IND vs ENG Day 1 Highlights: బ్యాజ్ బాల్‌కు కౌంటరిచ్చిన స్పిన్ బాల్.. తొలిరోజు టీమిండియాదే పైచేయి..
Yashasvi Jaiswal: తొలిరోజు ముగిసే సరికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 76 పరుగులతో, శుభ్‌మన్ గిల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. జైస్వాల్ తన టెస్టు కెరీర్‌లో రెండో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (24 పరుగులు) జాక్ లీచ్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అంతకుముందు హైదరాబాద్‌లో ఇంగ్లండ్ తరపున కెప్టెన్ బెన్ స్టోక్స్ అత్యధికంగా 70 పరుగులు చేశాడు. జానీ బెయిర్‌స్టో 37 పరుగులు, బెన్ డకెట్ 35 పరుగులు చేశారు.

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 246 పరుగులకు కుప్పకూలింది. అనంతరం తొలిరోజు ముగిసే సరికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 76 పరుగులతో, శుభ్‌మన్ గిల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. జైస్వాల్ తన టెస్టు కెరీర్‌లో రెండో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్ కంటే 127 పరుగులు వెనుకంజలో నిలిచింది.
కెప్టెన్ రోహిత్ శర్మ (24 పరుగులు) జాక్ లీచ్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అంతకుముందు హైదరాబాద్‌లో ఇంగ్లండ్ తరపున కెప్టెన్ బెన్ స్టోక్స్ అత్యధికంగా 70 పరుగులు చేశాడు. జానీ బెయిర్‌స్టో 37 పరుగులు, బెన్ డకెట్ 35 పరుగులు చేశారు.
Stumps on the opening day in Hyderabad! 🏟️
An eventful day with the bat and the ball 😎#TeamIndia move to 119/1, trail by 127 runs 👏
Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/iREFqMaXqS
— BCCI (@BCCI) January 25, 2024
భారత్ తరపున రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తలో 3 వికెట్లు తీశారు. కాగా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు తీశారు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 64.3 ఓవర్లలోనే ముగిసింది.
ఇరుజట్ల ప్లేయింగ్ 11..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్,
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




