IND vs NZ 3rd ODI: 90 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచిన భారత్..

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మంగళవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత్ 3-0తో సిరీస్‌ని కూడా కైవసం చేసుకోవడమే

IND vs NZ 3rd ODI:  90 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచిన భారత్..
India Won By 90 Runs Against Nz
Follow us

|

Updated on: Jan 24, 2023 | 10:00 PM

భారత్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మంగళవారం(జనవరి 24) జరిగిన మూడో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత్ 3-0తో సిరీస్‌ని కూడా కైవసం చేసుకోవడమే కాక 2023 వన్డేల్లో తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. మూడో మ్యాచ్‌లో భాగంగా తొలుత టాస్ గెలిచిన కివీస్ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫలితంగా భారత్ బ్యాటింగ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శుభమాన్ గిల్, రోహిత్ శర్మ దూకుడుగా ఆడడమే కాక ఇద్దరూ శతకాలతో చెలరేగారు. గిల్, రోహిత్ రాణిస్తున్న క్రమంలో హిట్ మ్యాన్ 101(85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) వద్ద ఔటయ్యాడు.

అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ కూడా నిదానంగా ఆడుతున్న క్రమంలో గిల్ 112 (78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగుల వద్ద పెవీలియన్ బాట పట్టాడు.  ఆ తర్వాత కోహ్లీ కొంతమేర రాణించి 36 పరుగులతో వెనుదిరిగాడు. అనంతరం మిడిలార్డర్‌లో వచ్చిన వారంతా విఫలమవుతున్న తరుణంలో హార్దిక్ పాండ్యా 54 పరుగులతో మెప్పించాడు. మరో వైపు శార్దూల్ ఠాకూర్ కూడా 17 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే నిర్ణీత ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్కర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా బ్రేస్వెల్ ఒక వికెట్ తీశాడు.

మెప్పించిన శార్దూల్, కుల్దీప్:

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కివీస్ జట్టు ఆరంభంలోనే హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫిన్ అలెన్‌ను డకౌట్ చేశాడు. అనంతరం డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్ రెండో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో న్యూజిలాండ్‌ తరపున పరుగుల వర్షం కురిపించారు కొంతమేర. ఈ క్రమంలోనే కుల్దీప్ బౌలింగ్‌లో హెన్రీ నికోలస్ 42 పరుగుల వద్ద తన వికెట్ కోల్పోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్, టామ్ లాథమ్‌, గ్రెన్ ఫిలిప్స్‌‌లను శార్దూల్ ఠాకుర్ పెవీలియన్ దారి పట్టించడంతో న్యూజిలాండ్ నిరూత్సాహపడినట్లయింది. అయితే నాన్ స్ట్రైకర్‌గా వచ్చిన డెవీన్ కెన్వాయ్ సెంచరీతో మెరిసాడు. మొత్తం వంద బంతుల్లో 8 సిక్సర్లు, 12 ఫోర్లతో 138 పరుగులు చేసిన కన్వాయ్ 32వ ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో తన వికెట్ కోల్పోయాడు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత వచ్చిన వారిలో బ్రేస్‌వెల్(26), సాన్ట్నార్(34) మినహా వచ్చినవారంతా చేతులేత్తేశారు. ఫలితంగా 42 ఓవర్లోనే కివీస్ జట్టు తన 10 వికెట్లను కోల్పోయి 295 పరుగులకే పరిమితమయింది. ఫలితంగా న్యూజిలాండ్ టీమ్‌పై భారత్ 90 పరుగుల తేడాతో మూడో మ్యాచ్ గెలవడంతో పాటు వన్డే సిరీస్‌ను 3-0 తన సొంతం చేసుకుంది. మూడో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ శార్దూల్ ఠాకూర్ కాగా, మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా శుభమాన్ గిల్ నిలిచాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..