AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 3rd Test:భారత్, ఇంగ్లాండ్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి

లార్డ్స్ టెస్ట్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తమ మొదటి ఇన్నింగ్స్‌లలో 387 పరుగుల చొప్పున సాధించి చరిత్ర సృష్టించాయి. ఇది లార్డ్స్‌లో తొలిసారి కాగా, భారత క్రికెట్ చరిత్రలో మూడోసారి మాత్రమే ఇలా జరిగింది. ఈ అరుదైన సంఘటన గతంలో ఇలా జరిగిన మ్యాచ్‌లు కూడా ఉన్నాయి.

IND vs ENG 3rd Test:భారత్, ఇంగ్లాండ్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి
India Vs England
Rakesh
|

Updated on: Jul 13, 2025 | 2:22 PM

Share

IND vs ENG 3rd Test: భారత క్రికెట్ జట్టు చరిత్రలో మూడోసారి మాత్రమే ఒక టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తర్వాత రెండు జట్ల స్కోర్లు సమానంగా ఉన్నాయి.. అంటే ఏ జట్టుకు ఆధిక్యం లభించలేదు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న భారత్ vs ఇంగ్లాండ్ మూడో టెస్ట్‌లో ఇలాంటి అరుదైన సంఘటనే జరిగింది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో సరిగ్గా 387 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకు ముందు, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు కూడా సరిగ్గా 387 పరుగులే చేసింది.

లార్డ్స్‌లో జరుగుతున్న ఈ టెస్ట్‌లో బెన్ స్టోక్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి రోజు ఆటలో 251 పరుగులు నమోదయ్యాయి. రెండో రోజున జో రూట్ తన సెంచరీ(104) పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. చివరిలో జామీ స్మిత్ 51 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరును 387కి చేర్చాడు. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ సెంచరీ(100) చేశాడు. కరుణ్ నాయర్(40), రిషబ్ పంత్(74), రవీంద్ర జడేజా(72) కీలక పరుగులు చేశారు. చివరి బ్యాటింగ్ జోడీగా వచ్చిన సిరాజ్, వాషింగ్టన్ సుందర్ స్కోరును 387 పరుగులకు సమం చేయగానే అవుట్ అయ్యారు.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో రెండు జట్ల స్కోర్లు సమానంగా ఉండటం ఇది కేవలం 9వ సారి మాత్రమే. చివరిసారిగా ఇలా 2015లో లీడ్స్‌లో జరిగింది. ఆ మ్యాచ్‌ను న్యూజిలాండ్ గెలిచింది. అంతకు ముందు జరిగిన అలాంటి 8 మ్యాచ్‌లలో 6 డ్రాగా ముగిశాయి.. అందులో రెండు మ్యాచ్‌లు టీమిండియా కూడా ఉన్నాయి. భారత క్రికెట్ చరిత్రలో మొదటి ఇన్నింగ్స్ తర్వాత రెండు జట్ల స్కోర్లు సమానంగా ఉండటం ఇది మూడోసారి. ఇంతకు ముందు జరిగిన రెండు సందర్భాలలోనూ మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్‌తో చివరిసారిగా ఇలా 1986లో జరిగింది. 1958లో కాన్పూర్‌లో జరిగిన భారత్-వెస్టిండీస్ మ్యాచ్, 1986లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఇంగ్లాండ్-భారత్ మ్యాచ్ కూడా డ్రాగా ముగిశాయి.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొదటి ఇన్నింగ్స్‌లో రెండు జట్ల స్కోర్లు సమానంగా ఉన్న మ్యాచ్‌లు మొత్తం తొమ్మిది ఉన్నాయి. ఈ జాబితాలో 1910లో దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్, 1973లో పాకిస్థాన్-న్యూజిలాండ్, వెస్టిండీస్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లు ఉన్నాయి. అలాగే, 1994లో వెస్టిండీస్-ఇంగ్లాండ్, 2003లో వెస్టిండీస్-ఆస్ట్రేలియా, 2015లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లలో చాలా వరకు డ్రాగా ముగిశాయి, కానీ 2003, 2015లో జరిగిన మ్యాచ్‌లను వెస్టిండీస్, న్యూజిలాండ్ గెలిచాయి. ఇప్పుడు 2025లో ఇంగ్లాండ్-భారత్ మ్యాచ్ కూడా ఈ జాబితాలో చేరింది.

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ చరిత్రలో ఒక టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో రెండు జట్ల స్కోర్లు సమానంగా ఉండడం ఇదే మొదటిసారి. భారత్ vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో మొదటి టెస్ట్‌ను ఇంగ్లాండ్, రెండో టెస్ట్‌ను భారత్ గెలిచాయి.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..