మంచి టార్గెట్.. కానీ వాళ్లు కూడా ముదుర్లే..

ఐసీసీ వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీంఇండియా బ్యాటింగ్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. రోహిత్ శర్మ సెంచరీ చేసి ఔట్ కాగా.. కేఎల్ రాహుల్ 77 పరుగులు చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 26 పరుగులు చేసి భారీ షాట్‌కు యత్నించి ఔట్ అయ్యాడు. మంచి ఫాంలో ఉన్న హార్థిక్ పాండ్యా డకౌట్ అయ్యాడు. ఈ దశలో ధోనీ, పంత్‌లు కలిసి జట్టును ఆదుకొనే ప్రయత్నం […]

మంచి టార్గెట్.. కానీ వాళ్లు కూడా ముదుర్లే..

Edited By:

Updated on: Jul 02, 2019 | 7:11 PM

ఐసీసీ వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీంఇండియా బ్యాటింగ్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. రోహిత్ శర్మ సెంచరీ చేసి ఔట్ కాగా.. కేఎల్ రాహుల్ 77 పరుగులు చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 26 పరుగులు చేసి భారీ షాట్‌కు యత్నించి ఔట్ అయ్యాడు. మంచి ఫాంలో ఉన్న హార్థిక్ పాండ్యా డకౌట్ అయ్యాడు. ఈ దశలో ధోనీ, పంత్‌లు కలిసి జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. అయితే 48 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పంత్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత స్కోర్‌ను పెంచేందుకు ధోనీ ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. 35 పరుగులు చేసిన ధోని.. చివరి ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో ముస్తఫిజూర్ 5, షకీబ్, రుబెల్, సౌమ్య తలో వికెట్ తీశారు.