IND vs BAN: సిరీస్‌పై టీమిండియా కన్ను.. బంగ్లాదేశ్‌తో రెండో టీ20 మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడంటే?

|

Oct 07, 2024 | 10:36 AM

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గ్వాలియర్‌లోని మాధవరావ్ సింధియా క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం ( అక్టోబర్ 06) జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచాడు. ముందుగా బంగ్లాదేశ్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

IND vs BAN: సిరీస్‌పై టీమిండియా కన్ను.. బంగ్లాదేశ్‌తో రెండో టీ20 మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడంటే?
India Vs Bangladesh
Follow us on

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గ్వాలియర్‌లోని మాధవరావ్ సింధియా క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం ( అక్టోబర్ 06) జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచాడు. ముందుగా బంగ్లాదేశ్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టును కుప్పకూల్చడంలో టీమిండియా బౌలర్లు సఫలమయ్యారు. తొలి ఓవర్ 5వ బంతికి లిటన్ దాస్ (4) వికెట్ తీసిన అర్ష్ దీప్ సింగ్.. మూడో ఓవర్ తొలి బంతికే పర్వేజ్ హొస్సేన్ (8)కి పెవిలియన్ చూపించాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో తౌహిద్ హృదయ్ (12) ఔట్ కాగా, మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో మహ్మదుల్లా (1) వికెట్ కోల్పోయాడు. ఇక కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (27)ను అవుట్ చేయడంలో వాషింగ్టన్ సుందర్ సఫలమయ్యాడు. కాగా, మెహదీ హసన్ మిరాజ్ 32 బంతుల్లో అజేయంగా 35 పరుగులు చేసి జట్టు స్కోరును 100కు చేర్చాడు. చివరకు బంగ్లాదేశ్‌ను 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ చేయడంలో టీమిండియా బౌలర్లు సఫలీకృతులయ్యారు. భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ 3.5 ఓవర్లలో 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

128 పరుగుల సులువైన లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ మెరుపు ఆరంభాన్ని అందించారు. కానీ 16 పరుగుల వద్ద అభిషేక్ రనౌట్ అయ్యాడు. ఈ దశలో రంగంలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్ 14 బంతుల్లో 3 భారీ సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. అలాగే సంజూ శాంసన్ 19 బంతుల్లో 29 పరుగులు చేశాడు. ఐదో నంబర్‌లో బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా కేవలం 16 బంతుల్లోనే 2 సిక్సర్లు, 5 ఫోర్లతో అజేయంగా 39 పరుగులు చేసి 11.5 ఓవర్లలో టీమ్ ఇండియాను గెలిపించాడు. దీంతో తొలి మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

రెండో టీ20 మ్యాచ్ ఎప్పుడంటే?

మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు అక్టోబరు 9 న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరిగే రెండో టీ20లో భారత జట్టు గెలిస్తే సిరీస్ కైవసం చేసుకోవచ్చు. అలాగే, మూడో టీ20 మ్యాచ్ అక్టోబర్ 12 న జరగనుంది. ఈ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

జైషా అభినందనలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..