తొలి టీ20లో బంగ్లాదేశ్‌కు 128 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గ్వాలియర్‌లోని మాధవరావ్ సింధియా స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. భారత్ తరపున వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్ తలో 3 వికెట్లు తీశారు.
బంగ్లాదేశ్‌లో మెహదీ హసన్ మిరాజ్ 35, నజ్ముల్ హుస్సేన్ శాంటో 27 పరుగులు చేశారు. ఆ జట్టులోని ఆరుగురు బ్యాట్స్‌మెన్ 10 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయారు. భారత్ నుంచి వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, మయాంక్ యాదవ్ తలో వికెట్ తీయగా, ఒక బ్యాట్స్‌మెన్ కూడా రనౌట్ అయ్యారు.
రెండు జట్ల ప్లేయింగ్-11..
Innings Break!
A magnificent bowling performance restricts Bangladesh to 127 👏👏#TeamIndia‘s chase coming up shortly ⏳
Scorecard – https://t.co/Q8cyP5jXLe#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/Gu6wQLPXxg
— BCCI (@BCCI) October 6, 2024
భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.
బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), పర్వేజ్ హసన్ ఎమోన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), జాకర్ అలీ, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, మెహదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, మస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..