IND vs AUS: ఎంసీజీలో దూకుడు పెంచిన సిరాజ్, బుమ్రా.. 6 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా..

|

Dec 29, 2024 | 8:46 AM

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 369 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 85 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మొత్తం ఆధిక్యం 190 పరుగులకు చేరుకుంది.

IND vs AUS: ఎంసీజీలో దూకుడు పెంచిన సిరాజ్, బుమ్రా.. 6 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా..
ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం నుంచి జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశాడు. కాగా రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. ఆ తర్వాత అడిలైడ్ టెస్టులో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో బుమ్రా 9 వికెట్లు పడగొట్టాడు.
Follow us on

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 369 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 91 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మొత్తం ఆధిక్యం 196 పరుగులకు చేరుకుంది. మార్నస్ లాబుషాగ్నే 43 ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా అలెక్స్ కారీ (2) మిచెల్ మార్ష్ (0) ట్రావిస్ హెడ్ (1 పరుగు), సామ్ కాన్స్టాస్ (8 పరుగులు) వికెట్లు తీసి, టెస్టులో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అదే సమయంలో స్టీవ్ స్మిత్ (13 పరుగులు), ఉస్మాన్ ఖవాజా (21 పరుగులు)లను మహ్మద్ సిరాజ్ పెవిలియన్ పంపాడు.

ఇరు జట్లు…

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాన్స్, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..