Score: దక్షిణాఫ్రికా టీం..
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): టెంబా బావుమా(కెప్టెన్), రీజా హెండ్రిక్స్, డ్వైన్ ప్రిటోరియస్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కగిసో రబడా, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, అన్రిచ్ నోర్ట్జే
-
IND vs SA Live Score: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా..
డూ ఆర్ డై మ్యాచ్‌లో టీమిండియా మరోసారి టాస్ ఓడిపోయింది. దీంతో తొలిసారి రిషబ్ పంత్ సేన తొలుత బ్యాటింగ్ చేయనుంది.
-
IND vs SA Live Score: డూ ఆర్ డై మ్యాచ్..
భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఈరోజు మూడో మ్యాచ్ జరగనుండగా, ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే సిరీస్‌ను కోల్పోనుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్వదేశంలో సిరీస్‌ను కోల్పోవడం భారీ దెబ్బ కావొచ్చు.
Published On - Jun 14,2022 6:24 PM