India vs Australia: విశాఖ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్.. మార్చి10 నుంచి టికెట్ల విక్రయాలు..
విశాఖ ఏసీఏ-వీడీసీఏ ఇంటర్నేషన్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్ జరుగనుంది. మార్చి 19వ తేదీన జరుగనున్న ఈ రెండో వన్డే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ఈ నెల 10వ తేదీ నుంచి విక్రయించనున్నారు.
విశాఖ ఏసీఏ-వీడీసీఏ ఇంటర్నేషన్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్ జరుగనుంది. మార్చి 19వ తేదీన జరుగనున్న ఈ రెండో వన్డే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ఈ నెల 10వ తేదీ నుంచి విక్రయించనున్నారు. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ సంఘం కార్యదర్శి ఎస్. గోపీనాథ రెడ్డి వివరాలను వెల్లడించారు. 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే, 13వ తేదీ నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయించనున్నట్లు తెలిపారు గోపీనాథ రెడ్డి. ఆఫ్‌లైన్‌లో టెకెట్ల విక్రయం కోసం.. మూడు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడెక్కడ అనేది త్వరలో తెలియజేస్తామన్నారాయన. ఇక ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు పేటీఎంలోనూ లభిస్తాయని తెలిపారు. ఇకపోతే టికెట్ల ధరలు రూ.600, రూ.1,500, రూ.2000, రూ.3000, రూ.3,500, రూ.6000గా ఉన్నాయి.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ నడుస్తోంది. ఈ ట్రోఫీలో 2-1 తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ నెల 9వ తేదీన ఆహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం వేదికగా జరుగనున్న నాలుగో టెస్ట్‌లో విజయం సాధించండి అత్యంత కీలకం. అయితే, ఈ టెస్ట్ సిరీస్ ముగియగానే.. భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ మొదలవ్వనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..