U19 Womens T20 WC: మళ్లీ భారత్ Vs దక్షిణాఫ్రికా.. టీ20 ప్రపంచకప్ ఫైనల్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే

మలేషియా వేదికగా జరుగుతోన్న అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరుకోవడం గమనార్హం. శుక్రవారం (జనవరి 31)న జరిగిన సెమీస్‌లో భారత్ ఇంగ్లండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది.

U19 Womens T20 WC: మళ్లీ భారత్ Vs దక్షిణాఫ్రికా.. టీ20 ప్రపంచకప్ ఫైనల్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే
U19 Womens T20 Wc

Updated on: Jan 31, 2025 | 3:38 PM

అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ ఆఖరి దశకు చేరుకుంది. శుక్రవారం (జనవరి 31) తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ కు దూసుకెళ్లింది. కాగా ఆదివారం (ఫిబ్రవరి 02)న జరిగే టైటిల్ పోరులో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. గతేడాది పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 టోర్నమెంట్‌లో ఈ రెండు జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఓటమి అంచుల దాకా వెళ్లిన టీమిండియా ఉత్కంఠ విజయం సాధించింది. జగజ్జేతగా నిలిచింది. ఈ మ్యాచ్ ఇప్పటికీ క్రీడాభిమానుల మదిలో మెదులుతోంది. ఇప్పుడు క్రీడాభిమానులకు మరోసారి భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌ల పండగ కానుంది. ఫిబ్రవరి 2న టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియాకు ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే దక్షిణాఫ్రికా అద్భుతంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియాను 105 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం స్వల్ప టార్గెట్ ను దక్షిణాఫ్రికా 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక రెండో మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్‌ ముందు ఇంగ్లండ్‌ విజయానికి 113 పరుగుల టార్గెట్ విధించింది. దీనిని భారత్ 15 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి పూర్తి చేసింది. దీన్ని బట్టి చూస్తే భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు రెండూ అద్భుత ప్రదర్శన చేశాయి. కాబట్టి ఇప్పుడు ఫైనల్స్‌లో ఎవరు గెలుస్తారన్నది? ఆసక్తికరంగా మారింది.

సీన్ రిపీట్ అయ్యేనా?

కాగా గతేడాది జరిగిన పురుషుల టీ ప్రపంచ కప్ లో భారత జట్టు సెమీఫైనల్ లో ఇంగ్లండ్ ను చిత్తు చేసింది. ఆ తర్వాత ఫైనల్ లో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఇప్పుడు భారత అమ్మాయిలు కూడా సెమీస్ లో ఇంగ్లండ్ ను చిత్తు చేశారు. అలాగే ఆదివారం నాటి మ్యాచ్ లో సౌతాఫ్రికాను కూడా ఓడించాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

భారత మహిళల జట్టు: జి కమలిని (వికెట్ కీపర్), గొంగ్డి త్రిష, సానికా చాల్కే, నికి ప్రసాద్ (కెప్టెన్), ఈశ్వరి అవసరే, మిథిలా వినోద్, ఆయుషి శుక్లా, జోషితా VJ, షబ్నమ్ ఎండి. షకీల్, పరుణికా సిసోడియా, వైష్ణవి శర్మ.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..