AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెల్లింగ్టన్‌లో టీమ్ ఇండియా సరికొత్త చరిత్ర.. 4.5 ఓవర్లలోనే 100 పరుగులు!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 పోరులో టీమ్ ఇండియా బ్యాటర్లు సునామీ సృష్టించారు. వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పారు. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత్ తరఫున అత్యంత వేగంగా జట్టు వంద పరుగులు (Fastest Team 100s) పూర్తి చేసిన రికార్డును నమోదు చేశారు.

వెల్లింగ్టన్‌లో టీమ్ ఇండియా సరికొత్త చరిత్ర.. 4.5 ఓవర్లలోనే 100 పరుగులు!
Ind Vs Nz 3rd T20i Abhishek Sharma Vaibhav
Venkata Chari
|

Updated on: Oct 27, 2026 | 3:00 PM

Share

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 పోరులో టీమ్ ఇండియా బ్యాటర్లు సునామీ సృష్టించారు. వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పారు. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత్ తరఫున అత్యంత వేగంగా జట్టు వంద పరుగులు (Fastest Team 100s) పూర్తి చేసిన రికార్డును నమోదు చేశారు.

టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా 100 పరుగులు సాధించిన జాబితా:

  • 4.5 ఓవర్లు – vs న్యూజిలాండ్, వెల్లింగ్టన్, 2026 (నేటి మ్యాచ్‌)

  • 5.6 ఓవర్లు – vs ఆఫ్ఘనిస్తాన్, ఢిల్లీ, 2026

  • 6.3 ఓవర్లు – vs ఇంగ్లాండ్, ముంబై (వాంఖడే), 2025

  • 6.3 ఓవర్లు – vs న్యూజిలాండ్, గౌహతి, 2026

  • 6.5 ఓవర్లు – vs నమీబియా, ఢిల్లీ, 2026

పవర్‌ప్లేలో ఆల్-టైమ్ రికార్డు స్కోరు (104*)..

ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ల విధ్వంసకర ఆటకు పవర్‌ప్లే నిదర్శనంగా నిలిచింది. టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్ తరఫున అత్యధిక పవర్‌ప్లే స్కోరు (104)* నమోదు చేసి సరికొత్త మైలురాయిని తాకారు. గతంలో ఆఫ్ఘనిస్తాన్‌పై వికెట్ నష్టపోకుండా సాధించిన 100 పరుగుల రికార్డును బ్రేక్ చేస్తూ టీమ్ ఇండియా ఈ ఘనత సాధించింది.

అభిషేక్ శర్మ కేవలం 15 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం సాధించి ఈ ఇన్నింగ్స్‌ను మరింత హైలైట్ చేయగా, డగౌట్ మరియు ఫ్యాన్స్ అందరూ నిలబడి అపూర్వ స్వాగతం పలికారు.

Follow Us