AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup: 39 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలో తొలిసారి.. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు.. సరికొత్త చరిత్ర సృష్టించేనా?

India and Pakistan: ఈసారి ఆసియా కప్ ఫైనల్‌కు భారత జట్టు అర్హత సాధించింది. సూపర్-4 దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన టీమిండియా ఫైనల్‌లోకి ప్రవేశించింది. మరోవైపు పాకిస్థాన్ జట్టుకు ఫైనల్‌కు చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ తర్వాత 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఆ సమయంలో పాకిస్థాన్ 180 పరుగుల తేడాతో టీమ్ ఇండియాను ఓడించి టైటిల్ గెలుచుకుంది. అప్పటి నుంచి ఇరు జట్లు అనేక టోర్నీల్లో తలపడినా ఫైనల్‌ ఆడలేదు.

Asia Cup: 39 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలో తొలిసారి.. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు.. సరికొత్త చరిత్ర సృష్టించేనా?
India Vs Pakistan Final
Venkata Chari
|

Updated on: Sep 13, 2023 | 8:54 PM

Share

Asia Cup History India vs Pakistan: ఇది ఆశ్చర్యంగా అనిపించినా.. కచ్చితంగా నమ్మాల్సిందే. ఎందుకంటే ఇది నిజం కాబట్టి. ఆసియా కప్ ఫైనల్స్‌లో భారత్‌, పాకిస్థాన్‌లు ఇంతవరకు ఎప్పుడూ తలపడలేదన్నది వాస్తవం. అంటే 1984లో మొదలైన ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు మొత్తం 10 సార్లు ఫైనల్ ఆడింది. మరోవైపు పాకిస్థాన్ జట్టు కూడా 5 సార్లు ఫైనల్‌కు చేరింది. అయితే, ఈ ఫైనల్స్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు ఎప్పుడూ తలపడకపోవడం విశేషం. ఇలా ఈసారి ఫైనల్‌లో సంప్రదాయ ప్రత్యర్థులు తలపడితే సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది.

ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్‌ల స్టోరీ?

ఈ ఏడాది ఆసియా కప్ ఫైనల్‌కు భారత జట్టు అర్హత సాధించింది. సూపర్-4 దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన టీమిండియా ఫైనల్‌లోకి ప్రవేశించింది. మరోవైపు పాకిస్థాన్ జట్టుకు ఫైనల్‌కు చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అంటే, శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు గెలిస్తే ఫైనల్‌లో ఇండో-పాక్‌లు తలపడతాయి. లంకపై పాకిస్థాన్ ఓడిపోతే భారత్-శ్రీలంకలు ఫైనల్ ఆడుతాయి.

ఇవి కూడా చదవండి

అందుకే శ్రీలంకపై పాకిస్థాన్ విజయంపై క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ఆసియా కప్ ఫైనల్‌లో భారత్-పాక్ మధ్య ఫైనల్ పోరు జరగడం ఇదే తొలిసారి.

ఇండో – పాక్ ఫైనల్ ఈసారైనా జరిగేనా..

భారత్-పాకిస్థాన్ జట్లు 2 సార్లు మాత్రమే ఫైనల్ ఆడాయి. 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇరు జట్లు తొలిసారి తలపడ్డాయి. ఆ రోజు పాకిస్థాన్‌పై భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది.

ఆ తర్వాత 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఆ సమయంలో పాకిస్థాన్ 180 పరుగుల తేడాతో టీమ్ ఇండియాను ఓడించి టైటిల్ గెలుచుకుంది. అప్పటి నుంచి ఇరు జట్లు అనేక టోర్నీల్లో తలపడినా ఫైనల్‌ ఆడలేదు. దీంతో ఈసారి ఆసియాకప్ ఫైనల్ పోరులో ఇండో-పాక్ పోరు తప్పదని భావిస్తున్నారు.

1984 నుంచి 2022 వరకు ఆసియా కప్ విజేతల జాబితా
సంవత్సరం విజేత జట్టు రన్నరప్ జట్టు  మ్యాచ్ వేదిక
1984 భారతదేశం శ్రీలంక UAE
1986 శ్రీలంక పాకిస్తాన్ శ్రీలంక
1988 భారతదేశం శ్రీలంక బంగ్లాదేశ్
1991 భారతదేశం శ్రీలంక భారతదేశం
1995 భారతదేశం శ్రీలంక UAE
1997 శ్రీలంక భారతదేశం శ్రీలంక
2000 పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్
2004 శ్రీలంక భారతదేశం శ్రీలంక
2008 శ్రీలంక భారతదేశం పాకిస్తాన్
2010 భారతదేశం శ్రీలంక శ్రీలంక
2012 పాకిస్తాన్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్
2014 శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్
2016 భారతదేశం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్
2018 భారతదేశం బంగ్లాదేశ్ UAE
2022 శ్రీలంక పాకిస్తాన్ UAE

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..