T20 World Cup 2024: మరో రెండు వారాల్లో టీ20 ప్రపంచ కప్..టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదిగో..

|

May 18, 2024 | 8:30 PM

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక T20 ప్రపంచ కప్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జూన్ 2 నుండి ఈ పొట్టి ప్రపంచకప్ సమరం స్టార్ట్ కానుంది. వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహించనున్న ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. జూన్ 5న భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది

T20 World Cup 2024: మరో రెండు వారాల్లో టీ20 ప్రపంచ కప్..టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదిగో..
Team India
Follow us on

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక T20 ప్రపంచ కప్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జూన్ 2 నుండి ఈ పొట్టి ప్రపంచకప్ సమరం స్టార్ట్ కానుంది. వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహించనున్న ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. జూన్ 5న భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. మరి మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న ఈ మెగా క్రికెట్ టోర్నీలో టీమిండియా మ్యాచులు, టైమింగ్స్, వేదికల వివరాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం రండి.

టీమిండియా షెడ్యూల్..

  • జూన్ 5 (బుధవారం) భారత్ vs ఐర్లాండ్: టీం ఇండియా తన తొలి మ్యాచ్‌ని ఐర్లాండ్‌తో ఆడనుంది. జూన్ 5న జరిగే ఈ మ్యాచ్ కు న్యూయార్క్‌లోని నసావు స్టేడియం మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
  • జూన్ 9 (ఆదివారం) భారత్ వర్సెస్ పాకిస్థాన్: చిరకాల ప్రత్యర్థులు భారత్ , పాకిస్తాన్ జూన్ 9న తలపడనున్నాయి, ఈ మ్యాచ్ కూడా న్యూయార్క్‌లోని కొత్త క్రికెట్ స్టేడియం నసావు ఇంటర్నేషనల్ గ్రౌండ్‌లో జరగనుంది.
  • జూన్ 12 (బుధవారం) భారత్ వర్సెస్ అమెరికా: టీ20 ప్రపంచకప్‌లో భారత్-అమెరికా జట్ల మధ్య జూన్ 12న జరగనుంది. ఈ మ్యాచ్ కు కూడా న్యూయార్క్‌లోని నసావు స్టేడియం వేదిక కానుంది.
    జూన్ 15 (శనివారం) భారత్ వర్సెస్ కెనడా: అమెరికాలోని లాడర్‌హిల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ స్టేడియం వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 33వ మ్యాచ్‌లో భారత్, కెనడా తలపడనున్నాయి.
  • ఈ నాలుగు లీగ్ మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8 దశకు చేరుకుంటాయి. ఆ తర్వాత 8 జట్ల మధ్య సూపర్-8 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులోంచి టాప్-4 జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.

టీ 20 ప్రపంచకప్ మ్యాచ్ లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి.

ఇవి కూడా చదవండి

T20 ప్రపంచ కప్ 2024 గ్రూపులు..

గ్రూప్ ఏ: ఇండియా, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్‌ఏ

గ్రూప్ బి: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్

గ్రూప్ సి: న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పాపువా న్యూ గినియా

గ్రూప్ డి: దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..