IND vs BAN 2nd Test: 3 ఏళ్ల తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్.. కాన్పూర్‌లో టీమిండియాకు కష్టమే?

|

Sep 23, 2024 | 6:44 AM

India vs Bangladesh 2nd test Cricket Match Live Streaming: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ అద్భుత విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో దాదాపు జట్టులోని ఆటగాళ్లందరూ మంచి ప్రదర్శన చేశారు. ఇప్పుడు రెండో మ్యాచ్ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది.

IND vs BAN 2nd Test: 3 ఏళ్ల తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్.. కాన్పూర్‌లో టీమిండియాకు కష్టమే?
Ind Vs Ban 2nd Test
Follow us on

India vs Bangladesh 2nd test Cricket Match Live Streaming: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ అద్భుత విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో దాదాపు జట్టులోని ఆటగాళ్లందరూ మంచి ప్రదర్శన చేశారు. ఇప్పుడు రెండో మ్యాచ్ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియాను కూడా ప్రకటించారు.

మ్యాచ్ గురించి పూర్తి వివరాలు..

భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

సెప్టెంబర్ 27 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.

ఇవి కూడా చదవండి

భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

సెప్టెంబర్ 27న ఉదయం 9.30 గంటలకు భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు టాస్‌ జరగనుంది.

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే రెండో టెస్టు మ్యాచ్‌ను ఏ OTTలో చూడొచ్చు?

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్‌ను జియో సినిమా యాప్, జియో సినిమా వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే రెండో టెస్టు మ్యాచ్‌ని ఏ ఛానెల్‌లో చూడొచ్చు?

భారతదేశం వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్‌ను స్పోర్ట్స్ 18-1SD, స్పోర్ట్స్ 18-1 HD, స్పోర్ట్స్ 18-2 హిందీ ఛానెల్‌లలో చూడవచ్చు.

IND vs BAN 2nd Test: కాన్పూర్ క్రికెట్ స్టేడియం గణాంకాలు..

గ్రీన్ పార్క్ స్టేడియంలో టీమిండియా అన్ని ఫార్మాట్లలో 38 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో పాల్గొంది. ఇందులో 17 మ్యాచ్‌లు గెలిచింది. 18 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 13 మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోరు భారత్ vs శ్రీలంక టెస్టుల్లో 676/7లుగా నమోదైంది.

రెండు జట్లు..

రెండో టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యస్సావి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.

టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), జకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షాద్మాన్ ఇస్లాం, షకీబ్ అల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్, జఖర్ అలీ అనిక్, తస్కిన్ అహ్మద్, లిటన్ దాస్, హసన్ మహమూద్, తైజుల్ ఇస్లాం హసన్ జాయ్, నహిద్ రాణా, ఖలీద్ అహ్మద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..