IND vs NZ: దటీజ్ టీమిండియా.. ఫైనల్ మ్యాచ్‌కు ఫుల్ డిమాండ్.. ఒక్కో టిక్కెట్ ధరెంతో తెలుసా?

India vs New Zealand, Final: ఎట్టకేలకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చివరి పోరుకు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో తలపడేందుకు భారత్, న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో టిక్కెట్ రేట్లకు రెక్కలు వచ్చాయి. ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ను పీసీబీ క్యాష్ చేసుకోవాలని భారీగా ప్లాన్ చేస్తోంది. దీంతో టిక్కెట్ల రేట్లతో ఫ్యాన్స్‌కు షాకిస్తోంది.

IND vs NZ: దటీజ్ టీమిండియా.. ఫైనల్ మ్యాచ్‌కు ఫుల్ డిమాండ్.. ఒక్కో టిక్కెట్ ధరెంతో తెలుసా?
Ind Vs Nz Toss

Updated on: Mar 06, 2025 | 10:41 AM

India vs New Zealand Champions Trophy 2025 Final Ticket Price: భారత క్రికెట్ జట్టు ఎప్పుడు, ఎక్కడ ఆడినా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడుతోన్న రోహిత్ సేన.. టైటిల్ దిశగా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ, ఫైనల్ వరకు చేరుకుంది. ఇక ఆదివారం నాడు ట్రోఫీ పోరులో న్యూజిలాండ్ జట్టుతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. రోహిత్ శర్మ సేన మరో ఐసీసీ టైటిల్‌ను సాధించే దిశగా అన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో దుబాయ్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌కు టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ధరలు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇండియా vs న్యూజిలాండ్, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ టిక్కెట్ల ధరలు..

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫైనల్ జరగనుంది . ఇప్పటికే 25,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. టిక్కెట్ ధరలు సుమారుగా రూ. 6000 నుంచి గరిష్టంగా రూ. 283,000 వరకు ఉన్నాయంట. టీమిండియా ఫైనల్ చేరుకోవడంతో టిక్కెట్లకు విపరీతంగా డిమాండ్ ఏర్పడడంతో.. ధరలు కూడా అదే స్థాయిలో నిర్ణయించినట్లు పీసీబీ ప్రకటించింది. Geo.tv నివేదిక ప్రకారం, టిక్కెట్ల అమ్మకాల ద్వారా మొత్తం రూ. 2,12,90,3910 గా అంచనా వేసినట్లు తెలుస్తోంది. అన్ని టిక్కెట్ల ధరల వివరాలను ఓసారి చూద్దాం..

జనరల్ టిక్కెట్లు (15,000 సీట్లు): రూ. 6000 నుంచి రూ. 11,828లు

ఇవి కూడా చదవండి

ప్రీమియం, పెవిలియన్ విభాగాలు (5,000 సీట్లు): రూ. 11,828 నుంచి రూ. 28,387లు.

హాస్పిటాలిటీ (1,700 సీట్లు): రూ. 47,311 నుంచి రూ.283,871లుగా నిర్ణయించారు.

IND vs NZ ఫైనల్ పోరుకు రంగం సిద్ధం..

దుబాయ్ స్థానిక సమయం ప్రకారం ఉదయం 10.00 గంటల నుంచే గేట్లు ఓపెన్ చేయనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే, చివరి లీగ్ మ్యాచ్‌లో ఇరుజట్లు తలపడిన సంగతి తెలిసిందే. దీంతో టోర్నమెంట్‌లో ఈ రెండు జట్లు మరోసారి ఢీ కొనబోతున్నాయన్నమాట.

ఈ రెండు జట్ల మధ్య హిస్టరీ విషయానికి వస్తే, భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండూ 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఆడాయి. అక్కడ న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. అప్పట్లో ఐసీసీ నాకౌట్‌గా పిలిచేవారు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు కివీస్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో క్రిస్ కైర్న్స్ అజేయంగా సెంచరీ సాధించాడు. దీంతో కివీస్ జట్టు తొలి ఐసీసీ టైటిల్‌కు తీసుకెళ్లింది. సౌరవ్ గంగూలీ కూడా టీమిండియా తరపున 117 సెంచరీలు చేశాడు. కానీ, అతని ప్రయత్నాలు ఫలించలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..