IND vs NEP Highlights: నేపాల్‌పై విజయంతో సూపర్ 4 చేరిన రోహిత్ సేన.. పాక్‌తో మరోసారి ఢీ కొట్టనున్న భారత్..
Asia Cup 2023 India vs Nepal LHighlights in Telugu: ఆసియా కప్-2023 5వ లీగ్ మ్యాచ్‌లో భారత్, నేపాల్ మధ్య పోరు కొనసాగుతోంది. క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ముందు 231 పరుగుల టార్గెట్ నిలిచింది.
Asia Cup 2023 India vs Nepal Highlights in Telugu: 2023 ఆసియా కప్‌లో టీమిండియా సూపర్-4 రౌండ్‌లోకి ప్రవేశించింది. భారత జట్టు సెప్టెంబర్ 10న పాకిస్థాన్‌తో తలపడనుంది. వేదిక ఇంకా నిర్ణయించలేదు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో నేపాల్ జట్టుపై భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో 3 పాయింట్లు సాధించింది. ఈ గ్రూప్ నుంచి పాకిస్థాన్ జట్టు ఇప్పటికే 3 పాయింట్లతో సూపర్-4కి అర్హత సాధించింది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి నేపాల్ ఆసియా కప్ నుంచి నిష్క్రమించింది. రోహిత్ 74, గిల్ 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
ఆసియా కప్ 2023లో పాకిస్థాన్‌తో జరిగిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా వాష్ అయిన సంగతి తెలిసిందే. టీమిండియా ఇప్పుడు పూర్తి మ్యాచ్ ఆడాలని చూస్తోంది. టోర్నీలో రోహిత్ శర్మ జట్టు నేపాల్‌తో రెండో ఢీకొననుంది. సూపర్ 4కు చేరుకోవాలంటే రెండు జట్లకు విజయం తప్పనిసరి. అయితే ఈ మ్యాచ్‌పై వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయితే టీమిండియాకు మరో పాయింట్ దక్కుతుంది. దీంతో రోహిత్ సేన ఖాతాలో మొత్తం 2 పాయింట్లతో సూపర్ 4కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌కు ముందు, జస్ప్రీత్ బుమ్రా ముంబైకి తిరిగి వచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో మహ్మద్ షమీ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోవచ్చు. నేపాల్‌తో జరిగే మ్యాచ్‌తోనే భారత్-పాకిస్థాన్‌ల మధ్య పోటీ ఖరారు కానుంది. నేపాల్‌పై విజయం సాధించినా లేదా వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే, టీమిండియా సూపర్ 4కు చేరుకుంటుంది. సూపర్ 4లో సెప్టెంబర్ 10న భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
ఇరుజట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
నేపాల్ (ప్లేయింగ్ XI): కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్(కీపర్), రోహిత్ పౌడెల్(కెప్టెన్), భీమ్ షర్కి, సోంపాల్ కమీ, గుల్సన్ ఝా, దీపేంద్ర సింగ్ ఐరీ, కుశాల్ మల్లా, సందీప్ లామిచానే, కరణ్ కేసీ, లలిత్ రాజ్‌బన్షి.
LIVE Cricket Score & Updates
-
10 వికెట్ల తేడాతో విజయం..
ఆసియా కప్‌లో నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించడంతో టీమ్ ఇండియా టార్గెట్‌ను 145 పరుగులకు సవరించారు. దీంతో భారత్ 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా టార్గెట్‌ను చేరుకుంది.
-
100 పరుగులు దాటిన భారత్..
14 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 101 పరుగులు చేసింది. రోహిత్ 53, గిల్ 46 పరుగులతో ఆడుతున్నారు. మరో 54 బంతుల్లో 44 పరుగులు చేస్తే టీమిండియా విజయం సాధిస్తుంది.
-
-
5 ఓవర్లకు 31
5 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా వికెట నష్టపోకుండా 31 పరుగులు పూర్తి చేసింది.
-
23 ఓవర్లలో 145 టార్గెట్..
వర్షం కారణంగా రెండుసార్లు ఆగిపోయిన భారత్-నేపాల్ ఆసియాకప్ మ్యాచ్ రాత్రి 10:15 గంటలకు ప్రారంభం కానుంది. క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంను పరిశీలించిన అనంతరం అంపైర్లు భారత్‌కు 23 ఓవర్లలో 145 పరుగుల లక్ష్యాన్ని సవరించారు. వీటిలో 5 ఓవర్లు పవర్‌ప్లేతో ఉంటాయి.
-
వర్షంతో ఆగిన ఆట..
నేపాల్ భారత్‌కు 231 పరుగుల లక్ష్యాన్ని విధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 2.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 4, శుభ్‌మన్ గిల్ 12 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో ప్రస్తుతం వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది.
-
-
టీమిండియా టార్గెట్ 231
ఆసియా కప్-2023 5వ లీగ్ మ్యాచ్‌లో భారత్, నేపాల్ మధ్య పోరు కొనసాగుతోంది. క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ముందు 231 పరుగుల టార్గెట్ నిలిచింది.
-
7వ వికెట్ డౌన్..
41.1 ఓవర్లో నేపాల్ టీం 7 వ వికెట్‌ను కోల్పోయింది. హార్దిక్ బౌలింగ్‌లో దీపేంద్ర సింగ్ ఎల్బీగా వెనుదిరిగాడు. 41.1 ఓవర్లకు 194 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది.
-
వర్షం అంతరాయం తర్వాత మొదలైన మ్యాచ్..
37.5 ఓవర్ల తర్వాత మ్యాచ్‌కు వర్షం అంతరాయం ఇచ్చింది. ఆ తర్వాత వర్షం గ్యాప్ ఇవ్వడంతో మరలా మొదలైంది. ఈ క్రమంలో నేపాల్ టీం 40 ఓవర్లకు 184 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది.
-
వికెట్ల కోసం భారత బౌలర్ల తంటాలు..
నేపాల్ బ్యాటర్ల దెబ్బకు భారత బౌలర్లు ఇబ్బందులు పడుతున్నారు. వికెట్లు పడగొట్టడంలో మరోసారి చేతులెత్తేశారు. 37.5 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 178 పరగులు చేసింది.
-
150 దాటిన నేపాల్ స్కోర్..
నేపాల్ టీం 34 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది.
-
5వ వికెట్ డౌన్..
భారత బౌలర్లను ఇబ్బంది పెట్టిన నేపాల్ ఓపెనర్ ఆసిఫ్ (58) హాఫ్ సెంచరీ తర్వాత పెవిలియన్ చేరాడు. దీంతో నేపాల్ టీం 30 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది.
-
4వ వికెట్ డౌన్..
నేపాల్ టీం 23 ఓవర్లకు 4 వికెట్లకు 103 పరుగులు చేసింది.
-
మూడో వికెట్ డౌన్..
20 ఓవర్లలో నేపాల్ టీం 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. జడేజా మరోసారి తన అద్భుతమైన బౌలింగ్‌తో నేపాల్ టీంను ఇబ్బందుల్లోకి నెట్టాడు.
-
ఎట్టకేలకు వికెట్ దక్కించుకున్న భారత బౌలర్లు..
పవర్ ప్లే చివరి ఓవర్లో శార్దుల్ ఠాకూర్ నేపాట్ ఓపెనర్ భుర్టెల్ (38) వికెట్‌ను పడగొట్టాడు. దీంతో నేపాల్ టీం 65 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
-
IND vs NEP Live Score: 50 పరుగులు పూర్తి చేసిన నేపాల్..
నేపాల్ ఓపెనర్లు వికెట్ నష్టపోకుండా 9 ఓవర్లలో 53 పరుగులు చేశారు. రోహిత్ ముగ్గురు బౌలర్లను ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
-
ఫీల్డింగ్‌లోనూ తప్పిదాలు..
5 ఓవర్లలోపే భారత ఫీల్డర్లు 3సార్లు క్యాచ్‌లు మిస్ చేశారు. అటు బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమవుతుండగా.. ఇటు ఫీల్డర్లు కూడా క్యాచ్‌లు పట్టడంలో ఘోర తప్పిదాలు చేస్తున్నారు.
-
విఫలమైన టీమిండియా పేస్ దళం..
5 ఓవర్లు ముగిసే సరికి నేపాల్ టీం వికెట్ నష్టపోకుండా 23 పరుగులు సాధించింది. పసికూన నేపాల్‌పై ఆరంభ ఓవర్లలో వికెట్లు పడగొట్టడంలో షమీ, సిరాజ్ ఘోరంగా విఫలమయ్యారు.
-
ఇరుజట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
నేపాల్ (ప్లేయింగ్ XI): కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్(కీపర్), రోహిత్ పౌడెల్(కెప్టెన్), భీమ్ షర్కి, సోంపాల్ కమీ, గుల్సన్ ఝా, దీపేంద్ర సింగ్ ఐరీ, కుశాల్ మల్లా, సందీప్ లామిచానే, కరణ్ కేసీ, లలిత్ రాజ్‌బన్షి.
-
టాస్ గెలిచిన భారత్..
టాస్ గెలిచిన రోహిత్, తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో నేపాల్ టీం మొదట బ్యాటింగ్ చేయనుంది.
-
బుమ్రా భారత్ తిరిగి రావడానికి అసలు కారణం ఇదే..
బుమ్రా అకస్మాత్తుగా ఆసియా కప్ 2023ను విడిచిపెట్టి భారత్‌కు తిరిగి వచ్చాడు. అయితే, ఇప్పుడు బుమ్రా శ్రీలంక నుంచి భారత్‌కు రావడానికి గల కారణం స్పష్టమైంది. నిజానికి బుమ్రా తండ్రి అయ్యాడు. అతని భార్య సంజనా గణేశన్ ఒక అబ్బాయికి జన్మనిచ్చింది, అంగద్ అని పేరు పెట్టారు.
View this post on Instagram -
IND vs NEP Weather Update: భారత్-నేపాల్ మ్యాచ్‌లో వాతావరణం ఎలా ఉంటుంది?
పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ వర్షంతో రద్దయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నేపాల్‌తో మ్యాచ్‌లోనూ అదే పరిస్థితి. ఇక్కడ కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అక్యూవెదర్ ప్రకారం మ్యాచ్ సమయంలో 89 శాతం వర్షం పడుతుందని అంచనా వేసింది. Weather.com మ్యాచ్ సమయంలో 80 శాతం వర్షం పడుతుందని అంచనా వేసింది.
-
తొలిసారి నేపాల్‌తో తలపడనున్న భారత్..
ఆసియా కప్ 2023లో భారత జట్టు రెండో మ్యాచ్ ఆడనుంది. నేపాల్‌ను తొలిసారి ఢీకొట్టనుంది. పల్లెకెలెలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Published On - Sep 04,2023 2:06 PM