AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi : యువరాజ్, రైనా రికార్డులు బ్రేక్.. ఇంగ్లండ్‌లో సిక్సర్ల వర్షం కురిపిస్తున్న 14 ఏళ్ల కుర్రాడు

భారత అండర్-19 బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ అండర్-19పై జరుగుతున్న యూత్ వన్డేలలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. యువరాజ్ సింగ్, సురేష్ రైనా వంటి దిగ్గజాల రికార్డులను బద్దలు కొడుతూ, త్వరలో సెంచరీ సాధిస్తే ప్రపంచ రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

Vaibhav Suryavanshi : యువరాజ్, రైనా రికార్డులు బ్రేక్..  ఇంగ్లండ్‌లో సిక్సర్ల వర్షం కురిపిస్తున్న 14 ఏళ్ల కుర్రాడు
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: Jul 03, 2025 | 4:30 PM

Share

Vaibhav Suryavanshi : ఇంగ్లండ్ అండర్-19తో జరుగుతున్న యూత్ వన్డేలలో భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. తన మెరుపు బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ గడ్డపై పరుగులు వరద పారిస్తున్నాడు. మూడో వన్డేలో ఈ 14 ఏళ్ల కుర్రాడు కేవలం 31 బంతుల్లో 86 పరుగులు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. వైభవ్ కేవలం 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో తొమ్మిది సిక్స్ లు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో 48 (19), 45 (34).. ఇప్పుడు 86 (31) పరుగులు చేశాడు. ప్రస్తుతం తను భారతదేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ యూత్ సెన్సేషన్ ఈ ఏడాది ప్రారంభంలో ఐపీఎల్‌లో కూడా అదరగొట్టి, ఇప్పుడు అండర్-19 స్థాయిలో ఒకదాని తర్వాత ఒకటి రికార్డులను బద్దలు కొడుతున్నాడు.

తన ఇన్నింగ్స్ సమయంలో వైభవ్ సూర్యవంశీ భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సురేష్ రైనాను బీట్ చేశాడు. భారత తరఫున అత్యంత వేగవంతమైన 50+ స్కోరులో బెస్ట్ స్టైక్ రేట్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. యువరాజ్ సింగ్ 2000లో ఆస్ట్రేలియా అండర్-19పై 25 బంతుల్లో 58 పరుగులు (స్ట్రైక్ రేట్ 232) చేశాడు. రైనా 2004లో స్కాట్లాండ్ అండర్-19పై 38 బంతుల్లో 90 పరుగులు (స్ట్రైక్ రేట్ 236.84) చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు 277.41 స్ట్రైక్ రేట్‌తో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అగ్రస్థానంలో భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ ఉన్నాడు. అతను 2016లో నేపాల్ అండర్-19పై 37 బంతుల్లో 78 పరుగులు చేశాడు.

రాబోయే మ్యాచ్‌లలో వైభవ్ సూర్యవంశీ సెంచరీ సాధిస్తే, అతను యూత్ వన్డేలలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేస్తాడు. ప్రస్తుతం, సర్ఫారాజ్ ఖాన్ పేరు మీద ఈ రికార్డు ఉంది. అతను 2013లో సౌతాఫ్రికా అండర్-19పై 15ఏళ్ల 338 రోజుల వయస్సులో సెంచరీ సాధించాడు. సూర్యవంశీ సెంచరీ సాధిస్తే, అతను యూత్ వన్డేలలో సెంచరీ చేసిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా మారతాడు. బంగ్లాదేశ్‌కు చెందిన నజ్ముల్ హుస్సేన్ శాంటో పేరు మీద ఈ రికార్డు ఉంది. అతను 2013లో శ్రీలంక అండర్-19పై 14 సంవత్సరాల 241 రోజుల వయస్సులో సెంచరీ సాధించాడు.

యూత్ వన్డేలలో అత్యంత వేగవంతమైన సెంచరీని పాకిస్తాన్‌కు చెందిన కమ్రాన్ గులామ్ నమోదు చేశాడు. అతను 2013లో ఇంగ్లండ్ అండర్-19పై 53 బంతుల్లో సెంచరీ సాధించాడు. భారత తరఫున, రాజ్ అంగద్ బావా యూత్ వన్డేలలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. ఈ ఆల్‌రౌండర్ 2022 అండర్-19 ప్రపంచ కప్‌లో ఉగాండాపై 69 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ ప్రపంచ కప్‌ను భారతదేశం గెలుచుకుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..