IND vs ENG: ముగిసిన టీ20 సమరం.. భారత్, ఇంగ్లండ్ వన్డే సిరీస్‌ లైవ్ స్ట్రీమింగ్ పూర్తి వివరాలు మీకోసం..

India vs England ODI Series Schedule: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ టీవీలో, డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. టీ20 సిరీస్‌లో భారత్ విజయం సాధించిన తరువాత, వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్ళు తిరిగి రావడం విశేషం. మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి.

IND vs ENG: ముగిసిన టీ20 సమరం.. భారత్, ఇంగ్లండ్ వన్డే సిరీస్‌ లైవ్ స్ట్రీమింగ్ పూర్తి వివరాలు మీకోసం..
Ind Vs Eng Odi Series
Follow us
Venkata Chari

|

Updated on: Feb 03, 2025 | 3:06 PM

India vs England ODI Live Streaming Details: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ముగిసింది. ఈ సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్‌లో చివరి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత జట్టు 150 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తుఫాన్ సెంచరీతో భారత్‌ను 247 పరుగుల భారీ స్కోరుకు తీసుకెళ్లాడు. టీ-20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌లో కూడా మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తోంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరగనుంది. వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి వెటరన్‌లు భారత జట్టులోకి తిరిగి రానున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఈ సిరీస్ భారత జట్టుకు చాలా కీలకం కానుంది. ఈ భారీ ఐసీసీ టోర్నీకి ముందు భారత్ తన సన్నాహాలను పరీక్షించుకోవడానికి ఇదే చివరి అవకాశం. టీ20 సిరీస్‌లో మహ్మద్ షమీకి పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటువంటి పరిస్థితిలో, భారత జట్టు ఈ వన్డే సిరీస్‌తో అతని ఫామ్, ఫిట్‌నెస్ రెండింటినీ చెక్ చేయాలనుకుంటోంది.

ఇండియా vs ఇంగ్లండ్ వన్డే సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలు..

ఇరుజట్ల మధ్య జరిగే టీ-20 సిరీస్‌ను స్టార్ స్పోర్ట్స్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీనితో పాటు, ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసారం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జరిగింది. స్పోర్ట్స్ 18 ఛానెల్‌కు భారత జట్టు స్వదేశంలో జరిగే అన్ని మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులు ఉన్నాయి. అయితే, ఇప్పుడు జియో, స్టార్ విలీనం తర్వాత, ప్రసారంలో మార్పులు కనిపించాయి. స్పోర్ట్స్ 18లో భారత మహిళల క్రికెట్ జట్టుతో పాటు దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లు ప్రసారం కానుండగా, పురుషుల జట్టు మ్యాచ్‌ల ప్రసారంలో మార్పులు జరిగాయి.

ఇవి కూడా చదవండి

భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే వన్డే సిరీస్‌ను స్టార్ స్పోర్ట్స్‌లో మాత్రమే టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీనితో పాటు, స్ట్రీమింగ్ కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మాత్రమే కొనసాగుతుంది. వన్డే సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..