IND vs NZ 2nd T20I Highlights: 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం.. టీ20 సిరీస్ గెలిచిన రోహిత్ సేన
India vs New Zealand Highlights in Telugu: రెండో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కివీస్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 154 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

India vs New Zealand 2nd T20I Highlights: రెండో టీ20లోనూ టీమిండియా ఘనవిజయం సాధిచింది. 7 వికెట్ల తేడాతో గెలిచి మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కివీస్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. 154 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కేఎల్ రాహుల్ 65(49 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్స్), రోహిత్ 55(36 బంతులు, 1ఫోర్, 3సిక్స్‌లు) ఇద్దరు సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. అలాగే 100 పరుగుల కీలక భాగస్వామ్యం అందించి మరో అద్భుత నాక్ ఆడారు. అనంతరం వెంకటేష్ అయ్యర్ 12, రిషబ్ పంత్ 12 పరుగులతో టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు. రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీమ్ ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం తొలుత బ్యాటింగ్ చేసింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు సాధించింది. టీమిండియా ముందు 154 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీమ్ ఇండియా, న్యూజిలాండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండోసారి రోహిత్ టాస్ గెలిచాడు. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. రెండో టీ20లో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో భారత జట్టు రంగంలోకి దిగనుంది. అదే సమయంలో, న్యూజిలాండ్‌కు నేటి మ్యాచ్ డూ ఆర్ డై లాంటిది. జైపూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో చివరి ఓవర్‌లో తొలి రెండు బంతుల్లో 5 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.
టీ20 ప్రపంచ కప్ రన్నరప్ న్యూజిలాండ్ చివరి మ్యాచ్‌లో మంచి పోరాటం చేసింది. కివీస్ బౌలర్లు మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లడమే కాకుండా టీమ్‌ఇండియా శిబిరంలో ఒక్క క్షణం భయాందోళనలు సృష్టించారు.
ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ విజయాన్ని నమోదు చేసేందుకు ఆ జట్టు రంగంలోకి దిగనుంది. కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ తమ భుజాలపై చాలా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
LIVE Cricket Score & Updates
-
7 వికెట్ల తేడాతో టీమిండియ ఘన విజయం
రెండో టీ20లోనూ టీమిండియా ఘనవిజయం సాధిచింది. 7 వికెట్ల తేడాతో గెలిచి మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కివీస్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. 154 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్.. 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
-
17 ఓవర్లకు భారత్ స్కోర్..
17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్లు నష్టపోయి 139 పరుగులు సాధించింది. క్రీజులో వెంకటేష్ అయ్యర్ 12, రిషబ్ పంత్ 0 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా విజయం సాధించాలంటే 18 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి ఉంది.
-
-
మూడో వికెట్ కోల్పోయిన భారత్..
సూర్యకుమార్ యాదవ్ మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. సౌతీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. 15.6 ఓవర్లలో టీమిండియా 137 పరుగుల వద్ధ మూడో వికెట్‌ను కోల్పోయింది.
-
రెండో వికెట్ కోల్పోయిన భారత్..
రోహిత్ శర్మ (55 పరుగులు, 35 బంతులు, 1 ఫోర్, 5సిక్స్‌లు) రెండో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. సౌతీ బౌలింగ్‌లో గఫ్టిల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 15.3 ఓవర్లలో టీమిండియా 135 పరుగుల వద్ధ రెండో వికెట్‌ను కోల్పోయింది.
-
రోహిత్ @ 50*
టీమిండియా సారథి రోహిత్ శర్మ అర్థసెంచరీ పూర్తి చేశాడు. 35 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సులతో 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తన అర్థ సెంచరీని పూర్త చేసుకున్నాడు. 157.56 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు.
-
-
15 ఓవర్లకు భారత్ స్కోర్..
15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ నష్టపోయి 134 పరుగులు సాధించింది. క్రీజులో రోహిత్ 55(35 బంతులు, 1 ఫోర్, 5సిక్స్‌లు), వెంకటేష్ అయ్యర్ 5 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
తొలి వికెట్ కోల్పోయిన భారత్..
కేఎల్ రాహుల్ (65పరుగులు, 45 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. సౌతీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గ్లెన్ ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 13.2 ఓవర్లలో న్యూటీమిండియా 117 పరుగుల వద్ధ తొలి వికెట్‌ను కోల్పోయింది.
-
T20Iలలో అత్యధికంగా 100+ భాగస్వామ్యాలు :
13 రోహిత్ శర్మ* 12 బాబర్ ఆజం/మార్టిన్ గప్టిల్ 11 డేవిడ్ వార్నర్
-
టీ20ల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు
5 బాబర్ – రిజ్వాన్ (22 ఇన్నింగ్స్‌లు) 5 రోహిత్ – రాహుల్ (27) 4 గప్టిల్ – విలియమ్సన్ (30) 4 రోహిత్ – ధావన్ (52)
-
ఓపెనర్ల 100 పరుగుల భాగస్వామ్యం
154 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. కేఎల్ రాహుల్ 59(45 బంతులు, 5 ఫోర్లు, 2 సిక్స్), రోహిత్ 37(26 బంతులు, 1ఫోర్, 3సిక్స్‌లు) పరుగులతో బ్యాటింగ్ చేస్తూ టీమిండియా స్కోర్‌ను 71 బంతుల్లోనే 100 పరుగులు దాటించారు. అలాగే ఇద్దరు కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు.
-
రాహుల్ @ 50*
టీమిండియా ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించారు. అయితే మొదటి నుంచి బౌండరీలతో దూకుడిగా ఆడిన రాహుల్, ఈ మ్యాచులో మరో అర్థసెంచరీ పూర్తి చేశాడు. దీంతో టీ20ఐలో తన 16 వ అర్థ సెంచరీ సాధించాడు. 43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 57 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 132.56 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు.
-
10 ఓవర్లకు భారత్ స్కోర్..
పది ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 79 పరుగులు సాధించింది. క్రీజులో కేఎల్ రాహుల్ 45(38 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ 30(22 బంతులు, 3సిక్స్‌లు) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. సాంట్నర్ వేసిన 10 వ ఓవర్‌లో 2 సిక్స్‌లతో మొత్తం 16 రాబట్టారు.
-
T20Iలలో రాహుల్ – రోహిత్ చివరి ఐదు భాగస్వామ్యాలు:
140 vs Afg 70 vs Sco 86 vs Nam 50 vs NZ 52*vs NZ T20Iలలో ఐదు వరుస 50+ భాగస్వామ్యాలను నమోదు చేసిన మొదటి భారత జోడీగా సంచలనం నెలకొల్పారు.
-
8 ఓవర్లకు భారత్ స్కోర్ 57/0
ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 57 పరుగులు సాధించింది. క్రీజులో కేఎల్ రాహుల్ 39(32 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ 14(16 బంతులు, 1సిక్స్) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
ఓపెనర్ల 50 పరుగుల భాగస్వామ్యం
154 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. కేఎల్ రాహుల్ 36(29 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ 11(11 బంతులు, 1సిక్స్) పరుగులతో బ్యాటింగ్ చేస్తూ టీమిండియా స్కోర్‌ను 40 బంతుల్లోనే 50 పరుగులు దాటించారు. అలాగే ఇద్దరు కలిసి అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు.
-
పవర్ ప్లేలో టీమిండియా స్కోర్ 45/0
ఆరు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 45 పరుగులు సాధించింది. క్రీజులో కేఎల్ రాహుల్ 32(26 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ 10(10 బంతులు, 1సిక్స్) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
నాలుగు ఓవర్లకు భారత్ స్కోర్ 32/0
నాలుగు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 32 పరుగులు సాధించింది. క్రీజులో కేఎల్ రాహుల్ 22(19 బంతులు, 4 ఫోర్లు), రోహిత్ 8(5 బంతులు, సిక్స్) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
రెండు ఓవర్లకు భారత్ స్కోర్ 16/0
రెండు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 16 పరుగులు సాధించింది. క్రీజులో కేఎల్ రాహుల్ 15, రోహిత్ 0 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
IND vs NZ LIVE: మొదలైన టీమిండియా బ్యాటింగ్
న్యూజిలాండ్ ఇచ్చిన 154 పరుగుల లక్ష్యంతో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బరిలోకి దిగారు.
-
టీమిండియా టార్గెట్ 154
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 154 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
-
ఆరో వికెట్ డౌన్..
జేమ్స్ నీషమ్ (3) ఆరో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 17.6 ఓవర్లలో న్యూజిలాండ్ టీం 140 పరుగుల వద్ధ ఆరో వికెట్‌ను కోల్పోయింది.
-
రెండో వికెట్ దక్కించుకున్న హర్షల్ పటేల్..
గ్లెన్ ఫిలిప్స్ (34 పరుగులు, 21 బంతులు, ఫోర్, 3 సిక్సులు) ఐదో వికెట్‌గా హర్షల్ పటేల్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో న్యూజిలాండ్ టీం 16.3 ఓవర్లలో 137 పరుగుల వద్ధ ఐదో వికెట్‌ను కోల్పోయింది.
-
16 ఓవర్లకు కివీస్ స్కోర్ 128/4
16 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం నాలుగు వికెట్లు నష్టపోయి 128 పరుగులు సాధించింది. క్రీజులో గ్లెన్ ఫిలిప్స్ 26, జేమ్స్ నీషమ్ 1 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
నాలుగో వికెట్ కోల్పోయిన కివీస్..
టిమ్ సీపెర్ట్ (13 పరుగులు, 15 బంతులు) నాలుగో వికెట్‌గా అశ్విన్ బౌలింగ్‌లో భువనేశ్వర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో న్యూజిలాండ్ టీం 15.1 ఓవర్లలో 125 పరుగుల వద్ధ నాలుగో వికెట్‌ను కోల్పోయింది.
-
14 ఓవర్లకు కివీస్ స్కోర్ 114/3
14 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం మూడు వికెట్లు నష్టపోయి 114 పరుగులు సాధించింది. క్రీజులో గ్లెన్ ఫిలిప్స్ 17, టిమ్ సీఫెర్ట్ 11 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
మూడో వికెట్ కోల్పోయిన కివీస్..
డారిల్ మిచెల్ (31) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. డెబ్యూ మ్యాచులో హర్షల్ పటేల్ తన తొలి వికెట్‌ను పడగొట్టాడు. సూర్య కుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో న్యూజిలాండ్ టీం 11.2 ఓవర్లలో 90 పరుగుల వద్ధ మూడో వికెట్‌ను కోల్పోయింది.
-
10 ఓవర్లకు కివీస్ స్కోర్ 84/2
పది ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం రెండు వికెట్లు నష్టపోయి 84 పరుగులు సాధించింది. క్రీజులో డారిల్ మిచెల్ 29, గ్లెన్ ఫిలిప్స్ 1 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
మార్క్ చాప్‌మన్(21) ఔట్
మార్క్ చాప్‌మన్ (21 పరుగులు, 17 బంతులు, 3 ఫోర్లు) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో న్యూజిలాండ్ టీం 8.5 ఓవర్లలో 79 పరుగుల వద్ధ రెండో వికెట్‌ను కోల్పోయింది.
-
8 ఓవర్లకు కివీస్ స్కోర్ 73/1
ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం ఒక వికెట్ నష్టపోయి 73 పరుగులు సాధించింది. క్రీజులో డారిల్ మిచెల్ 25, మార్క్ చాప్మన్ 15 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
ఆరు ఓవర్లకు కివీస్ స్కోర్ 64/1
ఆరు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం ఒక వికెట్ నష్టపోయి 64 పరుగులు సాధించింది. క్రీజులో డారిల్ మిచెల్ 21, మార్క్ చాప్మన్ 11 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
తొలి వికెట్ డౌన్..
కివీస్ విధ్వంసకర ఆటగాడు మార్టిన్ గప్టిల్ (31 పరుగులు, 15 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీపర్ చాహర్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్ అద్భుత క్యాచ్‌కు ఔటయ్యాడు. దీంతో న్యూజిలాండ్ టీం 4.2 ఓవర్లలో 48 పరుగుల వద్ధ తొలి వికెట్‌ను కోల్పోయింది.
-
టీ 20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్
3231 మార్టిన్ గప్టిల్ 3227 విరాట్ కోహ్లీ 3086 రోహిత్ శర్మ 2608 ఆరోన్ ఫించ్ 2570 పాల్ స్టిర్లింగ్
-
నాలుగు ఓవర్లకు కివీస్ స్కోర్ 42/0..
నాలుగు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. క్రీజులో గప్టిల్ 25, డారిల్ మిచెల్ 16 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
రెండు ఓవర్లకు కివీస్ స్కోర్ 24/0..
రెండు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో గప్టిల్ 15, డారిల్ మిచెల్ 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
IND vs NZ LIVE: తొలి మ్యాచ్ ఆడనున్న హర్షల్ పటేల్
రెండో టీ20లో హర్షల్ పటేల్ తన తొలి మ్యాచ్‌ను ఆడనున్నాడు. టీమిండియా మాజీ పాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ నుంచి డెబ్యూ క్యాప్ అందుకున్నాడు.
? ? Congratulations to @HarshalPatel23 who is set to make his #TeamIndia debut. ? ?@Paytm #INDvNZ pic.twitter.com/n9IIPXFJQ7
— BCCI (@BCCI) November 19, 2021
-
IND vs NZ LIVE: టీమిండియా ప్లేయింగ్ XI
భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్
-
IND vs NZ LIVE: న్యూజిలాండ్ ప్లేయింగ్ XI
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్(కీపర్), జేమ్స్ నీషమ్, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ(కెప్టెన్), ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్
-
IND vs NZ LIVE: టాస్ గెలిచిన టీమిండియా
వరుసగా రెండోసారి రోహిత్ టాస్ గెలిచాడు. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
-
IND vs NZ LIVE: హర్షల్ పటేల్ డెబ్యూ క్యాప్ అందుకునే ఛాన్స్
హర్షల్ పటేల్ ఈరోజు న్యూజిలాండ్‌తో జరిగే రెండో టీ20లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. IPL 2021లో పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన హర్షల్ పటేల్.. 30 పైగా వికెట్లు పడగొట్టాడు.
-
IND vs NZ LIVE: మరికొద్దిసేపట్లో టాస్
రాంచిలో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ టీంల మధ్య జరగనున్న రెండో టీ20కి అంతా సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో టాస్ పడనుంది.
Hello & good evening from Ranchi ?
How excited are you for the 2nd #INDvNZ T20I❓
Just an hour away from LIVE action. ? ?@Paytm #TeamIndia pic.twitter.com/clyElIC0mr
— BCCI (@BCCI) November 19, 2021
Published On - Nov 19,2021 6:11 PM