India Vs England: రెండో టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ జట్టుకు దూరం.!

India Vs England: తొలి టెస్టు విజయంతో జోష్ మీదున్న ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. రెండో టెస్టుకు ఆ జట్టు స్టార్ ప్లేయర్ ...

India Vs England: రెండో టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ జట్టుకు దూరం.!
India Vs England

Updated on: Feb 12, 2021 | 7:52 AM

India Vs England: తొలి టెస్టు విజయంతో జోష్ మీదున్న ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. రెండో టెస్టుకు ఆ జట్టు స్టార్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా దూరమయ్యాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆర్చర్ కుడి మోచేతికి గాయం అయిందని.. అందువల్ల అతడు రెండో టెస్టుకు దూరంగా ఉంటాడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

అయితే గాయం పెద్దదేమీ కాదని.. అతడు మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని పేర్కొంది. ఇక రొటేషన్ పద్దతిని అనుసరిస్తున్న ఇంగ్లాండ్ రెండో టెస్టుకు ఆండర్సన్ స్థానంలో బ్రాడ్‌ను తుది జట్టులోకి తీసుకోనుంది. అటు వికెట్ కీపర్ జోష్ బట్లర్ సైతం మిగతా మూడు టెస్టులకు అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. కాగా, చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ 227 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించిన సంగతి తెలిసిందే.

మరిన్ని చదవండి:

12 ఏళ్ల బుడతడు.. స్టాక్ మార్కెట్‌లో ఏకంగా రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!

ఫస్ట్ నైట్ రోజు భార్యను పట్టించుకోకుండా.. కంప్యూటర్‌తో.. నెట్టింట్లో రచ్చ.. రచ్చ..

డబ్బు పొదుపు చేయాలని చూస్తున్నారా ? నెలకు రూ. 10,000 పెట్టుబడి పెడితే.. రూ. 16 లక్షలు పొందొచ్చు. వివరాలు ఇవే.

Follow Us