AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS Highlights: ప్రపంచకప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న భారత్.. 4 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం..

India vs Australia Champions Trophy 2025 Semis Highlights in Telugu: ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ కు 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది.

IND vs AUS Highlights: ప్రపంచకప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న భారత్.. 4 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం..
Ind Vs Aus 1st Semi Final
Venkata Chari
|

Updated on: Mar 04, 2025 | 9:47 PM

Share

India vs Australia Champions Trophy 2025 Semis Highlights in Telugu: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీం ఇండియా ఫైనల్‌కు చేరుకుంది. దుబాయ్‌లో జరిగిన తొలి సెమీ-ఫైనల్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది. టీం ఇండియా విజయంలో మహ్మద్ షమీ, విరాట్ కోహ్లీ హీరోలుగా నిలిచారు. ఈ ఇద్దరు తమ బలమైన ప్రదర్శనలతో ఆస్ట్రేలియాను ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. షమీ 3 వికెట్లు తీసి ఆస్ట్రేలియాను 264 పరుగులకే పరిమితం చేయగా, కోహ్లీ సెంచరీని కోల్పోయి ఉండవచ్చు.. కానీ, మరోసారి టీం ఇండియా ఛేజింగ్‌ను విజయవంతంగా నడిపించాడు.

ఇరు జట్లు:

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 04 Mar 2025 09:37 PM (IST)

    ఫైనల్ చేరిన భారత్..

    ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో ఓడించి టీం ఇండియా ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో 84 పరుగులతో చాలా ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడిన చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు.

  • 04 Mar 2025 09:36 PM (IST)

    భారత్ ఘన విజయం

    ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో ఓడించి టీం ఇండియా ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో 84 పరుగులతో చాలా ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడిన చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు.

  • 04 Mar 2025 09:30 PM (IST)

    విజయానికి మరో 6 పరుగులు

    47.3 ఓవర్లకు టీం ఇండియా 5 వికెట్లకు 259 పరుగులు చేసింది. భారత జట్టు విజయానికి 6 పరుగుల దూరంలో ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఉన్నారు.

  • 04 Mar 2025 09:07 PM (IST)

    కోహ్లీ ఔట్..

    42.4ఓవర్లు ముగిసేసరికి టీం ఇండియా 5 వికెట్లకు 225 పరుగులు చేసింది. భారత జట్టు విజయానికి 40 పరుగుల దూరంలో ఉంది. విరాట్ కోహ్లీ తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 84 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

  • 04 Mar 2025 08:52 PM (IST)

    విజయానికి మరో 67 పరుగుల దూరంలో

    39 ఓవర్లు ముగిసేసరికి టీం ఇండియా 4 వికెట్లకు 198 పరుగులు చేసింది. భారత జట్టు విజయానికి ఇంకా 67 పరుగుల దూరంలో ఉంది. విరాట్ కోహ్లీ తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

  • 04 Mar 2025 08:20 PM (IST)

    శ్రేయాస్ ఔట్

    27వ ఓవర్ రెండో బంతికి భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఇక్కడ శ్రేయాస్ అయ్యర్ 45 పరుగులు చేసి ఔటయ్యాడు. అయ్యర్ వరుసగా రెండో మ్యాచ్‌లో అర్ధశతకం సాధించలేకపోయాడు.

  • 04 Mar 2025 08:03 PM (IST)

    కోహ్లీ హాఫ్ సెంచరీ

    24 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు 2 వికెట్లకు 131 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కింగ్ కోహ్లీ తన 74వ హాఫ్ సెంచరీ సాధించాడు. 54 బంతుల్లో 4 ఫోర్లు ఉన్నాయి.

  • 04 Mar 2025 07:37 PM (IST)

    ఆచితూచి ఆడుతోన్న కోహ్లీ, శ్రేయాస్

    18 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు 2 వికెట్లకు 88 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 28 పరుగులు చేసి అవుట్ కాగా, శుభ్‌మాన్ గిల్ 8 పరుగులు చేసి అవుట్ అయ్యారు.

  • 04 Mar 2025 07:05 PM (IST)

    రోహిత్ ఔట్..

    ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో, టీమిండియా ఆస్ట్రేలియాపై 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తోంది. 7.5 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు రెండు వికెట్లు నష్టపోయి 43 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

  • 04 Mar 2025 06:52 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన భారత్..

    శుభ్మన్ గిల్ (8) పెవిలియన్ చేరడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. బెన్ డ్వార్షుయిస్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

  • 04 Mar 2025 06:03 PM (IST)

    టీమిండియా టార్గెట్ 265

    ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్‌లో టీమిండియాకు 265 పరుగుల టార్గెట్ అందింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు. 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది.

  • 04 Mar 2025 05:50 PM (IST)

    8వ వికెట్ కోల్పోయిన ఆసీస్

    47.1 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్ క్రీజులో ఉన్నారు. అలెక్స్ కారీ 60 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ డైరెక్ట్ త్రో ద్వారా అతను రనౌట్ అయ్యాడు.

  • 04 Mar 2025 05:09 PM (IST)

    పెవిలియన్ చేరిన మ్యాక్స్ వెల్

    అక్షర్ పటే్ అద్భుత బంతికి మ్యాక్స్‌వెల్ (7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 38 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు సాధించింది.

  • 04 Mar 2025 05:04 PM (IST)

    5వ వికెట్ కోల్పోయిన ఆసీస్

    37 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (73)ను మహ్మద్ షమీ బౌల్డ్ చేశాడు.

  • 04 Mar 2025 04:27 PM (IST)

    జడేజా దూకుడు..

    27 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు సాధించింది. రవీంద్ర జడేజా జోష్ ఇంగ్లిస్ (11 పరుగులు), మార్నస్ లాబుస్చాగ్నే (29 పరుగులు)లను పెవిలియన్‌కు పంపాడు.

  • 04 Mar 2025 04:12 PM (IST)

    3వ వికెట్ కోల్పోయిన ఆసీస్.. జడేజాకు చిక్కిన మార్నస్

    22వ ఓవర్లో 3వ బంతికి జడేజా డేంజరస్‌గా మారుతోన్న స్మిత్, మార్నస్ జోడీని విడదీశాడు. హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో టీమిండియాకు ప్రమాదకరంగా మారుతోన్న ఈ జోడీకి బ్రేకులు వేశాడు. మార్నస్ లాబుస్చాగ్నే 29 పరుగులు చేసి ఎల్బీగా పెవిలియన్ చేరాడు.

  • 04 Mar 2025 04:09 PM (IST)

    100 దాటిన ఆస్ట్రేలియా..

    20వ ఓవర్లో ఆస్ట్రేలియా 100 పరుగుల మార్కును దాటింది. అక్షర్ పటేల్ వేసిన 5వ బంతికి లాబుషేన్ సిక్స్ కొట్టి జట్టు స్కోరును 100 దాటించాడు. దీనితో, స్మిత్, లాబుస్చాగ్నే కూడా అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

  • 04 Mar 2025 03:49 PM (IST)

    వికెట్‌కు బంతి తగిలినా.. బెయిల్స్ పడలే

    14వ ఓవర్లో స్టీవ్ స్మిత్ కి లైఫ్ దక్కింది. అక్షర్ పటేల్ వేసిన బంతి బ్యాట్ తర్వాత స్టంప్స్‌ను తాకింది. కానీ బెయిల్స్ పడలేదు. ఇటువంటి పరిస్థితిలో, స్మిత్ ఔట్ నుంచి తృటిలో తప్పించుకున్నాడు.

  • 04 Mar 2025 03:20 PM (IST)

    వరుణ్ మాయలో పడిన ట్రావిస్ హెడ్..

    రోహిత్ శర్మ ట్రావిస్ హెడ్ వికెట్ కోసం వరుణ్ చక్రవర్తిని రంగంలోకి దింపాడు. ఈ ప్లాన్ చక్కగా పని చేసింది. వరుణ్ వేసిన రెండో బంతికి భారీ షాక్ ఆడిన హెడ్ గిల్ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ 39 పరుగులు (33 బంతులు) (5 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశాడు.

  • 04 Mar 2025 03:01 PM (IST)

    హెడ్ ఊచకోత షురూ..

    5 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా జట్టు ఒక వికెట్ కోల్పోయి 31 పరుగులు చేసింది. హెడ్ కేవలం 20 బంతుల్లో 26 పరుగులు (4 పోర్లే, 1 సిక్స్)తో భారత బౌలర్లపై విరుచుకపడుతున్నాడు. తొలి ఓవర్‌లో దక్కిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకుంటున్నాడు.

  • 04 Mar 2025 02:50 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా 3 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 4 పరుగులు చేసింది. కూపర్ కొన్నోలీ (0) షమీ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్లోనే ట్రావిస్ హెడ్ క్యాచ్ ను మహ్మద్ షమీ వదిలేసిన సంగతి తెలిసిందే.

  • 04 Mar 2025 02:39 PM (IST)

    తొలి ఓవర్లోనే హెడ్ క్యాచ్‌ను వదిలేసిన షమీ..

    ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ట్రావిస్ హెడ్ క్యాచ్‌ను మహ్మద్ షమీ వదిలేశాడు. ఆ ఓవర్‌లోని రెండవ బంతిని అతను మంచి లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు. హెడ్ ​​దానిని ఆపాలనుకున్నాడు. కానీ, బంతి బ్యాట్ బయటి అంచును తీసుకొని షమీ వద్దకు వెళ్ళింది. షమీ కూడా ప్రయత్నించాడు. కానీ, బంతి అతని చేతిలోంచి జారిపోయింది.

  • 04 Mar 2025 02:13 PM (IST)

    14వ సారి టాస్ ఓడిన రోహిత్

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 14వ సారి టాస్ ఓడిపోయాడు. ఐసీసీ టోర్నమెంట్లలో రోహిత్ శర్మకు టాస్ అస్సలు అనుకూలంగా రావడం లేదు.

  • 04 Mar 2025 02:08 PM (IST)

    భారత్

    భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

  • 04 Mar 2025 02:08 PM (IST)

    ఆస్ట్రేలియా

    ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (wk), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ.

  • 04 Mar 2025 02:05 PM (IST)

    టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

    కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో రోహిత్ సేన ఛేజింగ్ చేయనుంది.

  • 04 Mar 2025 01:57 PM (IST)

    ఐసీసీ నాకౌట్‌లో హోరాహోరీ

    ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో భారత్, ఆస్ట్రేలియా 8 సార్లు తలపడ్డాయి. ఈ కాలంలో, రెండు జట్లు 4-4 మ్యాచ్‌ల్లో గెలిచాయి. కానీ గత 3 ICC నాకౌట్‌లలో, ఆస్ట్రేలియా జట్టు గెలిచింది.

  • 04 Mar 2025 01:55 PM (IST)

    ఐసిసి వన్డే టోర్నమెంట్లలో రికార్డులు

    ఐసిసి వన్డే టోర్నమెంట్‌లో హెడ్ టు హెడ్ రికార్డు గురించి మాట్లాడుకుంటే, రెండు జట్ల మధ్య 18 మ్యాచ్‌లు జరిగాయి. ఈ కాలంలో ఆస్ట్రేలియా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, టీం ఇండియా 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ అసంపూర్ణంగా ఉంది.

  • 04 Mar 2025 01:53 PM (IST)

    దుబాయ్‌లో ఆస్ట్రేలియా రికార్డు..

    దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా ఇప్పటివరకు 5 వన్డే మ్యాచ్‌లు ఆడింది. ఈ కాలంలో, ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌ల్లో గెలిచి, 1 మ్యాచ్‌లో మాత్రమే ఓటమి పాలైంది. అయితే, ఆస్ట్రేలియా చివరిసారిగా 2019 సంవత్సరంలో దుబాయ్‌లో వన్డే ఆడింది. అంటే, దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఇక్కడ వన్డే మ్యాచ్ ఆడనుంది.

  • 04 Mar 2025 01:50 PM (IST)

    సెమీఫైనల్‌కు భారత్ ప్రయాణం

    ఈ టోర్నమెంట్‌లో టీం ఇండియా తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో, టీం ఇండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. చివరి గ్రూప్ దశ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 44 పరుగుల తేడాతో ఓడించింది. గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఏకైక జట్టు భారత జట్టుగా నిలిచింది.

  • 04 Mar 2025 01:46 PM (IST)

    దుబాయ్ పిచ్ పరిస్థితి ఎలా ఉంటుంది?

    భారత జట్టు అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడింది. మూడు మ్యాచ్‌లలోనూ పిచ్ నెమ్మదిగా ఉంది. స్కోరు 250 దాటలేకపోయింది. ఇటువంటి పరిస్థితిలో, ఈ మ్యాచ్‌లోనూ ఇలాంటిదే ఉండొచ్చు.

Published On - Mar 04,2025 1:44 PM