AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubman Gill : గర్ల్ ప్రెండ్ పేరు అడగ్గానే శుభమన్ గిల్ ఏమన్నాడో తెలుసా.. అభిషేక్ శర్మ వీడియో వైరల్

శుభ్‌మన్ గిల్ తన చిన్ననాటి స్నేహితుడు అభిషేక్ శర్మకు కూడా తన గర్ల్‌ఫ్రెండ్ గురించి చెప్పలేదు. పాత వీడియోలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గర్ల్‌ఫ్రెండ్ గురించి అడగ్గానే గిల్ ఏమని సమాధానం ఇచ్చాడో ఇక్కడ తెలుసుకుందాం.

Shubman Gill : గర్ల్ ప్రెండ్ పేరు అడగ్గానే శుభమన్ గిల్ ఏమన్నాడో తెలుసా.. అభిషేక్ శర్మ వీడియో వైరల్
Abhishek Sharma
Rakesh
|

Updated on: Jul 13, 2025 | 3:25 PM

Share

Shubman Gill : భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్‎కు గర్ల్‌ఫ్రెండ్ ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం శుభ్‌మన్ గిల్ తన చిన్ననాటి స్నేహితుడికి కూడా చెప్పలేదు. ఒకే గురువు దగ్గర శిక్షణ తీసుకుని క్రికెట్ నేర్చుకుంటూ పెరిగిన స్నేహితుడికి కూడా గర్ల్‌ఫ్రెండ్ గురించి అడిగితే గిల్ ఏదో సాకు చెప్పాడు.శుభ్‌మన్ గిల్‎ను గర్ల్‌ఫ్రెండ్ గురించి అడిగిన ఆ స్నేహితుడు మరెవరో కాదు.. అభిషేక్ శర్మ. సోషల్ మీడియాలో శుభ్‌మన్, అభిషేక్ ల పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఇద్దరి మధ్య క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సమాధానాల సెషన్ జరుగుతోంది. ఈ వీడియో కొన్ని పాత క్లిప్‌లతో కలిపి చేసినట్లు ఉంది. వీడియోలో అభిషేక్ ప్రశ్నలు అడుగుతుంటే.. శుభ్‌మన్ వాటికి సమాధానాలు చెబుతున్నాడు. ఆ ప్రశ్నలలో శుభ్‌మన్ గిల్ గర్ల్‌ఫ్రెండ్ గురించి కూడా ఒకటి ఉంది. ఈ వీడియోలో అభిషేక్, శుభ్‌మన్ వీడియో కాల్ లో మాట్లాడుకుంటున్నారు.

అభిషేక్ శర్మ శుభ్‌మన్ గిల్ ను గర్ల్‌ఫ్రెండ్ గురించి సూటిగా అడగలేదు. కొంచెం తిప్పి అడిగాడు. “గర్ల్‌ఫ్రెండ్ పేరు ఏమిటని ఒకరు అడుగుతున్నారు?” అని అభిషేక్ అడిగాడు. దీనికి శుభ్‌మన్ గిల్ సమాధానం చెప్పకుండా.. “నీ వాయిస్ సరిగ్గా వినిపించడం లేదు” అని సాకు చెప్పాడు. శుభ్‌మన్ అలా చెప్పగానే అభిషేక్ కూడా నవ్వుతూ.. “ఇప్పుడు ఎలాగైనా వాయిస్ కట్ అవుతుందిలే!” అని వ్యంగ్యంగా అన్నాడు.

ఈ వీడియో చాలా పాతది అని స్పష్టంగా తెలుస్తోంది. అయితే, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఇప్పుడు తమ క్రికెట్ ప్రయాణంలో చాలా ఎదిగారు. శుభ్‌మన్ గిల్ ఇప్పుడు టీమిండియా కెప్టెన్‌గా ఉన్నాడు. అభిషేక్ శర్మ కూడా భారత వైట్ బాల్ జట్టులో స్థానం సంపాదించుకున్నారు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..