IND vs NZ Highlights, ICC WC Semi Final: ఫైనల్ చేరిన భారత్.. చిత్తుగా ఓడిన కివీస్..
India vs New Zealand 1st Semi-Final, ICC world Cup 2023 Highlights: విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ సెంచరీల ఆధారంగా ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌కు 398 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. వాంఖడే మైదానంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు చేసింది.

India vs New Zealand 1st Semi-Final, ICC world Cup 2023 Highlights: ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. భారత జట్టు నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. ఇంతకుముందు 1983, 2003, 2011లో ఈ టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది.
విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ సెంచరీల ఆధారంగా ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌కు 398 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. వాంఖడే మైదానంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ 113 బంతుల్లో 117 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. తన వన్డే కెరీర్‌లో 50వ సెంచరీని నమోదు చేశాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును విరాట్ బద్దలు కొట్టాడు. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ 70 బంతుల్లో 105 పరుగులు చేశాడు. అయ్యర్ ప్రపంచకప్‌లో వరుసగా రెండో సెంచరీ సాధించాడు. శుభ్‌మన్ గిల్ 66 బంతుల్లో 80 పరుగులు, కెప్టెన్ రోహిత్ శర్మ 29 బంతుల్లో 47 పరుగులు చేశారు. న్యూజిలాండ్ తరఫున టిమ్ సౌథీ 2 వికెట్లు తీశాడు.
లీగ్ దశలో 9-0తో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు సెమీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. అదే విజయ పరంపరను కొనసాగించాలని కోరుకుంటోంది. ఎందుకంటే ఓడిపోతే టీమిండియా ఇంటిబాట పట్టాల్సి ఉంటుంది. అంటే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. తొలి సెమీస్‌లో భారత్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. ఐసీసీ టోర్నీల్లో ఈ ప్రత్యర్థిపై భారత్ చరిత్ర అంత బాగా లేదు. కానీ, రోహిత్ సేన ప్రపంచ ఛాంపియన్ కావాలంటే, ఈ రోజు చరిత్రను మార్చాలి.
ఇరుజట్లు:
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్(కీపర్), మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
LIVE Cricket Score & Updates
-
నాలుగోసారి ఫైనల్ చేరిన భారత్..
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. భారత జట్టు నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. ఇంతకుముందు 1983, 2003, 2011లో ఈ టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది.
-
డారెల్ మిచెల్ ఔట్..
ఎట్టకేలకు డారెల్ మిచెల్ (134)ను షమీ పెవిలియన్ చేర్చాడు. దీంతో షమీ ఖాతాలో 5 వికెట్లు చేరాయి. దీంతో ఈ ప్రపంచకప్‌లో మూడోసారి 5 వికెట్లు తీసుకున్నాడు.
-
-
6వ వికెట్ డౌన్..
న్యూజిలాండ్ 44 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. క్రీజులో డారిల్ మిచెల్ 132, శాంట్నర్ 1 ఉన్నారు. కివీస్ విజయానికి 36 బంతుల్లో 99 పరుగులు కావాల్సి ఉంది.
-
5వ వికెట్ డౌన్..
న్యూజిలాండ్ 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. క్రీజులో డారిల్ మిచెల్, చాప్‌మన్ ఉన్నారు. న్యూజిలాండ్ విజయానికి 42 బంతుల్లో 103 పరుగులు కావాలి.
-
సెంచరీతో మిచెల్ దూకుడు..
న్యూజిలాండ్ 36 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. క్రీజులో డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ ఉన్నారు.
-
-
షమీ దెబ్బకు ఒకే ఓవర్లో 2 వికెట్లు..
న్యూజిలాండ్ 33 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (101) క్రీజులో ఉన్నాడు. ఈ ప్రపంచకప్‌లో మిచెల్ రెండో సెంచరీ సాధించాడు.
-
30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 198 పరుగులు
న్యూజిలాండ్ 30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య 150+ భాగస్వామ్యం నెలకొంది.
-
కేన్ మామ హాఫ్ సెంచరీ..
న్యూజిలాండ్ 26 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
కేన్ విలియమ్సన్ 50, డారిల్ మిచెల్ 64 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం నెలకొంది. మిచెల్ యాభై పరుగులు చేయగా, విలియమ్సన్ అర్ధ సెంచరీతో ఛేజింగ్‌పై ఆశలు పెంచుతున్నారు.
-
సెంచరీ భాగస్వామ్యంతో దూసుకెళ్తోన్న మిచెల్, విలియమ్సన్..
న్యూజిలాండ్ 22 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ 33, డారిల్ మిచెల్ 49 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
ఆచీ తూచీ ఆడుతోన్న న్యూజిలాండ్..
న్యూజిలాండ్ 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ క్రీజులో ఉన్నారు.
13 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర ఔటయ్యాడు. డెవాన్ కాన్వే 13 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఈ రెండు వికెట్లు షమీ ఖాతాకే చేరాయి.
-
రెండు వికెట్లు కోల్పోయి కివీస్..
న్యూజిలాండ్ 7.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ క్రీజులో ఉన్నాడు.
-
కోహ్లీ సెంచరీపై సచిన్ ట్వీట్..
The first time I met you in the Indian dressing room, you were pranked by other teammates into touching my feet. I couldn’t stop laughing that day. But soon, you touched my heart with your passion and skill. I am so happy that that young boy has grown into a ‘Virat’ player.
— Sachin Tendulkar (@sachin_rt) November 15, 2023
-
న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్..
వాంఖడే స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 398 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది.
-
350కి చేరువలో టీమిండియా..
టీమిండియా 45 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 341 పరుగులు సాధించింది. అయ్యర్ 90, కేఎల్ రాహుల్ 1 పరుగుతో క్రీజులో నిలిచారు.
-
విరాట్ @ 50 సెంచరీలు..
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ సెమీఫైనల్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరాట్ కెరీర్‌లో ఇది 50వ సెంచరీ. వన్డే క్రికెట్‌లో అత్యధిక సార్లు 100 పరుగుల మార్క్‌ను దాటిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (49 సెంచరీలు) రికార్డును విరాట్ బద్దలు కొట్టాడు.
-
సెంచరీ దిశగా కోహ్లీ..
భారత జట్టు 40 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 287 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం నెలకొంది. అయ్యర్ ఈ ప్రపంచకప్‌లో నాలుగో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.
-
200 దాటిన స్కోర్..
31 ఓవర్లలో టీమిండియా ఒక వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 70, శ్రేయాస్ అయ్యర్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొంది.
-
కోహ్లీ హాఫ్ సెంచరీ..
భారత జట్టు 27 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 194 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు.
ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ 8వ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ప్రపంచకప్‌లో ఒకే సీజన్‌లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.
-
నాకౌట్‌లో అత్యుత్తమ స్కోరు..
వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ 36వ పరుగు తీసి నాకౌట్‌లో తన అత్యుత్తమ స్కోరును నమోదు చేశాడు. అంతకుముందు, 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై కోహ్లీ 43 బంతుల్లో 35 పరుగులు చేశాడు.
-
గిల్ రిటైర్డ్ హర్ట్..
శుభ్‌మన్ గిల్ 65 బంతుల్లో 79 పరుగులు చేసి రిటైర్ అయ్యాడు. అతనికి కాలులో తిమ్మిరి ఉంది. ఈ ప్రపంచకప్‌లో గిల్ నాలుగో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని వన్డే కెరీర్‌లో ఇది ఆరో అర్ధ సెంచరీ.
-
గిల్ దూకుడు.. 20 ఓవర్లకు భారత్..
గిల్ (74) దూకుడు, కోహ్లీ (26) క్లాస్ బ్యాటింగ్‌తో టీమిండియా 20 ఓవర్లలో 7.50 రన్ రేట్‌తో 150 పరుగులకు చేరుకుంది.
-
16 ఓవర్లకు భారత్ స్కోర్..
16 ఓవర్లు మిగిసే సరికి టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 121 పరుగులు చేసింది. గిల్ 53, కోహ్లీ 19 పరుగులుతో క్రీజులో నిలిచారు.
-
పవర్ ప్లేలో పవర్ చూసించిన భారత్..
భారత జట్టు 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ ఉన్నారు.
29 బంతుల్లో 47 పరుగులు చేసి కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. టిమ్ సౌథీకి బౌలింగ్‌లో అతను కేన్ విలియమ్సన్ చేతికి చిక్కాడు. వన్డే పవర్‌ప్లేలో టిమ్ సౌతీ ఐదోసారి రోహిత్‌ను అవుట్ చేశాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ 50 బంతుల్లో 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
-
తొలి వికెట్ డౌన్..
టీమిండియా సారథి రోహిత్ శర్మ (47) పరుగుల వద్ధ పెవిలియన్ చేరాడు. దీంతో మరోసారి 40ల్లో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 71 పరుగులు చేసింది.
-
గేల్ రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్..
ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ తన మూడో సిక్స్ కొట్టడం ద్వారా వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ప్రపంచకప్‌లో రోహిత్ పేరిట 50 సిక్సర్లు ఉన్నాయి. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ (49 సిక్సర్లు) రికార్డును బద్దలు కొట్టాడు. రోహిత్‌కి ఇది మూడో ప్రపంచకప్. దీనికి ముందు, హిట్‌మ్యాన్ 2015, 2019 ODI ప్రపంచకప్‌లో కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.
-
IND vs NZ: 5 ఓవర్లకు భారత్..
5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 47 పరుగులతో నిలిచింది. రోహిత్ 34, గిల్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
IND vs NZ: 3 ఓవర్లకు భారత్..
3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 25 పరుగులు చేసింది. రోహిత్ 16, గిల్ 8 పరుగులతో నిలిచారు.
-
తొలి ఓవర్‌లో రోహిత్ దూకుడు..
తొలి ఓవర్ ముగిసే సరికి టీమిండియా 10 పరుగులు సాధించింది. రోహిత్ 10 (2 ఫోర్లు), గిల్ 0 తో నిలిచారు.
-
IND vs NZ Semi-Final: ఇరుజట్ల ప్లేయింగ్ 11
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్(కీపర్), మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
-
టాస్ గెలిచిన రోహిత్..
కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ చేయనుంది.
-
బీసీసీఐ క్లారిటీ..
ముంబైలోని వాంఖడే స్టేడియం పిచ్‌ని బోర్డు మార్చేసిందని, భారత జట్టుకు నచ్చిన పిచ్‌పైనే మ్యాచ్ నిర్వహిస్తున్నారని భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌పై బీసీసీఐపై ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు బీసీసీఐ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఐసీసీ పిచ్ కన్సల్టెంట్లతో కలిసి భారత పిచ్ క్యూరేటర్లతో పని చేస్తున్నారని భారత బోర్డు తెలిపింది. అందుకే ఎలాంటి ఆరోపణలు వచ్చినా నిరాధారమంటూ కొట్టిపారేశారు.
-
ముంబై పిచ్‌పై ఆరోపణలు..
భారత్, న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాకముందే వాంఖడే పిచ్ వెలుగులోకి వచ్చింది. భారత టీమ్ మేనేజ్‌మెంట్ ఆదేశాల మేరకు పిచ్ స్వరూపాన్ని మార్చేశారనే కథనాలే ఇందుకు కారణం. పిచ్ నుంచి గడ్డిని తీసివేసి నెమ్మదిగా ఉండేటట్లు తయారు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
-
గత 23 ఏళ్లలో ఐసీసీ టోర్నీల్లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ గణాంకాలు..
2000 నుంచి భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ICC టోర్నమెంట్లలో 8 సార్లు తలపడ్డాయి. ఇందులో భారతదేశం 2 సార్లు మాత్రమే గెలిచింది. అంటే న్యూజిలాండ్ 6 సార్లు గెలిచింది. ఈ సమయంలో, న్యూజిలాండ్ జట్టు భారత్‌పై సెమీ-ఫైనల్, ఫైనల్ వంటి అన్ని మ్యాచ్‌లను గెలుచుకుంది. అయితే, భారత్ కోణంలో చూస్తే, ఈ ప్రపంచకప్‌లో లీగ్ దశలో ఆడిన చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది.
-
IND vs NZ Semi-Final Live Score: సిద్ధమైన భారత్, న్యూజిలాండ్..
ప్రపంచ కప్ 2023 నాకౌట్ మ్యాచ్‌లు నేటి నుంచి ప్రారంభమవుతాయి. తొలి సెమీఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్‌లు ముఖాముఖిగా తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే మైదానంలో మ్యాచ్ జరుగుతోంది. ఇక్కడ ఎవరు గెలిచినా ఫైనల్స్‌కు వెళ్లి ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
Published On - Nov 15,2023 1:03 PM




