Australia vs India, 5th Test: భారత్‌తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 5వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 181 పరుగులకు ఆలౌటైంది. 9/1 స్కోరుతో శనివారం ఆట ప్రారంభించిన కంగారూ జట్టు 172 పరుగుల వద్ద చివరి 9 వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల ఆధిక్యం లభించింది. సిడ్నీలో జరుగుతున్న మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా జట్టు తరఫున అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న బ్యూ వెబ్‌స్టర్ అత్యధిక స్కోరు 57 పరుగులు చేశాడు. స్టీవ్ స్మిత్ 33, సామ్ కొన్‌స్టాస్ 23 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లు తీశారు. జస్ప్రీత్ బుమ్రా, నితీష్ కుమార్ తలో 2 వికెట్లు తీశారు.
శుక్రవారం మ్యాచ్‌లో తొలిరోజు భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది. 5 టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం ఆతిథ్య జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది.
Sharp catches from Virat Kohli and KL Rahul and Nitish Kumar Reddy gets two wickets in quick succession!
Australia 8⃣ down now
Live – https://t.co/NFmndHLfxu#TeamIndia | #AUSvIND pic.twitter.com/G9xpI4UpRG
— BCCI (@BCCI) January 4, 2025
భారత్: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాన్స్, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..